ప్రతీ
విషయంలో పాజిటివ్ గా ఉండగలమా? అని
ప్రశ్నించుకుందాం. 300 అడుగులఎత్తునుంచి
దూకతావా? అని ఎవరైనాఅడిగినప్పుడు.. “తప్పకుండా
దూకుతాను.నేను పాజిటివ్ థింకరు" అంటే
చాలా తప్పు. కొన్ని విషయాల్లో ప్రశ్నించుకోవాలి. దానినే QuestionThinkingఅంటారు.
అంటే..రియలిస్టిక్ థింకింగ్ అన్నమాట దీన్నిPossibility
Thinking అని కూడాపిలుచుకోవచ్చు. అది
ఎలా పెంపొందించుకోవాలనే అంశాన్ని పరిశీలిద్దాం.
1. ఫలితం: ఫలితం మంచిగా ఉండేలా
ఆలోచించడం.
2. ప్లాసిబో
ఎఫెక్ట్: ఈ ప్లాసిబో ఎఫెక్ట్ గురించి అందరికీ తెలిసిందే. రోగాన్ని తగ్గించేమందు
కాకపోయినప్పటికీ అది మందు అనినమ్మినప్పుడు
అది మందులా పనిచేసి రోగాన్నితగ్గించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.'Boilogy of Belief, 'Anatomy of an illnessఅనే
ప్రపంచ ప్రఖ్యాత పుస్తకాల్లో.. మనిషి ఆలోచనద్వారా శారీరక ఆరోగ్యాన్ని మెరుగు
చేసుకోగలడనిచాలా గొప్పగా వివరించారు.
3. పాజిటివ్
సెల్పాటాక్: ప్రతి మనిషి తన గురించి తాను ఆలోచించుకునేటప్పుడు, తను చేసిన పనులను, తన
గురించి తాను విశ్లేషించుకునేటప్పుడు పూర్తిగా పాజిటివ్ గా ఉండాలి. దీనివల్ల తనపై
తనకు ఆత్మగౌరవం పెరుగుతుంది. ఆత్మగౌరవం వల్లఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఆత్మవిశ్వాసంతోప్రవర్తించడం వల్ల మంచి ఫలితాలొస్తాయి.
4. కరడుకట్టిన
సానుకూలవాది :Optimism అంటే
సానుకూలంగా ఉండడం అంటే పాజిటివ్ గా ఉండడంలో కఠినమైన మనస్తత్వంతో ఉండడం. నెగెటివ్
కు అస్సలు ఛాన్స్ ఇవ్వకుండా పాజిటివ్ గా ఆలోచించడంఅన్నమాట. పాజిటివ్ గా ఇలా
ఉండడమనేది ఒకరకమైన జీవనశైలి. ఇటువంటి వారు Cause
&Effect ను ఎక్కువగా నమ్ముతారు. ప్రతి ఫలితానికిఒక హేతువు (కారణం, ప్రేరకం) ఉంటుందనేది చెప్తుందా సిద్ధాంతం. స్పీచ్ నొక్కితే లైట్
వెలుగుతుంది. స్విచ్ ఎవరు వేసినా లైట్/బల్బు వెలుగుతుందనేది తర్కం. ఈ తర్కంతోనే
మంచిఫలితాలను పొందడానికి కఠినం (Tough)గా,పాజిటివ్ గా ఉంటారు.
5. మర్ఫీస్ "లా";తప్పిదం
జరిగే అవకాశం, వుంటే తప్పిదం జరగవచ్చు" అనేది
ఈ సూత్రం చెప్తుంది. పాజిటివ్ గా వున్నప్పటికీ గుడ్డిగాప్రవర్తించకుండా తప్పిదాలు
జరిగే విషయంలో చాలా జాగ్రత్త పడాలి. ఉదాహరణకు.. 300 అడుగులఎత్తునుంచి
దూకడం.
6.ఛాలెంజ్:
నెగెటివ్ విషయాలు ఎక్కువైతే మనల్ని మనమే ఛాలెంజ్ చేసుకుంటూ శక్తి యుక్తులను
ఉపయోగించి పాజిటివ్ గా ఆలోచించాలి. ఒకపదార్థాన్ని రుచి చూడాలంటే ఆ పదార్థాన్ని కనీసంనాలుకపై
వేసుకోవాలి లేదా తినాలి. అలాగే మనఆలోచనా తీరును ఛాలెంజ్ చెయ్యాలంటే
ముందుగాప్రయత్నాన్ని మొదలుపెట్టాలి. ఈత కొట్టాలంటే నీటిలోకి దిగాలి. ఒడ్డున
కూర్చుని చూస్తూవుంటే ఈత కొట్టడం రాదు.
7. నమ్మకం:
నమ్మకమనేది ఒక మానసిక ముద్ర. నమ్మకాల
ప్రభావం మన ప్రవర్తనపై ఎంతగానోఉంటుంది. పాట సరిగ్గా పాడడం రాకపోయినా
పాడటానికిసిద్ధమవుతారు కొందరు. పాట చాలా బాగా పాడడంవచ్చినప్పటికీ పాడటానికి సిద్ధం
కారు మరికొందరు.కారణం.. ఆ మూడే.. అనుమానం, భయం, సమస్యకనుక నమ్మకాన్ని పాజిటివ్ గా పెంచుకుంటే థింకింగ్పాజిటివ్ గా
వుంటుంది. నమ్మకమనేది పెంపొందించుకున్న ఒక
మానసిక ముద్ర.
