భారత్ శాంతి
పావని యనమండ్ర
సాగర తీరాన విహరించిన ఓ పావురమా
నీలి కెరటాలు తాకిన ఓ ముత్యమా
వికసించిన ఓ భూగర్భ పుష్పమా
ఎచటికి నీ పయనం
ఏది నీ గమ్యం!
శాంతికి నీవే నిలయం
స్నేహానికి నువ్వొక చిహ్నం
ప్రేమకి నీవే ఆలయం
మరువని మమతకు నీవొక మందిరం
నల్లని కారుమబ్బుల తో నిండిన మన దేశం
మతం పేరు తో మునిగిన ఈ దేశం
శాంతి కిరణాలకి ఒక దేశం
అదే భారతదేశం
చల్లని నీ నీడని సోకినంత
పరిమళించు ఈ జగమంతా
ఆనాడు విశ్వశాంతి కోరిన ఆ మానవుడు
నీ రాకాకై ఎదురు చూసేను ఈనాడు
విహరించిన నీవు
సేద తీర్చుకొనుటకై మా దేశం రమ్ము
నీ పాదముల స్పర్శ తో దేశమంతా
శాంతి తో నింపుము
అదియే ఒక సామాన్య మానవుని ప్రార్ధన !!!!
***
No comments:
Post a Comment