శ్రీధరమాధురి - 72 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి - 72

Share This
శ్రీధరమాధురి - 72
(పూజ్య శ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)


మాతృదేవోభవ ...పితృదేవోభవ.
- తైత్తిరీయ ఉపనిషత్తు.
వేదాలు మాతా దేవోభవా పితా దేవో భవ అనలేదు. అవి మాతృ, పితృ అనే శబ్దాలను వాడయి. తల్లి తండ్రి మన వంశం తాలూకు ప్రతినిధులు అవుతారు. వారిని గౌరవిస్తే పూర్వికులను గౌరవించినట్లే. పితరులు వారిద్వారా పని చేస్తూ ఉంటారు.‌ అందుకే వారి మాటలు, చేతలు మీ పూర్వీకులకు చెందినవి. వారు అంతర్గతంగా పితరుల ద్వారా దిశానిర్దేశం, మార్గదర్శకత్వం చేయబడతారు. అందుకే వారి ఆలోచనలకు, చర్యలకు, పనులకు అంతటి ప్రాధాన్యం ఉంది.
***
లెక్కించనలవికానంత సమయం నుంచి, మన పితృదేవతలు ఒక ప్రత్యేకమైన దేవతను కులదేవతగా ఆరాధిస్తున్నారు. దైవం ఒక్కరే అయినా వారు ఒక్క దేవతకి మాత్రమే ప్రాధాన్యతను ఇచ్చి ఉంటారు, వారినే ఆరాధించి ఉంటారు. మాములుగా ఆరోజుల్లో కుటుంబాలు ఏడాదికి ఒక్కసారైనా కులదేవతను దర్శించి తమ భక్తిని తెలిపేవి. వారు అనేక విధాలుగా అనేక పద్ధతుల ద్వారా కులదేవతను ఆరాధించేవారు. కొన్నిసార్లు ఈ ఆచారాలు కొన్ని కుటుంబాల్లో ఏవో కారణాలవల్ల మధ్యలోనే ఆగిపోతాయి. కాలం గడుస్తున్న కొద్దీ, ముందు తరాలకు తమ కుల దైవం ఎవరో కూడా తెలీదు. మీరు ఒక సద్గురువును అనుసరిస్తూ ఉన్నట్లయితే ఆయన మీకు సరైన దిశా నిర్దేశం చేస్తారు. మీకు సద్గురువు లేనట్లయితే మీరు తిరుమల లేక అహోబిలం లేక ఏదైనా ద్వాదశ లింగాల ఆలయం లేక 51 శక్తి పీఠాల్లో ఏదో ఒక శక్తి పీఠానికి ఏడాదికొకసారి క్రమం తప్పకుండా వెళ్లవచ్చు. దైవానికి జరిగే ఏ సేవలో అయినా మీరు పాల్గొనవచ్చు, మీ ముందు తరాలకు అదే పాటించమని చెప్పవచ్చు. మీ తల్లి తండ్రి ఇతరులు లేక కులదేవత అనేవి చాలా ప్రధానమైన అంశాలు. మీరు వారిని గురించిన శ్రద్ధ వహించకపోతే, మీరు కుంభాభిషేకం లేక యజ్ఞాలు లేక ప్రార్ధనలు చేసినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు.
***

No comments:

Post a Comment

Pages