శివం - 60
హర సిద్ధుని కథ-2
రాజ కార్తీక్
ఈ విధంగా హరసిద్దుడు తనకు తన మనసే ముఖ్యంగా భావించి, పని చేసేవాడు. కొంత మంది దగ్గరతనం అడిగి తీసుకునేందుకు సిద్ధ మైన వారు చెప్పే మంచి మాటలకు లొంగి, వారు ఇచ్చిన విధంగా తీసుకునే వాడు.
జ్ఞానం ఉన్న మంచివాడని మోసం చేయటం ఎంత సేపు ? ఒకవేళ హర సిద్ధునికి తెలిసిన వాడి మోసం చేసినా, "క్షమించు హర సిద్ధ!" అని దీనంగా అడిగేవారు.
జాలి, దయ ఉన్న వీరుడ్ని గెలవటం ఎంతసేపు?
ఇలాంటివి మళ్లీ చేయకు అని సున్నితంగా మాటలాడి, మళ్లీ వాడి మాయలోనే పడేవాడు.
ఒకరు అలాగ చిన్న మోసం చేశారు హరసిద్దుని.
వారి బండారం బయట పెట్టిన తర్వాత వాడు క్షమాపణకు పును కోకుండా, హర సిద్ధునితో వాదం పెట్టుకున్నాడు.
"మేము వంద చెప్తాం, నువ్వు ఎందుకు చేశావ్? "అని హేళనగా మాట్లాడవారు.
ఇక వారికి,
హ సి "నేను వెయ్యి చేస్తాను. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? "అని వాడికి యమ భటుని వలె సమాధానం చెప్పాడు .
హర సిద్దుని మాటలు కోపంలో ఉన్నప్పుడు కటువుగా వాదనలా వుండేవి. అందుకే అందరికీ హరసిద్దుడు మదగజంలా కనపడే వాడు.
తన చనిపోయిన తండ్రిని ఏదో అన్నారని తన మేనమామతో జగడం పెట్టుకున్నాడు.
వద్దన్నా వినకుండా తన తల్లి వారికి పనులు చేస్తోందని, "ఎందుకు ఇలా చేశావ్?" అని గదిమేవాడు. అది చూసిన వారందరికీ తల్లిని కూడా ఇలా అంటున్నడా అనిపించేది...
తనకు అంతగా ధన సముపార్జన లేదని అందరూ తక్కువగా చూసేవారు.
దానికి "ఆ దేవుడు కూడా మోసం చేసేవాళ్ళకి, డబ్బు ఉన్నవాళ్ళకే డబ్బు ఇస్తాడు. నా లాంటి పేదవాడి జీవితం అంటే ఆ శివయ్యకు కూడా చులకన "అని అనుకునేవాడు.
అపుడు హర సిద్ధుని మనసులో తను నమ్మిన తన ఆచార్యులు కనపడ్డారు..
హర సిద్ధునికి తన ఆచార్యులంటే ఎంతో ఇష్టం. తన తండ్రి దగ్గర కన్నా, ఆయన దగ్గర ఎంతో ప్రేమ పొందానని అనుకున్నాడు. కానీ హర సిద్ధునికి ధనం వచ్చే మార్గాలు వచ్చినా, చేయ గలిగి కూడా ఆచార్యులు వారు కావాలని అడ్డుపడేవారు. తనకు డబ్బు సర్దే వారిని తన పలుకు బడి వాడి నిరోధించేవాడు. ఒక బిడ్డ తన తండ్రిని "ఎందుకు మీరు నాకోసం ఈ పని చేయరు?" అని అడిగిన విధంగా కటువుగా, బాధగా అడిగేవాడు. "నీ పిల్లలకి ఇలా జరిగితే అర్దం అవుతుంది" అని అనేవాడు.
అందులో సహజంగా రెండు మాటలు నోరు జారి మళ్లీ క్షమించమని అడిగేవాడు. కానీ ఎదుటి వారికి కోపంలో అన్నది కానీ, ముందు నుండి వేడుకుంది కానీ కనపడదు కదా. నమ్ముకున్న వారిని మోసం చేయటం అనేది ఎంత బాధ పెడుతుందో చెప్పే పనిలేదు కదా!
లోకంలో సహజంగా మంచి వారు తక్కువ కదా ! అలాగే హర సిద్ధునికి స్నేహితులు కూడా.
తనతో పని చేయించుకున్న స్నేహితులు పని అవ్వగానే హరసిద్దుని లౌక్యంగా తప్పించుకోవడం మొదలు పెట్టేవారు. లౌక్యం తెలియని హర సిద్ధునికి ఏమి అర్దం అవుతుంది?
ఇలా మనుషుల దగ్గర మోసపోయి, నిజంగా మంచి వారి దగ్గర, తన మనసుకు నచ్చిన వారి దగ్గర కాలం గడిపేవాడు హరసిద్ధుడు.
భక్తులారా! బాధ పడకండి. మంచితనం ఎప్పుడూ మీకు అక్కరకు వస్తుంది. ఎవరి కోసమూ మీరు మీ మంచితనాన్ని వదులు కొకండి. మంచి వాడు బాధ పడవచ్చు ...కానీ అంతిమగా పుణ్యం మూట కట్టుకుంటాడు. చెడ్డ వాడు సుఖంగా ఉండవచ్చు, కానీ అంతిమగా అనుభవిస్తాడు.
తాత "ఒరేయ్ హర సిద్ధా! గుంట నక్కల వద్ద సింహం లాగా ఉండాలి. మంచిగా మాట్లాడితే వారిని మంచివారని అనుకోకు. నాతో ఇలా ఉన్నవు సరే. నేను కూడా మోసం చేస్తా అప్పుడు ఏమి చేస్తావు..చెప్పు " అన్నాడు.
హ.సి "ఏమి చేస్తాను తాత? మనుషుల మీద పూర్తిగా నమ్మకాన్ని కోల్పోతా. ఆ శివయ్య దేవుడే విది, కర్మ అని మోసం చేస్తే ఏమి చేస్తాము .."అని నవ్వుతూ అన్నాడు.
"తప్పు నాయనా ! శివయ్య ఎవరిని మోసం చేశాడు? అయన నీకు ఏమన్నా చెప్పాడా .."
అనేసరికి తాత, హర సిద్దు ఎవరా అని అటు తిరిగి చుసారు.
ఇక వాదన మొదలయ్యింది. ఏమి జరుగుతుందో అని తాత చూస్తున్నాడు.
హ సి ..."అవునా ....." అన్నాడు సందిగ్ధంగా!
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment