సాగర తీరాలు
పావని యనమండ్ర
దూరానఉన్న ముగ్ధమనోహరాలు
పాల పొంగున తాకిడికి ఘల్లు మనే గుండెలయలు
పాదమంచున తాకిన ఈ నీటి పొంగులు
ఉప్పొంగెను మనసులో ఏవో అలజడులు
తీరం అంచున ఎగసిపడే ఆ అలలు
కవియిత్రి రసికతను పెంచు ఆ హోరు
మల్లెపూవుల రంగులో ఆ పాల కెరటం
వచ్చివాలిపడిన ఆ నీటి బిందువు మోము పై
చూసే ఎంతో సోయగం !
నూనూగు నల్లని రాళ్లు
గురుతుకు తెచ్చేనా ఏవొ స్మృతులు
వాటిపై చెక్కిన పేర్లు
ఎన్నో గుండెల్లో మిగిలిన మైలురాళ్ళు
కెరటాల శబ్దాలు విలపించు సుస్వరాలు
సుమధుర గానాలు రాగాలు ఈ సాగర మాధానాలు
నిశ్శబ్దానికి ఉద్వేగం తోడైన భావోద్రేక తరంగాలు
మదిలో భావుకత నింపే మృదు మధుర మనోభావాలు
ఈ తీరాలే కోట్లాది మందికి జీవన మార్గాలు
ఎనలేని సిరిసంపదలు !!!!!!!!!!!!!!
***
No comments:
Post a Comment