అమ్మ ఒడిలో - అచ్చంగా తెలుగు
 అమ్మఒడిలో...
కాత్యాయని దేవి

ఆరేళ్ళయింది. అంతా సిద్ధ మయ్యింది. దేవమ్మ క్యాలండర్ తెరిచి చూసింది. ఇంకో నాలుగు వారాలు గడిస్తే చాలు అమ్మ కళ్ళముందు ఉంటుంది. ఈలోగా చెయ్యాల్సిన పనులు గుర్తుకొచ్చాయి. గబగబా ముందు గది లో కెళ్ళి మొబైల్ తీసి ఎవరెవరికో ఫోన్లు చేసింది. సరిగ్గా గంట పట్టింది. పొద్దున్న  ఉడకేసి ఉంచుకున్న అన్నం తిని కాసేపు నడుమువాల్చగనే  ఆలోచనల పక్షులు మెదడులో చేరాయి. ఆ రోజు ఇంట్లో అందరూ కలిసి నన్ను. ఒంటరిని చేసిన భావన. ఇల్లా ?ఆదర్శమా ? అన్న సందిగ్ధంలో లో అన్నం కూడా  సయించలేదు. నిద్ర  .. అది  దూరమయి చాలా రోజులయ్యింది. అమీతుమీ తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. 
అంతే మర్నాడు ఉదయం ఆఫీస్ కి వెళ్లి  ట్రాన్స్ఫర్ కోరుతూ ధరఖాస్తు మరియు పి.యఫ్ అప్పునిమిత్త ధరఖాస్తు ఇచ్చి ఆఫీసర్ దగ్గరికి వెళ్లి "సార్ మీతో ఒక వ్యక్తిగత విషయం మాట్లాడాలి .ఒక అరగంట సమయం ఇవ్వగలరా? 'అని అడిగింది. "మధ్యాహ్నం లంచ్ తర్వాత వస్తావా అమ్మా' అంటే 'ఒకే సార్' అని వచ్చిన శ్రీదేవిని సహఉద్యోగులు చుట్టూ చేరి ఏమయ్యింది? ఎందుకు ట్రాన్స్ఫర్? పిల్లలు శ్రీవారు ఇక్కడా నువ్వక్కడ ఎందుకు? అని ఎంత అడిగినా నవ్వి ఊరుకుంది తప్ప ఏమీ మాట్లాడలేదు.  మధ్యాహ్నం ఆఫీసర్ తో తన అవసరం చెప్పి కొంచెం ఆంతరంగిక విషయంగా ఉంచమని ట్రాన్స్ఫర్  త్వరగా అయ్యేలా చూడమని వచ్చే వారం నుంచి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చే వరకు సెలవు పొడిగిస్తూ చేస్తూ ఉంటానని అనుమతి  తీసుకుని ఇంటికి వచ్చింది.      
      అదేపనిగా ఎవరో అరుస్తున్న అలికిడికి ఉలిక్కిపడి, ఆలోచనల నుంచి  బయటకొచ్చి చూస్తే సన్యాసి .  వాడికి చెప్పాల్సిన పనులు చెప్పి ఇవ్వాల్సిన డబ్బులిచ్చి పంపేసరికి సాయంకాలం పనులు గుర్తుకొచ్చాయి. అంతే దిందు చాప ఎ త్తి పే ట్టి వాకిలి చిమ్మి ముగ్గు వేసి చాపలు పరిచే సరికల్లా సంగీతం పిల్లలు రానే వచ్చారు. "అమ్మమ్మా ఇవాళ మా స్కూల్ లో పాటల పోటీలు జరిగాయి . నాకు ఫస్టు ప్రైజ్ వచ్చింది తెలుసా"  అని కళ్ళు తిప్పుకుంటూ చెప్పిన అమూల్య కి ముద్దు పెట్టీ "మరి అమ్మకి చూపించి ఆశీర్వాదం తీసుకో" . అంటూ పిల్లలందరికీ ఒక గిన్నె లో పప్పుండలు పెట్టీ అందరూ వచ్చేక గురువు గారికి పెట్టీ మీరు తినండి." అని లోపలికి వెళ్ళింది దేవామ్మ. ఇంతలో బయట నుంచి "గురుబెహ్మ గురుర్విష్ణూ...' సుస్వరంగా వినిపిస్తుంటే ఒక గ్లాసు తో నీళ్ళు మరొక గ్లాసులో కాఫీ తెచ్చి పెట్టీ గుడిలోకి వెళ్ళింది.
