గుప్పుమన్న వేపపూత పరిమళం - అచ్చంగా తెలుగు

గుప్పుమన్న వేపపూత పరిమళం

Share This
గుప్పుమన్న వేపపూత పరిమళం
పొదిల సత్యవతి 

సాయంత్రం 6 అవుతోంది...
ఆరుబయట చల్లగాలికి పూలమొక్కలు తలలూపుతున్నయి. వసంత కాలంగదా. ఆహ్లాదంగావుంది.వరండాలో కుర్చీలో కూర్చుంది పూర్ణ. చల్లగాలికి గుప్పున వేపపూత వాసన.అబ్బ ఎంతబాగుందో. మబ్బులు కమ్మిన ఆకాశం.దూరంగా మామిడిచెట్టు పూతపిందేలు కనువిందుచేస్తున్నయి. పక్షులు గూళ్ళకు చేరుతున్నాయి,ఈసారి మంచుకి చాలపూత రాలి పోయింది పూర్ణా!కాపు ఎలా గుంటుందో అని ఎదురింటి లక్ష్మి నిన్నంది.

   అరే ఉగాది దగ్గర్లో వుందిగదా గమనించనే లేదు.మనసలా గతంలోకి వెళ్ళిపోయింది.
  తనకి పెద్ద ఆశలేంలేవు సాదాసీదా ఆడపిల్లలా.ఆడపిల్లకి ఏం చ దువులు ఉద్యోగం చెయ్యాలా వూళ్ళేలాల అనే రోజులవి,అమ్మ ప్రోద్బలంమీద హాస్టల్లో పెట్టి చదివిస్తున్నారు.అదేగొప్ప.
     వెంటనే రమ్మని టెలిగ్రాం.ఎం కొంపలంటుకున్నయి అనుకుంటూ ఇల్లుజేరిన తనకి పూర్ణా నాలుగురోజుల్లో నీపెళ్ళి తెలియదా అంటూ స్నేహితురాలు.అదేంటమ్మా  ఇంత తొందరగా పెద్దది అక్కకి కాకుండ నాకు పెళ్ళెంటి .మరినా చదువు.
    అక్క బావను చెసుకుంటానంది.వాళ్ళపేరు మీద కుదరలేదు మూర్తం.
   లేదురా అమ్మడూ మంచిసంబంధం. అబ్బాయి భాస్కర్రావు వుద్యోగం. ఆస్తిపాస్తులు పెద్దగా లేకున్నా కుర్రాడు బుద్ధిమంతుడు.ముగ్గురు పెళ్ళైన అక్కలు.మంచికుటుంబం. ముహుర్తం కుదిరింది నాన్న.
   తను బుర్రూపడం తెల్లవారు ఝామునపెళ్ళి అంతా భుక్తాయాసంతో చందన తాంబూలం సేవించి నిద్దరలో జోగుతున్నారు.
   పందిట్లో బాజాలుమోగినయి. మంత్రాలు వినిపిస్తున్నయి,వరపూజ,గౌరి పూజ పూర్తయి పెళ్ళికుమార్తెను తోడుకొనిరండి అనంగానే పెద్దముత్తైదువ చెయ్యిపట్టి తన్ని నడిపించుకొని వెళ్ళి కుర్చోబెట్టింది.నారింజ రంగు పట్టుచీర,నగలు,కళ్యాణం బొట్టు,మల్లెలు కనకాంబరాలతో వేసిన ఒంకులజడ, పైన పూలచేండుచుట్టి పాపటి బిళ్ళకింద బాసికం మెరుస్తూ తనూ బాగానే వుంది.తెరతియ్యంగానే చూసింది.భాస్కర్రావు తెల్లగ ఆరోగ్యవంతుడిగా వున్నాడు. కళ్ళల్లో మళ్ళీ చూడాలనిపించే మెరుపు.అమ్మనాన్నల ఎన్నికని మెచ్చుకుంది. కరెంటది లేదుగా రెండు పెట్రోమాక్సులాంతర్లుమాత్రం వెలుగుతున్నాయి.
    ఒక్కసారి పందిట్లో కలకలం, జోగుతున్నవాళ్ళంతి అదిరిపడి లేచారు.ఏమైందేమైంది?
అంతా గోలగోల. ఏముంది వీళ్ళెంతకైన తగినవాళ్ళే పెళ్ళికూతురు మారిపోయింది. ఏంటి పారిపోయిందా ఎవరో అరుస్తున్నారు.లేదు మార్చేశారు, అందంగా తెల్లగావున్నమ్మాయిని చూపించి పీపాలాగున్న కర్రిమొఖాన్ని మాకంటగట్టాలనీ చూస్తున్నారా?ఎంతమోసం.
  అవ్వఅవ్వ  ఎప్పుడైనా విన్నామా కన్నామా? బుగ్గలు నొక్కుకుంటున్నారెవరో.
   పూర్ణకి చెవులు దిబ్బిళ్ళు పడినట్లయింది.ఇదేంటి యిలా జరిగిందా.నాకుచెప్పలేదే ఎవరూ,అమ్మాళ్ళు అలా చేశారా?అందుకేనా అక్కనా పెళ్ళంటె రాలేదు,పరీక్షలని చెప్పారు. అయినా నేనంత అనాకారినా?బొద్దుగా,చామన చాయగా ముద్దుగున్నావే అమ్మడూ అని అంటుంది నాన్నమ్మ.కాకిపిల్ల కాకికి ముద్దులే అని అత్తలు హాస్యమాడేవాళ్ళు.తనకేమి వినిపించడంలేదు,కనిపించడంలేదు.అందంలేకపోవడం తనతప్పా.కాళ్ళకింద నేల కదిలి పోతున్నట్లుంది.ఎంత అవమానం.
