విశ్వవ్యాప్త రామాయణం - 1 - అచ్చంగా తెలుగు

విశ్వవ్యాప్త రామాయణం - 1

Share This
విశ్వవ్యాప్త రామాయణం - 1
శ్రీరామభట్ల ఆదిత్య 

రామాయణం. ఈ ఆదికావ్యం మనందరం నిత్యం స్మరించే రాముడి కథను వివరించేది. రామాయణం మన అందరి జీవితాల్ని ఎంతగానో ప్రభావితం చేసింది. నిత్యం మన నడవడిక ఎలా ఉండాలో రామాయణం ‌గుర్తు చేస్తూంటుంది. రాముడి కథ మనకు తెలిసినదే అయినా చదవిన ప్రతిసారీ నిత్యనూతనమే... 

అయితే రామాయణాన్ని మొదటగా ఆదికవి వాల్మీకి మహర్షి సంస్కృత భాషలో రచించాడు. ఆ తరువాత భారతీయ భాషల్లో అనేకమంది కవులు, రచయితలు రామాయణాన్ని మనభాగ్యాన మనకందించారు. భారతీయ భాషల్లో చూసినట్లయితే...

అ) సంస్కృతం:
వాల్మీకి రామాయణం ( వాల్మీకి )
ఆధ్యాత్మ రామాయణం ( వ్యాసుడు )
ఆనంద రామాయణం ( వాల్మీకి )
అద్భుత రామాయణం ( వాల్మీకి )
అగస్త్య రామాయణం ( అగస్త్యుడు )

ఆ)అవధి భాష:
రామచరిత మానసం ( తులసీదాసు )

ఇ) తెలుగు:
రంగనాథ రామాయణం ( గోన బుద్ధారెడ్డి )
మొల్ల రామాయణం ( మొల్ల )
రామాయణ కల్పవృక్షం ( విశ్వనాథ సత్యనారాయణ )

ఈ) తమిళం:
రామావతారం ( కంబర్ )

ఉ) అస్సామీ:
సప్తకాండ రామాయణ ( మాధవ కండాలి )

ఊ) బెంగాలీ:
కృత్తివాస రామాయణం ( కృత్తివాస ఓఝా )

ఋ) ఒడియా:
దండి రామాయణం { జగన్మోహన రామాయణం } ( బలరామ దాస)
విలంక రామాయణం ( సలళ దాస )
బిసి రామాయణ ( బిశ్వనాథ కుంతియా )

ౠ) మరాఠీ:
భావార్థ రామాయణం ( ఏకనాథుడు )

ఎ) మళయాళం:
కన్నస్స రామాయణం ( నిరణం రామ పణిక్కర్ )
ఆధ్యాత్మ రామాయణం కిలిప్పట్టు ( తంచత్తు రామానుజన్ ఎళుతచ్చన్ )

ఏ) ఉర్దూ:
పోథీ రామాయణ
ఛక్బబస్త్ రామాయణ

ఐ) కొంకణీ: 
రామాయణూ ( కృష్ణదాస శమ )

ఒ) కన్నడం:
రామచంద్ర చరిత పురాణ ( నాగచంద్ర )
కుమారవాల్మికి తొరవే రామాయణ 
కుముదేందు రామాయణ

ఓ) గుజరాతీ:
తులసీకృత రామాయణం ( ప్రేమానంద స్వామి )

ఔ) కాశ్మీరీ: 
రామావతార చరిత

ఇలా దాదాపు అన్ని భారతీయ భాషలలో రామయాణాలను మనం చూడవచ్చు. ఇవే కాక బౌద్ధంలో, జైనంలో కూడా కొన్ని రకాల రామాయణాలు ఉన్నాయట. దశరథ జాతక అనే పేరుతో బౌద్ధంలో కూడా రామాయణం ఉంది. పౌమాచరియం అనే పేరుతో జైనమతంలో కూడా ఉంది.

నాకు తెలిసి ఒక కథ ఇంతగా ప్రసిద్ధి చెంది ఇలా ఎన్నో భాషలలో ఎన్నోరకాలుగా మార్పుచంది వారి భాషలలో ప్రసిద్ధి చెందడం విచిత్రమే... బహుశా ఇలా అనటం కూడా తప్పమో. ఇది ఆ పరాత్పరుని చరిత్ర కదా... ఇంతేకాక ప్రపంచంలో ముఖ్యంగా ఆగ్నేయాసియాలో హిందూ మతం వ్యాపించడంతో వారిక్కూడా దగ్గరయ్యాడు రాముడు... అలా ఆ ప్రాంతీయ భాషల్లో ఏయే రామాయణాలున్నాయో వచ్చే నెల చూద్దాం....

రామో రాజమణిస్సదా విజయతే రామం రమేశం భజే,
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మైనమ: |
రామన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం,
రామే చిత్తలయస్సదా భవతు మే భో రామ మాముద్ధర ||

కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్‌ | 
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలమ్‌ ||
***

No comments:

Post a Comment

Pages