  గుడిలో దర్శనాలు ప్రదక్షిణలు పూర్తి చేసుకుని కాసేపు కూర్చుని నోటి కొచ్చ్ని స్తోత్రాలు చదువుతుంటే కాలనీ లోనే వాళ్ళు వచ్చేరు. అందరూ కలిసి లలిత విష్ణు పారాయణం చేసుకుని లక్ష్మి అష్టోత్తరం చడువుకుని ప్రసాదాలు నివేదనం పంపకం అయ్యేసరికి 8 గంటలు అయింది. ఇంటికొచ్చి పక్క పరుచుకుని మొబైల్ లే తీసి చూస్తే భర్త ఫోన్చేసి నట్లు గుర్తించి తిరిగి ఫోన్  చేసి మాట్లాడి పెట్టి కళ్ళు తుడుచుకుని పిల్లలకి చేసింది. అందరూ కలిసి వీడియో కాల్ చేసి మాట్లాడుకున్నాక నిద్రకి ఉపక్రమించాను. ఆఫీస్ వాళ్ళు గుర్తుకొచ్చాయి. 
మళ్లీ మనసు గతం లోకి పరుగు తీసింది.  ఆ రోజు తర్వాత విశాఖ లో ఇల్లు వేట మొదలెట్టింది. పాత స్నేహితులు కొందరు చూపించిన ఇంట్లో తన కార్యక్రమాలు చెప్పగానే ఇల్లు ఇవ్వమన్నారు. క్వార్టర్స్ లో ఒక ఆరు నెలలు బాగానే గడిచింది. కానీ ఇంత దూరం వచ్చింది ఎందుకు? శాశ్వతమైన  విలాసం  ఒకటి ఏర్పరచాలి కదా . అంతే మళ్లీ విజ్హృభీంచింది. ఈసారి ధీర్ఘకాలిక అద్దె నిమిత్తం  ఇల్లు వెతికింది. కానీ ఆ సొమ్ము ,  పెట్టిన కండీషన్లు విని ఇది కాదని ఊరి శివార్లలో కడుతున్న విల్లా ఒకటి ఖరీదు చేసుకుంది. బయటకి అందరి లాగే ఉన్న లోపల తన అవసరాలకు అనుగుణంగా  మార్పులు చేర్పులు చేయించు కుంది. జారిపోతున్న కాలం తోందరింపజేస్తుంటే ఒక మామిడి అంటు తెచ్చి వేసి ప్రతి రెండు రోజులకు వచ్చి దానిని గమనించు కుంటుంది.     రెండేళ్లు గడిచాయి. ఈ లోగా ఇల్లు పూర్తయ్యింది.  జీవన గమనం లో కొత్త బంధాలు వచ్చేయి. అల్లుడు, కోడలు    వచ్చేరు. బాధ్యతల్ని విస్మరించకుండా భర్త వెంట అన్ని సవ్యంగా నెరవేర్చడానికి ఏ ఇబ్బందీ జరగ లేదు. అమ్మాయి తొలి కానుపు అమ్మఒడి లోనే . ముద్దు లోలికి చిన్న పాపాయి. మనసు నిండి, కన్ను తడిసిన రోజది. తరువాత అంతా సంతోషమే. అమ్మ తీరనికొరికలు ఒక్కొక్క టి తీరుతుంటే దేవమ్మ హృదయం రోజు రోజుకీ  విశాలమయిపోతోంది.  కొడుకు కోడలు డాక్టరేట్ పట్టా తీసుకుని అమ్మ ఒడి కి   వచ్చి అమ్మ నీ ఒక వరం అడిగేరు.  
   ఉగాది ఉదయం దెవమ్మ ఇంటి ముందు వరసగా కారులు . ఆ వీధి వాళ్ళు ఎప్పుడు చూడని జనం .  సాయంత్రం ఇంటిముందు పంచాంగ శ్రవణం తర్వాత దేవమ్మా వచ్చి ఒక్కెక్కరిని పిలిచి పురోహితునికి కి బట్టలు పెట్టించి ఆశీస్సులు  ఇప్పించి  ,     ఈ రోజు నేను మీకు కొంచెం చెప్పాలి అనుకుంటున్నాను.  ఇక్కడ మీలో కొత్తగా వచ్చిన వాళ్ళకి నా కుటుంబాన్ని పరిచయం చేస్తాను. వీడు నా కొడుకు ఈ అమ్మాయి నా కోడలు. ఇది నా కూతురు .ఇతను నా అల్లుడు. వీళ్ళు నా మనవలు. ఇన్నాళ్లు నా వెంట ఉండి నన్ను నడిపించిన మా వారు అంటూ వెళ్లి  భర్తకు నమస్కరించి వేదిక పైకి తీసుకు వచ్చి ఆశీనున్ని చేసింది. 

