సంగీతం
యనమండ్ర పావని
చల్లటి సుఖాంత సమయం
మనసు మీటెను సంగీతం
గాలిలో తేలేను నా హృదయం
కుసుమముల నాట్యమే ఒక అందం
అలల సవ్వడే వేసెను చక్కటి తాళం
కలల డోలిక లో ఊగెను నా కాయం
సోయగాలు ఒలికించు సునీత సుకుమార కుసుమముల నాట్యం
కవయిత్రి రసికతను పెంచు చూచిన ఈ వైనం
సప్త స్వరాల సంగమమే ఈ సంగీతం
సుస్వరాలు పలికించు ఒక దేశం
అందుకో నా ఈ సందేశం
స రి గ మ ప అవియే స్వరాలూ
తాళం ఒక అందం
భావం దానికి ఒక బంధం
జీవం పోసి, భాషను జోడించి
పాటను కూర్చి
మనసును కదిలించిన
అదియే ఒక అద్భుత వైనం
ఝరులు పొంగి పొరలినా
విశ్వం అంతటా ఏకమైనా
పృథ్వి పై జీవించేది ఏమైనా
అవి ఏ
స్నేహం సంగీతం
మనస్సు వున్న ఓ జీవి!
మరువకు నా ఈ సందేశం
మరల మరల వద్దకు పిలిచే
భక్తి తో నా ఈ విన్నపం !!!!!!!!!!!!
***
No comments:
Post a Comment