ఈ దారి మనసైనది - 28
అంగులూరి అంజనీదేవి
(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది. జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత. పల్స్ ప్రోగ్రాం టూర్ కి ఢిల్లీ, ఆగ్రా టూర్ వెళ్లి, ముగించుకుని తిరిగి వస్తారు. మెడికల్ కాలేజీ ఎక్సిబిషన్ కి వచ్చిన అనురాగ్ తల్లిదండ్రులకు అంతా తిప్పి చూపిస్తుంది దీక్షిత.)
వెళ్తున్నధీరజ్ ని చూస్తూ ....
"ఎవరే అతను ?మన పి.జి కదూ ! ఏంటంత స్పెషల్ గా మాట్లాడుతున్నాడు నీతో?" అంది సంజన.మన్వితమూడంతా అనురాగ్ మీద వుంది. మూడ్ అవుట్ లో వున్న మన్విత వెంటనే మాట్లాడలేదు.
సంజనకిఏదైనాఅడిగినప్పడు వెంటనే సమాధానం రావాలి. లేకుంటే వాళ్ల సమాధానం తన సమాధానం అన్నీ తనే మాట్లాడేస్తుంది.. మన్వితమౌనాన్ని వేరే రకంగా అర్ధం చేసుకొని ...."నీ వాలకం చూస్తుంటే నిజంగా నాకు సంతోషంగా వుంది మన్వితా ! ఎలాగైతేనేం! చూడటానికి చాలా స్రాంగా, అవసరమైతే నలుగుర్ని కొట్టేలా మళ్లీ, మళ్లీ చూడాలని పించేంతస్మార్ట్గావుండే మెడిసిన్ పి.జి. ని పట్టావ్ ఎంతయినా ఈ విషయంలో నువ్వు లక్కీ ఫెలోవి. ఎప్పటి నుండి ప్రేమిస్తున్నావ్? " అంది
ఆ మాటలు వినగానే తన ప్రేమను అనురాగ్ కి తప్ప ఇంకెవరికిపంచలేనన్నట్లుగా .....
మన్వితచేతోతలకేసి కొట్టుకొని, ఉరిమిచూస్తూ, వేలు చూపించి.....
“చంపేస్తా నిన్ను. ఆ మాట అన్నావంటే " అంది ఈ రోజెందుకో ఎవరేం మాట్లాడినా చంపేయాలనిపిస్తోందిమన్వితకి.
ఆ... నువ్వు ప్రేమించాలి నేను చచ్చిపోవాలి. ఈ లాజిక్కుబాగుంది” అంది సంజన.
* మతి లేని మాటలంటే ఇవే మరి. నేను ప్రేమించడంఏంటి? అతన్నినేనుందుకు ప్రేమిస్తాను? అతనెవరసలు?" అంది విసుగ్గా ఫీలవతూమన్విత,
ముఖాన్ని క్వొశ్చన్ మార్క్ లా పెట్టి - - -
ఇదే ఫస్ట్ టైమా అతన్ని నువ్వు చూడటం? కానీ ఏదో మాట్లాడుతున్నట్లు అన్పిస్తే అడిగానులే ." అంది వ్యంగ్యాన్నిలోలోన దాచుకొని సంజన. అది గమనించి సంజన తనని వదిలేలా లేదనుకొని....
“అతనేదోడౌట్ అడిగితే క్లియర్ చేశాను సంజనా...." అంది మన్విత.
" ఏంటో ఆ డౌట్?" వెంటనే అడిగింది సంజన.
" నాయుడమ్మ పేరు విన్నావా? " అంది మన్విత,
" ఎందుకు వినలేదు? మనం గర్వపడే విఖ్యాత శాస్త్రవేత్త కాశీ విశ్వవిద్యాలయం నుంచి పారిశ్రామిక రసాయన శాస్త్రంలో పట్టాపొందారు. తన పరిశోదనలు అంతర్జాతీయ ఖ్యాతిని కూడా అర్జించాయి. చివరకి కెనడాలో జరిగిన ఐడీఆర్సే సదస్సుకు హాజరై కనిష్క విమానంలో తిరిగి వస్తుండగా అది కూలి చనిపోయారు. అయితే ఏంటి అంది సంజన.
" ఏంటంటే ఏముంది? నాయుడమ్మ అంటే మహిళ కాదు. మగవాడు అని అతన్ని ఒప్పించటానికి నా తల ప్రాణం తోకకొచ్చింది?" అంది మన్విత, అటు, ఇటు చూస్తోందిసంజన.
" ఏంటి వెతుకుతున్నావ్? " అంది మన్విత,
" ఇక్కడెకడైనాపూలుంటే చెవిలో పెట్టు కుందామని ..... "
" నాకు పెట్టవేదొరికితే . అందరు నాకే పెడ్తున్నారు . ఇంకా ఎవరెవరు పెడతారాఅని చెవుల్ని చాటంతచేసుకానిఎదురుచూస్తున్నా..." అంది మన్విత.
“నీ కెవ్వరుపెడతారు? పెడితే నువ్వే పెట్టాలిగాని . " అంటూ దినేష్ వాళ్ల పేరెంట్స్ వస్తుంటే అటు వెళ్లింది సంజన.
మన్వితకి ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా వుండాలని వుంది. సంజన నాలుగు అడుగులు ముందుకెళ్లి, మన్విత రాక పోవడం చూసి తిరిగి వెనక్కొచ్చి చెయ్యి పట్టి లాక్కెళ్ళింది.
*****
No comments:
Post a Comment