  కుదిర్చిన పెద్దమనిషిని పిలవండి.నాలుగు దులపండి, అనిఎవరో అరుస్తున్నారు.
  లేవరా అబ్బాయి లే నీకేంటీ కో అంటే కోటిమంది అని ఎవరో దబాయింపు.  ఏంజరుగుతుంది, ఏంజరగబోతుంది అందరికీ ఆందోళనగావుంది.
       పొరపాటయిందండి. మాపెద్దమ్మాయి మొదటచెప్పలేదు బావనే చెసుకుంటానని, లగ్నంపెట్టుకున్నాక మొండికెసింది. సమయంలేదు. మిమ్మల్ని ప్రాధేయపడదామని. పూర్ణచాలతెలివైనది బాబు క్షమించండి అని నీళ్ళునములుతున్నారు      అమ్మనాన్న.          భాస్కర్రావు, అక్కలు అమ్మ అంతా కొయ్యబారిపోయారు మాటమంతీలేదు.
        ఆగండయ్యా ఆగండి. తొందరపడకండి.సమయంలేదు చెప్పలేకపోయామంటున్నారుగదా!ఏంట్రా అబ్బాయి,చెప్పుఏంచేద్దామంటావు నీదే నిర్ణయం.ఇంతదూరం వచ్చాక పీటలమీద పేళ్ళి ఆగిపోతే అందరికి అప్రదిష్ట పరంధామయ్య గారు      సరేనాన్న మీరెలాగంటె అలాగే.తను చదువుకున్నది, తెలివైనదంటున్నారుగా, ఇక అందంగురించి నాకంత పట్టింపులేదు అని భాస్కర్రావు.
  అంతా సద్దుమణిగింది.
    చాలసేపటిదాక తెప్పలిల్లు కోలేకపోయింది పూర్ణ. కలానిజమా అన్నమీమాంసలో పడిపోయింది. పిదపకాలం పిదపబుద్ధులు ఏవరో సణుగుతున్నారు. తాను కృతజ్ఞతగా చూసింది. భాస్కర్రావు చిరునవ్వు నవ్వాడు.
   జీలకర్రబెల్ల పెట్టడం మాంగల్యం తంతునా మమదేహి కరావలంబం మంత్రాలు ఉచ్ఛైశ్రవంలో వినిపిస్తున్నాయి, కళ్యాణం అయిపోయింది. అమ్మనాన్నల ముఖంలో ఆనందం గండం గట్టేక్కినందుకు. అందరూ ఆనందంగా ఉపిరి పీల్చుకున్నారు.
   ఉగాదికి కోడరికంకి వెళ్ళాలని ఇంటిల్లపాదికి చీరసారెలు, పిండివంటలు భారీగానే పంపారు తనతోఅత్తవారింటికి .
    పెద్ద పెంకుటిల్లు, పెరట్లో విరగబూసిన పెద్ద వేపచేట్టు,పూలమొక్కలు అంతాబాగుంది. అత్తగారు, ఆడబడుచులు అంతా ఆప్యాయంగానే చూసుకున్నారు.
పండగరోజు తలారా స్నానంచెసి కొత్తబట్టలు వేసుకున్నారంతా.ఇంటిబ్రాహ్మడు తెచ్చిచ్చిన వేపపువ్వు షడ్రుచులతో వున్నఉగాది పచ్చడి తిన్నారు.తన జీవితంలో ఉగాది పచ్చడికి ప్రత్యేకత వుందిగదా.పోంగలి పిండివంటలతో భోజనాలుచేశారు.పిచ్చాపాటి మాటలు.తమ్ముడూ అందరం సరదాగా పొలంవైపు వేళ్దాం అన్నారు వదినలు.సావిట్లో ఎద్దులు,ఆవులు గేదేలు.చెట్టుకొమ్మకి ఉయ్యాలకట్టివుంది. వాళ్ళపిల్లలు తనూ ఉయ్యాల లూగారు అంతాసరదాగా గడిపారు.
  రాత్రికి వేపచెట్టు దగ్గరలో మల్లెపందిరి కింద పడక తెల్లటిదుప్పటి వేపపూత,మల్లేల వాసనలు  కలిసిపోతూ మత్తు కలిగిస్తన్నయి.తాను భాస్కర్ అంటూ వడిలో ఒదిగి పోయింది.
 భాస్కర్ తన్ను ప్రెమగానే చూసుకున్నాడు.కొడుకు కూతురు.పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు.
 తాను ఆడబడుచులనుఅత్తమామలను మంచిగానే చూసుకుంది రాకపోకల్లోఇన్నాళ్ళూ,ఇన్నేళ్ళు .
   అత్తయ్య మామయ్య పెద్దవాళ్ళయ్యారుగదా మనతో వచ్చివుండమనండి అనితనంటే పల్లేటూర్లో వాళ్ళకక్కడే బాగుంటుందంటారు అనిభాస్కర్ .  ఏంవోయ్ పూర్ణా ఏంజేస్తున్నావంటూ,అమ్మవాళ్ళు ఉగాదికి రమ్మని ఉత్తరం వ్రాశారు అంటున్న భాస్కర్ మాటలకి ఈలోకంలో కొచ్చింది.వేపచెట్టు చూడండి ఎలా పూసిందో అంటూ భర్తతో కలిసి లోపలికెళ్ళింది తృప్తిగా.
***

No comments:

Post a Comment

Pages