శ్రీథరమాధురి -74 - అచ్చంగా తెలుగు

శ్రీథరమాధురి -74

Share This
శ్రీథరమాధురి - 74
                     (పూజ్య శ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)



విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ సందేహాలు పెరుగుతాయి. నమ్మకం అనేది జ్ఞానానికి ఆజ్యం పోస్తుంది. కాబట్టి మీరు అన్నింటినీ అనుమానించే వారైతే మీరు విజ్ఞానం దగ్గరే చిక్కుకుపోతారు. ప్రశ్నించడం అన్న పేరుతో మీరు సందేహాల వద్దనే చిక్కుకుపోయారు. కానీ విశ్వాసం అనేది అంతర్గత జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. ఇక్కడ  ఆత్మ విచారణ తప్ప బయటికి ఏమీ ప్రశ్నించడం ఉండదు.

విజ్ఞానం అనేది విచారణ చేస్తూ, బయటనుంచి సమాధానాలు వెతుక్కుంటూ ఉంటుంది. కానీ జ్ఞానం ఆత్మ విచారణ చేసుకుని సమాధానాల కోసం అంతర్గతంగా శోధిస్తుంది. అందుకే ఆత్మ విచారణ ఉత్తమమైనదివిచారణ అనేది నిరుపయోగమైనది. అంతా దైవానుగ్రహం.



హృదయపూర్వకమైన ప్రార్ధనలకు దైవం సమాధానమివ్వడం నేను చూసాను. దేవుడు U – టర్న్ లను అనుమతిస్తారని నేను తెలుసుకున్నాను. అంతా దైవానుగ్రహం, దయ.



నేను చాలా సార్లు ఇదే చెబుతూ ఉన్నాను...

దైవం, మతం పేరుతో మీలో భయాన్ని పాదుకొల్పారు.  దీన్ని వేలాది ఏళ్ళుగా వంశానుగతంగా నియంత్రిస్తూ వచ్చారు. ఈ భయాన్నే ఒకరి స్వంత స్వార్ధ కారణాల కోసం, మతానికి ప్రతినిధులైనవారు ఆయుధంగా వాడుతూ వచ్చారు. భయం అనేది మిమ్మల్ని దైవానికి ఎన్నడూ చేరువ చెయ్యలేదు. ఒకవేళ మీరు ఆయనకు భయపడితే, ఆయన్ను ప్రేమించలేరు.అది సాధ్యం కాదు. చివరికి దైవం అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే దైవం. మీరు భయాన్ని విడనాడాలి. దైవం అంటేనే ప్రేమని బలంగా నమ్మి, భయం మిమ్మల్ని తినెయ్యకుండా తరిమి కొట్టడానికి, మీకు ఎంతో ఎక్కువ ధైర్యం కావాలి. లేకపోతే భయం మిమ్మల్ని తినేస్తుంది. అప్పుడు మిమ్మల్ని – శర్మ, నిర్మల్, ప్రవీణ్, రాజా, సాయి, దత్త, డేవిడ్, ఆసిఫ్ అని పిలవలేరు. మిష్టర్ ఫియర్ అని పిలుస్తారు. అంతా దైవానుగ్రహం, దయ.
***

No comments:

Post a Comment

Pages