1984వ
సంవత్సరంలో విశాల భారతదేశంలోకేవలం మూడు షార్లమెంట్ మెంబర్ సీటు
దక్కించుకున్న పార్టీ ఇప్పుడు మూడు
వందలకు పైగాఎం.పి. సీట్లను గెలుచుకుంది. ప్రతీ ఎలక్షన్లోనెగ్గినా.. ఓడినా..
పార్టీకి వచ్చిన ఓట్లు సంఖ్య పెరుగుతోందా? లేదా? అని విశ్లేషించుకుంటూ,నమ్మకంతో
పరిపాలించే స్థితికి వచ్చారు. నమ్మకంఅనేది మన జీవిత ప్రయాణానికి ఇంధనం.
8. సమస్య
పరిష్కారం: పాజిటివ్ థింకింగ్ చెయ్యాలంటే పరిష్కారంపై దృష్టి
పెట్టాలి...సమస్యగురించి ఆలోచించడం కేవలం చర్చలకువాదనలకు మాత్రమే ఉపయోగపడుతుంది.
మనకుకావలసిన దానిపై దృష్టి పెట్టడం అనేది పాజిటివ్.వద్దు అనుకునే దానిపై దృష్టి
పెట్టడం అనేది నెగెటివ్.
9. పాజిటివ్
క్రియేటివ్ విజువలైజేషన్: మనంవిజేతగా సాధించాలనుకున్న
విజయాన్ని, ఆ విజయాన్నిచేరుకునే క్రమాన్ని పాజిటివ్ ఊహించుకోవాలి. సాధనద్వారా విజువలైజేషను
పద్ధతిగా చెయ్యవచ్చు. ఈప్రక్రియ మనల్ని పాజిటివ్ గా ఉండేటట్లు చెయ్యడమేకాకుండా
విజయ మార్గంవైపు ఉద్వేగంతోనడిపిస్తుంది.
10. స్టాక్
సీన్: అత్యవసరానికి పొదుపు డబ్బాలో డబ్బులు ఉపయోగపడినట్లు ఒక 'పాజిటివ్ ఇమేజ్ ను గుర్తుండేలా సాధన చెయ్యాలి. దీనినే బఫర్ స్టాక్ అని
కూడా అంటారు. ఉదాహరణకు .. ఫామిలి ఫొటో, చిన్నపిల్లల
ఫొటో.
11. పాజిటివ్
రైటింగ్: ప్రతిరోజు ఒక మంచివిషయం లేదా మంచి అనుభవం లేదా మంచి వ్యక్తి గురించి
ఒక పేపర్‌పై రాయడం ఒక మంచి అలవాటు. ఇది పాజిటివ్ థింకింగును చాలా మెరుగుపరుస్తుంది.
12. పాజిటివ్
అఫర్మేషన్స్: మంచి పాజిటివ్ స్టేట్మెంటులను ఒక లిస్ట్ గా తయారుచేసుకుని వాటిని
ప్రతిరోజు భావయుక్తంగా ఉద్వేగంతో తలుచుకోవాలి. ఉదాహరణకు.. ఈ రోజు ఒక గొప్పరోజు,నా జీవితానికి నేనే సారధిని, నా
భవిష్యత్తుకు నేనేశిల్పిని, నాకు
అన్ని శక్తియుక్తులు ఉన్నాయి.
13. వ్యతిరేక
భావాలు వద్దు: వ్యక్తులపై,వ్యవస్థలపై
వ్యతిరేక భావాలు పెంచుకోకూడదు.ద్వేషం, పగ, అసహ్యం , ఈర్ష్య, అసూయ,
అసహ్యం వంటి లక్షణాల వల్ల మన పాజిటివ్థింకింగ్ హరించుకుపోతుంది.
14. పాజిటివ్
పోస్టర్స్: పాజిటివ్ థింకింగ్ ను పెంచే మంచి కొటేషన్లు, బొమ్మలను
పోస్టర్స్ గాతయారు చేసుకుని కనిపించేలా పెట్టుకుని ఎప్పటికీపాజిటివ్ గా
ఉండేలాఉపయోగించుకోవాలి.
15. నెగెటివ్
అనుభవాలను తలచుకోవద్దు:జీవితంలో కొన్ని నెగెటివ్ అనుభవాలు
కలిగేసందర్భాలుంటాయి. ఆ అనుభవాలను తలచుకుని నెమరు వేసుకుంటే అవి మన
పాజిటివ్థింకింగ్ కు ఆటంకంగా మారుతాయి. వాటినిపాఠాలుగా తీర్చిదిద్దుకోవాలి.
16. పాజిటివ్
థింకర్స్: పాజిటివ్ గా ఆలోచించే వారితోనే సమయాన్ని గడపండి. మీలోస్ఫూర్తి
పెరుగుతుంది.
17. కృతజ్ఞతాభావం:
పాజిటివ్ థింకింగ్ లో కృతజ్ఞతాభావం ఒక భాగం.ఈ ప్రపంచంలో 70%
మందికి లేని సౌకర్యాలు మనకున్నాయి. కృతజ్ఞతతో ఉండాలి.
***
No comments:
Post a Comment