పల్లకి బోయిలు - అచ్చంగా తెలుగు

పల్లకి బోయిలు

Share This
పల్లకి బోయిలు
పావని యనమండ్ర  


అందాల పల్లకిలో వెలిసి ఒక జాబిల్లి
ఆమె అంచునున్న పుష్పములు నర్తించే
గానం తో సాగే ఆ గాలి
ఆమె సేద తీర్చుకొనే పక్షి వలె ఆడేను ఆ జలము లోన
ఆమెను చూచిన చిరునవ్వు పెదవుల పై నిలిచెను
కొలనులో ఆడింది పాడింది
మనసంత నిండింది ఆ చిచిరునవ్వు
కందమూల పైన నిలిచింది
దొర్లాడు ముత్యములు పెదవుల పై  చిందు
మెల్లగా చల్లగా కదిలేదు ఆ వైనం
మెరిసెను ఆమె తారలా
సాగెను మంచులో మా పాట !
తీరాలా అంచున వెలిసెను మంచు చుక్కల్లే
దొర్లాడు కనీరు వధువు యందు పన్నీరల్లే
ఆడేము పాడేము ఆనందంలో
వీడలేము ఎన్నటికీ ఆమెను కన్నీరు తో
విడిచేము ఆమెను ఇంట చిరునవ్వుతో !!! 
***

No comments:

Post a Comment

Pages