" ఈ "అమ్మ ఒడి ' మా అమ్మ జ్ఞాపకం.  నా జీవితాశయం.  మా అమ్మ నా కోసం ఎంతో చేసింది.  ఎందుకంటే ఆమె నను పెంచిన తల్లి. కడుపు పండక, పాలు ఇవ్వలేదు కానీ కంటి పాపలా కాచింది. తాను చదువు కోకపోయిన నా చదువు కోసమే శ్రమపడింది. మా పిల్లల్ని కూడా పెంచింది. నా జీవిత సమరంలో నేను అలిసిపోయి వస్తే నా ఆకలి తెలిసి నన్ను ఆదరించింది. కానీ తన కష్టానికి నా ఆసరా చేసుకుని ఉందాలనుకొలేదు. 
ప్రతి సామాన్య భర్త లాగే మా నాన్నగారు కూడా భార్యని ఒక వస్తువులా కొడుకు చేతిలో పెడితే నిశబ్దంగా తన ఉనికిని మరుగుచేసుకుని ఒక వస్తువులా ఉండిపోయింది. ఊరులో ఒక  పెద్ద   భవంతి    "శ్రీరామవిలాస్ '. అందులో అమ్మ పేరు లేదు. ఎందుకంటే ఆమె మా ఇద్దరికే  కన్నతల్లి కాదు. ప్రపంచం దృష్టిలో జన్మనివ్వడం మాత్రమే అమ్మతనం.       కానీ  మనమెవ్వరం గమనించని ఒక విచిత్రం సృష్టి లో ఉంది. మూడు ముళ్లు పడగానే కడుపు పండితే బొజ్జలో తొమ్మిది నెలలు మొస్తము. కానీ. కడుపు పండని ఆ ఇల్లాలు ఎన్ని సంవత్సరాలు మదిలో మొస్తున్నదో చూపే అవకాశం లేదు. ప్రతి ఆడది అమ్మే. ప్రతి
 అమ్మ మతృత్వపు గ నే. 
అలాంటి  మా అమ్మ తన జీవన పయనం లో పొందిన ప్రతి విలువైయిన దాన్ని మాకే ఇచ్చి తనకంటూ ఏమీ మిగుల్చుకొని పేదరాలు. అందుకే ఇక్కడ ఈ విజయనగరం , నెల్లిమర్ల మధ్య ఈ గేటే డ్ కమ్యూనిటీ లో ఒక  ఇల్లు కొని దానికి "అమ్మ ఒడి " అని పేరుపెట్టి మా అమ్మ కి ష్టమయిన పిల్లలు, మొక్కలు, పక్షులు,పశువులు మధ్య  ఉంటూ మా అమ్మ ఒడి కమ్మదనం అనుభవిస్తున్నాను.మా వారు పదవీ విరమణ చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. నేను ఇవ్వలే ఈ సభ పెట్టడానికి  కారణం.ఆ మామిడి చెట్టు .పూత కొచ్చిన తరుణం. ఆ చెట్టు బెరడు మీద అమ్మ బొమ్మ చెక్కించడానికి నా కొడుకు ఇచ్చిన సలహాలు ఒక ఎత్తయితే  దానికి తగిన మనుషులని తెచ్చింది ఈ సన్యాసి. ఈ సన్యాసి నా ఈ ఆశయం లో చేరడానికి కారణం మా అమ్మ ఆశ్రయం లోని ఆనందం పొందిన వాడు.  
ఇప్పుడు మన కాలనీ లో అందరికన్నా చిన్న పాప  అమ్మ పటం ఆవిష్కరిస్తుంది. సిల్కు పరదా తియ్యగానే  ఒక    హృదయాకారం అందు లో కరుణ రసాన్ని చిందించే రెండు కళ్ళు,  చేతులు చాచి అందుకోవాలని ఆత్రపడుతూ రెందు చేతులూ
అందరి చప్పట్ల మధ్యమళ్లీ మైకు ముందుకొచ్చి
ఇక్కడి వారందరికీ నాదొక  విన్నపం. నా కొడుకు కోడలు పక్కనే ఒక విల్లా కొనుక్కున్నారు. ఇక్కడే ఉండి  ఈ బాధ్యతని   చూస్తామన్నారు.. ఈ ఆశయం తెలిసిన నా కుటుంబ సభ్యులు సంగీతం టీచరు గారు, సన్యాసి  ఇక్కడ చదువు కోసం వచ్చిన పిల్లలు ఒక కమిటీ గా ఉండి అమ్మ ఒడి నీ పచ్చగ ఎదిగించండి
  చెట్టు  పళ్లు కొసుకునే ఏ మనిషినీ నీరు పోసవా అని అడగదు. ఈ ఇంటి వాడివెనా అనీ అడగదు. ఆకలేస్తోందా అని మాత్రమే అడిగి పండు ఇస్తుంది. దయచేసి ఎవ్వరూ ఈ చెట్టు పై రాల్లీయ కండి
   ఎందుకంటే అది  మా అమ్మ మరి. అంటూ వాలిపోయిన దేవామ్మా  విశాలమయిపోయిన  హృదయం దేహంలో  ఇమడలేక ఆగిపోయింది.   తన విజయాన్ని అమ్మతో పంచుకుందికి దివి కేగిసింది.
మరో ఉగాది.........

అదే.ఇల్లు   అక్కడే పంచాంగ శ్రవణం .అమ్మలిద్దరు  అందరూ పిల్లలే . కన్నవారు పెంచిన వారు అన్నది మాత్రం లేదక్కడ. ఇంతలో చిన్ని కోకిల కుహు రాగాలాపన కి స్వరం సవరించు కుంటుంటే, క్రింద సంగీతం పిల్లలు శ్రుతి సరిచేస్తారు.
   ***

No comments:

Post a Comment

Pages