వెనక్కితిరిగి చూసుకుంటే
వెక్కిరిస్తూ కనిపిస్తోంది జీవితం.
అమ్మానాన్నలు ఆదిదంపతులై
నావిషయంలో చూపిన ఓర్పుసహనాలు,
నాపైచూపినప్రేమాభిమానాలు,
మరోవైపు నేనువారిపైచూపిన నిర్లక్ష్యం,అలక్ష్యాలు,
తీయనిగుర్తులై నన్నలరిస్తూ ఉన్నాయి.
నన్ను ఆవేదనకు గురిచేస్తున్నాయి.
వారివిలువను గుర్తించనివ్వనినాఅజ్ఞాన ముర్ఖత్వాలు,
నామనసుకుఎందుకోమరి ఇంత అలుసు.
వదిలివెళ్ళిన నాన్న ఎలాగూరారని తెలుసు.
ఐనా,ఎదురుగాఉన్న అమ్మంటే కూడా,
నా మనసును గెలవనివ్వటం లేదు
గతంలోని నా ప్రవర్తన,
నన్నునన్నుగా నిలవనివ్వటం లేదు.
ఇప్పటికీనాలోరాని పరివర్తన,
అమ్మప్రేమను కీర్తించటమెలాగో,
అమ్మానాన్నలను తలవనివ్వటం లేదు.
మారటమెలాగో,మార్పును చేరటమెలాగో
తెలియటం లేదు.
నాన్నవిలువను గుర్తించటమెలాగో
వారినిఎదలో దర్శించటమెలాగో,
ఎదుటే స్పర్శించటమెలాగో తెలియటంలేదు.
***
No comments:
Post a Comment