శ్రీథరమాధురి - 73
(పూజ్య శ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)
మామూలుగా
మనం ‘భక్తి’, ‘విశ్వాసం’ అన్న పదాల్ని కలిపేసి వాడుతూ ఉంటాము. ఒక శిష్యుడు పూర్తి
‘విశ్వాసం’ తో ఉంటాడు. అతను విశ్వాసపు సూత్రాల ద్వారా తనను తాను క్రమశిక్షణలో
ఉంచుకుంటాడు. అతనికి నమ్మకం ఉన్నా, ఆ నమ్మకానికి ఉన్న అనేక దశలను అతనింకా ఆచరణలో
పెట్టలేదు. బహుశా, అలా పెట్టేందుకు సమయం రాలేదు. అతను తన నమ్మకం గురించి యోచిస్తూ
ఉంటాడు. నమ్మకం వెనుక ఉన్న సూత్రాలను ఆచరించేందుకు, శిష్యుడి జీవితంలో ఒక దశ
వస్తుంది. ఇప్పుడు విశ్వాసంతో, అంకిత భావంతో అతను వాటిని ఆచరిస్తాడు. నమ్మకాన్ని
పూర్తిగా ఆచరించినప్పుడు, భక్తి ఉదయిస్తుంది. అప్పుడు అతడి లోంచి ‘అంకితభావం కల
శిష్యుడు’ లేక ‘దాసుడు’ జన్మిస్తాడు.
జాగృతి
అనేది అద్భుతమైన మార్పును తెస్తుంది.
మీరు
జాగృత స్థితిలో ఉన్నప్పుడు...
శృంగారం
ప్రేమ అవుతుంది...
ప్రేమ
ప్రార్ధన అవుతుంది...
ప్రార్ధన ధ్యానం అవుతుంది...
ధ్యానం అలౌకికమైన శాంతిని ఇస్తుంది...
కేవలం జాగృత స్థితిలో ఉండడం వలన ఈ మార్పు
మొత్తం సాధ్యమౌతుంది.
బ్రహ్మచర్యం అంటే మీరేమి చేసినా, చెయ్యకపోయినా, మీ
చర్యల్ని మీరే గమనిస్తూ ఉండడం. మీరు కర్తలు కాదు. దైవమే కర్త. ఏదీ మీకు సొంతం
కాదు. ఈ దేహం కాని, బుద్ధి కాని, మీకు చెందినది కాదు.
పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. గర్వం, దురహంకారం,
స్వార్ధం, అసూయ అనే ఆనకట్టలు దాటండి. మీ ప్రతి చర్యలో , ఇతరుల చర్యల్లో, దైవాన్ని
చూడండి. అన్నింటిలో, ప్రతి దానిలో దైవాన్ని అనుభూతి చెందండి. అలా ఉండండి చాలు. ఏదీ
అవుదామని ప్రయత్నించకండి.
సాధారణంగా ఉండండి, అసాధారణమైనది మీలో ఉదయిస్తుంది.
మీరు అసాధారణంగా ఉండేందుకు ప్రయత్నిస్తే, అసహజంగా తయారయ్యే
ప్రమాదం ఉంది.
అసాధారమైనవి మీలో ఉదయించినప్పుడు, అది ‘మోక్ష’ మనే వరద ద్వారాలను తెరుస్తుంది.
***
No comments:
Post a Comment