శరవేగముగా రావే శ్రీ శార్వరీ - అచ్చంగా తెలుగు

శరవేగముగా రావే శ్రీ శార్వరీ

Share This
శరవేగముగా రావే శ్రీ 'శార్వరీ'!
-సుజాత.పి.వి.ఎల్.



పచ్చని తోరణాలు,

పసిడి పైరులు,

స్వచ్ఛమైన మనసులు

కల్మషమెరుగని మనుషులెక్కడ?

వసంత కోకిల కూజిత గానం, ఆప్యాయతానురాగం,

మానవీయ బంధం, మాతృభాష పై మమకారం

అన్నదాత ముఖంలో ఆనందం

మచ్చుకైనా

కనిపించవేం ఎక్కడా?!

అంతర్జాల ముఖాలకి

కాలం పరిమితమైపోయింది.

బంధాలన్నీ బహుదూరంలో

అక్కరకు రాని చుట్టాలైపోతున్నాయి..

తెల్లని పూగుత్తుల నడుమ

నల్లని కోయిల రాగం

ఆమనికే ఆకలి పాటలా వినిపిస్తూంటే..

ఉగాది పండుగెలా జరుపుకుంటాం!?

ఇకనైనా మాకు కాస్తంత మనోనిబ్బరాన్ని,

కష్టాలకు కృంగిపోకుండా,

సుఖాలకు పొంగి పోకుండా ఉండేలా.. నిశ్చలత్త్వాన్నిచ్చి..

దీవించగ..

వేగిరముగ రావే..

శ్రీ 'శార్వరీ' నామ కొత్త సంవత్సరమా!"

****



No comments:

Post a Comment

Pages