పార్వతీ కళ్యాణం- చిరస్మరణీయం
ఓరుగంటి సుబ్రహ్మణ్యం
కూచిపూడి నాట్యగురువు భాగవతుల వేంకటరామశర్మగారి నేత్రుత్వంలో నృత్య అకాడెమి విజయవాడ బృందం ఆదివారం తే. 12.1.2020న 'కుమారసంభవం' అను పార్వతీ కళ్యాణం నృత్య రూపకం నవీ ముంబయిలో ప్రదర్శించారు. నటినటులందరూ తమ పాత్రలో లీనమై రూపకానికి వన్నె తెచ్చారు. ప్రేక్షకులు నిశబ్ధంగా ఆద్యంతం నృత్యరూపకం తిలకించి పులకించారు.
అటు చిత్రసీమలోను, ఇటు రంగస్థలమ్మీద రాణిస్తున్న ధ్వన్యనుకరణ యువ కళాకారుడు రమేష్ నవ్వుల జల్లులు కురిపిస్తూ సంక్రాంతినాడు ముంబయి తెలుగువాళ్ళను కడుపుబ్బ నవ్వించి వినోదాన్ని పంచారు. నాలుగుదశాబ్ధాలుగా సంస్థకు ఎనలేని సేవలందించిన వి.కోటయ్యనాయుడుగారిని కార్యవర్గం జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది. కార్యక్రమాలన్నీ తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంధర్భంగా జరిగాయి.
తెలుగు కళా సమితికి వస్తున్న విరాళాలను సమితి ప్రాంగణాభివృద్ధికి, మెరుగైన సంగీత, సాహిత్య సాంస్క్రుతిక కార్యక్రమాలకు వినియోగిస్తామని అధ్యక్షులు బండి నారాయణరెడ్డి , ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి కొండారెడ్డి సభకు వక్కాణించారు. వందన సమర్పణతో సంక్రాంతి వేడుకలు ముగిశాయి.
No comments:
Post a Comment