గంధపు చెట్టు ! - అచ్చంగా తెలుగు

గంధపు చెట్టు !

Share This
 ‘‘ గంధపు చెట్టు ! ’’
 మినీకథా చక్రవర్తి, కథానిధి, కథా బ్రహ్మ, కథా విశారద 
-కె బి కృష్ణ
  
   
రాజమండ్రి లో ఏ.వి.అప్పారావు రోడ్‌ లో బైబిల్‌హౌస్‌ దాటేక, ఓయన్జీసి ఆఫీసు ఎదురుగా ఈ మధ్యన విపరీతంగా పెరిగిపోయిన అపార్ట్‌మెంట్స్‌ ప్రాంతం లో నడుస్తున్నాను. పత్రిక లో ఏదైనా అంశం పై ప్రత్యేక వ్యాసం రాయా లని . ఇంతలో ``చిల కాకుపచ్చ రంగు లో ఒక నాలుగంతస్ధుల భవంతి  దగ్గర నా కాళ్లు ఆగిపోయాయి. ఆ బిల్డింగు నాలుగు అంతస్ధులు  గదా అపార్ట్‌మెంటేమో అనిపరిశీలనగా చూస్తే కానే కాదు. కారు రాకపోకకు మీగా పెద్ద ఇనుపగేట్లు నాలుగు ఉన్నాయి అవి చక్రాల  పై జరుగుతున్నట్లు గా ఒక గేటు లోంచి కారు బయటకు వస్తుంటే గమనించాను. ఒక గేటు కు నిగనిగా మెరిసిపోయే కంచులోహపు అక్షరాతో ‘‘అనుబంధాల  సుగంధం’’  అని తెలుగు  బోర్డు వేలాడుతోంది.  అనుబంధాల  సుగంధమా ? నా మది లో ఇప్పటివరకూ మెదిలిన మానవసంబంధాల  ఆలోచనాలోచనాలు  మరింత విస్ఫారి ఆ బోర్డు ను చూడగానే ఆగిపోయాను యాంత్రికంగా`` నాకు ఈ సుగంధం లోనికి వెళ్తే బావుండుననిపించింది. నానాటికీ తీసికట్టు లా మృగ్యమైపోతున్న మానవసంబంధాలి  నెలకొని వున్న నేటి కుటుంబ వ్యవస్థ లో “ అనుబంధాల” నే  మాట నాకు కొత్త గానూ వింతగానూ అనిపించింది సుమా ! --
మొదటి అంతస్ధులో సగభాగం సెల్లార్‌ గా వదిలేసి, మిగతా భాగం కట్టుకున్నారు. రెండవ అంతస్ధు, మూడవ అంతస్ధు, పోర్షన్‌ లా ఉన్నాయి, నాుగో అంతస్ధు మాత్రం నీలం రంగు రేకుతో ఆలంకరించబడి ఒక హాలు  లా గోచరిస్తూంది. సెల్లార్‌ లో కార్లు, బైకులూ  సైకిళ్ళూ ఉన్నాయి.
సెల్లార్‌ లో సింహద్వారం వద్ద నిల బడ్డాను ‘‘ గోపాల కృష్ణ మూర్తి, రిటైర్డ్‌`` ’’ అని బోర్డు ఉంది. ఓహో `` అయితే ఈ భవంతి యజమాని ఒక పెద్ద ఆఫీసరు గా పదవీవిరమణ చేశారన్నమాట అనుకుంటూ, కాలింగ్‌ బెల్‌ నొక్కాను. ‘‘ కమింగ్‌ ’’ అంటూ తలుపు తెరిచారు.
ఆయన ఐదున్నర అడుగు ఎత్తు లో, ఆరడుగుల  ఎత్తు ఉన్న మనిషి లా మంచిగంధపు రంగు లో, పసుపు నేత పంచె లుంగీ  లా కట్టుకుని, తెల్లని  ఖద్దరు బనీను లాంటి చొక్కా ధరించారు. మెడలో సన్నని గొలుసు లాకెట్‌ తో వేలాడుతోంది. మరీ సన్నమూ లావూ కాని శరీరం, నుదుట వీబూధి రేఖలు,  మధ్యలో గంధం మీద ఎఱ్ఱని కుంకుమ బొట్టు. కోల  ముఖం లో పొడవాటి ముక్కు, సన్నని కళ్ళద్దాల  వెనుక విశానేత్రాలు, వృద్ధాప్యం వలన వడిలిన బుగ్గలూ , చిరునవ్వు తారాడుతున్న పెదవులు, బుల్లి గెడ్డం గోపాలకృష్ణమూర్తి గారు స్ఫురద్రూపి వయసులో ఉండగా ఎంత బావుండేవారో!.
‘‘ మీకు ఎవరు కావాలి ? ’’ ఆయనకూ నాకూ మాత్రమే వినిపించే చిన్న స్వరం తో అన్నారాయన.
’’ సర్‌. నమస్కారం. నేను ఒక ప్రముఖదినపత్రిక లో విలేఖరిని. పాతికేళ్ళనుంచి సమాజాన్ని మనుషులనూ నిశితం గా పరికిస్తూ, పరిశీలిస్తున్నాను. మీ భవంతి గేటు కు తగిలించి వున్న స్వచ్ఛమైన కంచు లోహం తో తయారైన అచ్చమైన తెలుగు  అక్షరాల బోర్డు చూసి వచ్చాను. ’’ అన్నాను. అందుకు ఆయన వెంటనే ‘‘ మీ పేరు ? ’’ అన్నారు, చెప్పాను.
‘‘ రండి కూర్చుని మాట్లాడుకుందాం `` ’’ అంటూ ఆయన హాలు లో మూడు సోఫాల్లో ఒక సోఫాలో నన్ను కూర్చోమని ఆయన నా ఎదురు సోఫాలో కూర్చున్నారు. ‘‘ ఏమోయ్‌`` ఒక సారి ఇటురా  ’’ అని ఇంట్లోకి చూస్తూ కేకేశారు. కాశిపోసి కట్టుకున్న గులాబీరంగు గద్వాల్‌ చీర లో, అచ్చంగా బాపు గారు చిత్రించే బొమ్మలో పదహారణాల  హిందూ కుటుంబ గృహిణి లా ఒక మాతృమూర్తి వచ్చింది, చీర చెంగు తో చేతులు  తుడుచుకుంటూ ‘‘ ఏమిటీ`` ’’ అంటూ. ‘‘ మన సుగంధాన్ని ఆస్వాదించడానికి వచ్చారు చూశావా రాధమ్మా `` ’’ అని చిరునవ్వు తో అంటూంటే, ఆమె మందహాసం తో ‘‘ కాఫీ పంపిస్తాను బాబూ తీసుకోండి` ’’ అంటూ లోనికి వెళ్ళిపోయింది.
కాఫీ వచ్చింది లోపల  నుండి ఇద్దరం తాగేశాం. ‘‘ మరి  మీరు నాకు  ’’ అంటూ నేను చెప్పబోతూంటే`
‘‘ మీకు మా సుగంధం గురించి క్లుప్తం గా చెబుతాను వినండి. నేను కొన్ని విషయాలు చెబుతాను, తరువాత సుగంధం  వెదజల్లే మా కుటుంబ సభ్యుల ను చూపిస్తాను. ఓ.కే `` అంటూ ఒక్క క్షణం మౌనం వహించి`` చూడండి అనుబంధం, ప్రేమ, అనురాగం, ఒకరినొకరు వదిలి వుండలేకపోవడం, వీటన్నింటినీ దయాదాక్షిణ్యం లేని మరణం తో దూరం చేసేయడం, ఇదీ మనిషి జీవితం. నాకు చిన్నతనం లోనే అమ్మా నాన్నా దూరమయ్యారు. అందరూ ఉండి కూడా అనాధ అయ్యాను, జీవితం లో ఎన్నో ఒడిదుడుకులు  ఎదుర్కొని ఒక స్ధాయి కి చేరుకున్నాను. అప్పుడు అనుకున్నాను పెళ్ళి చేసుకున్నాక ఇద్దరు  ప్లిల్లలతో సంసారాన్ని పరిమితం చేసుకుని మేమిద్దరం, మా సంతానమూ వివాహాలు  అయ్యాక కూడా జీవితాంతం ఒకర్ని విడిచి మరొకరు వుండే పరిస్ధితి రాకుండా నా కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవాని ఆలోచించాను.
మాకు ఒక కొడుకూ కూతురూ`` వారి చిన్నతనం నుండీ ప్రణాళికాబద్ధం గా మా సంసారాన్ని నడుపుకుంటూ వచ్చాను. మా ఇద్దరు ప్లిల్లలు చదువు సంధ్యూ అయిపోయి వారు ఉద్యోగించే స్ధాయి కి వచ్చేసరికి, నేను కొంత మూల  ధనం సంపాదించాని ఆశయం పెట్టుకున్నాను. దీనితో పాటే మాకు, అబ్బాయికి, అమ్మాయికీ రెండేసి బెడ్‌ రూమ్‌ల వాటా, పై అంతస్ధులో శుభకార్యాలకు, పండుగలూ  జరుపుకోడానికి ఒక హాలూ  నిర్మించాను ఇదీ నా ప్లాన్‌.
ఇకపోతే మా అబ్బాయికి ఇంజనీరింగ్‌ చదువు తరువాత రాజమండ్రీ లోనే ఉద్యోగం, కోడలిది కూడా రాజమండ్రీ నే, అలాగే అమ్మాయికి కూడా రాజమండ్రీ అబ్బాయే అతనికి కూడా రాజమండ్రీలో నే -  బదిలీలు  లేని ఉద్యోగం, అంటే గ్రౌండ్‌ ఫ్లోర్‌ లో మేము ఉంటాము, మొదటి అంతస్ధులో అబ్బాయి, కోడలు  ప్లిల్లలూ, రెండో అంతస్ధులో అమ్మాయి, అల్లుడూ, ప్లిల్లలూ ,  మూడో అంతస్ధు లో ఫంక్షన్‌ హాలు. ఎవరి కుటుంబాన్ని వారే తీర్చిదిద్దుకోవచ్చును, మా ప్రమేయం ఉండదు. కోడలు  గాని, అల్లుడు  గాని వారి పెద్దల  దగ్గరకు వెళ్ళి వస్తుంటారు, వారి తాలూకు తల్లితండ్రులు  మా ఇంటికి కూడా అతిధులు గా వస్తుంటారు. మూడు కుటుంబాలో ఎవరి జమాఖర్చు వారివే, ఒకరితో మరొకరికి సంబంధం ఉండదు, మానవ సంబంధం, అనురాగ బంధం తప్ప.
ఇక అపార్ధాలు , అపోహలూ, మా అనుబంధాల కు అడ్డంకులు  గా ఎలా వస్తాయి ? చెప్పండి ? మేమందరమూ ఎప్పటికీ కలిసే ఉంటాము. నెల కు వెయ్యి రూపాయలు  చొప్పున మేము ముగ్గురమూ బిల్డింగ్‌ నిర్వహణ ఖర్చు కోసం బ్యాంకు లో వేసేస్తాం. ఆ లెక్కలన్నీ మా అబ్బాయీ, అల్లుడూ  చూసుకుంటారు. నెలకోసారి సరదాగా అందరమూ మూడో అంతస్ధు లో కూర్చుని పార్టీ చేసుకుని, కష్టసుఖాలు చర్చించుకుని హేపీ గా ఎంజాయ్‌ చేస్తాం. ఒక్క క్షణం ’’ అంటూ ఇంటర్‌ కామ్‌ ఫోన్‌ లో మాట్లాడసాగేరు గోపాకృష్ణగారు.
‘‘ ఆయన ఫోన్‌ మాట్లాడుతుంటారు గాని, మీరు ఈ లోగా ఈ వేడి వేడి పకోడీలు తింటూ ఉండండి `` ’’ అంటూ రాధమ్మ గారు లోపల  నుండి ప్లేటు లో పకోడీల  తో వచ్చారు. ఆ ప్లేటు అందుకుని నేను తింటున్నాను.
ఇంతలో సుమారు ఆరు అడుగుల ఎత్తు లో సుమారు నలభై సంవత్సరా వయసు ఉన్న ఒక యువకుడూ, అతని భార్యా, ఒక అబ్బాయి, అమ్మాయి వచ్చారు హాలు లోకి హాలు  లో ఉన్న లిఫ్ట్‌ డోర్‌ తీసుకుని.అయితే లిఫ్ట్‌ కూడా వుందన్నమాట.ఈ భవంతి లో వృద్ధుల కు కిందికీ పైకీ రాకపోకలు  ఎలా అనే నా అనుమానం తీరిపోయింది. వీరందరూ వస్తూనే గోపాలకృష్ణ గారి పాదాలకు నమస్కరించారు. వారి అబ్బాయి కుటుంబం అని అనుకున్నాను. అతని భార్యా, సంతానం లోపలకు వెళ్ళిపోతే, ‘‘ ఏంటి నాన్నగారూ ఏమిటి విశేషం ? ఇవ్వాళ ఆదివారం కదా ఎలాగూ మన ‘‘ బంధాల మీట్‌ ’’ ఉంది కదా అని, మీ కోడలు  తినడానికి మా వాటా గా ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే మీ ఫోన్‌ వచ్చింది, అంతే వచ్చేశాం  ’’ అన్నాడు, తండ్రి లాగే పొడవుగా, పుష్టిగా పచ్చని మేని చాయ లో, గుండ్రని ముఖం లో కాంతులు  వెదజల్లుతూ  చిరునవ్వు చిందిస్తున్నాడు. గ్లాస్కోపంచె ను లుంగీ లా కట్టుకుని, తెల్లని  టీ.షర్ట్‌ ధరించాడు.
‘‘ వీరు మన రాజమండ్రీ లో ప్రముఖ పత్రికా విలేఖరి అని చెప్పారు. మన గేటు కు ఉన్న అనుబంధాల సుగంధం  బోర్డు చూసి వివరాలు  తెలుసు కోడానికి వచ్చారు. నీ గురించి చెప్పు నాన్నా `` ’’ అన్నారు గోపాలకృష్ణగారు.
‘‘ నమస్కారం సార్‌. నా పేరు అక్షయ. మేం మొదటి అంతస్ధు లో ఉంటాం. మా నాన్నగారు నేటి సమాజం లోని తండ్రుల తో పోలిస్తే అనునిత్యం పాదపూజ చేసి, పుష్పాభిషేకం చేయవలసిన వ్యక్తిత్వం గల  దైవసమానులు . నన్ను బి.టెక్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌ చదివించారు. చదువు పూర్తి కాకుండానే నాకు పేపర్‌మిల్లు  లో ఉద్యోగం వచ్చింది. మిల్లు  లో వుద్యోగం చేసినన్నాళ్ళూ ఈ ఊరి నుండి బదిలీ చెయ్యకూడదనే నియమం తో విధులలో చేరాను. నాతో చదువుకున్న నా శ్రీమతి స్వప్న ను మా నాన్నగారే నా శ్రీమతి ని చేశారు. మాకు ఒక అబ్బాయి, అమ్మాయి, కాన్వెంట్‌ స్టేజి లోనే ఉన్నారు. కుటుంబం లోని తియ్యందనాలు, ఆప్యాయతానురాగాలు , ఆస్వాదించాలని, వాటిని పరిపూర్ణం గా పిల్లలకు పంచిపెట్టాల నే తాపత్రయం తో నా శ్రీమతి ఉద్యోగం వద్దనే నిర్ణయం తీసుకుంది. మా ఇద్దరు పిల్లలనూ  కంటి కి రెప్పలా చూసుకుంటుంది. తన తల్లి తండ్రులతో పాటు మా అమ్మా నాన్నగార్లని కూడా సమానం గా చూసుకుంటుంది.
మా నాన్నగారు నా కోసం మూడు బెడ్‌ రూమ్‌  పోర్షన్‌ కట్టించారు. నా జీవనం కోసం కొన్ని లక్షలు  బ్యాంక్‌ లో వేశారు, దాని పై వచ్చే వడ్డీ తో, నాకు వచ్చే జీతం తో మేము ఖర్చుపెట్టుకోవచ్చును. మా ఇద్దరి పిల్లకు కోసం మేము ప్రతీ నెలా ఆదా చేస్తున్నాం. మా నాన్నగారి లాగే నేను కూడా మా పిల్లలను ఇదే పద్ధతి లో పెంచుతాను. మా వంశం అంతా రాజమండ్రి దాటి వెళ్ళే ప్రసక్తి లేదు. మా అమ్మ ఒక అనురాగదేవత, ఆమె కు కొడుకూ కోడలూ, అమ్మాయీ అల్లుడూ,  మనవలు , మనవరాళ్ళూ అందరూ ఒకటే. అంటూ అక్షయ తన తండ్రి ని అనురాగం తో చూస్తోంటే  నేను తండ్రీకొడుకుల ను మార్చి మార్చి కన్నార్పకుండా పరికిస్తూంటే ‘‘ ఏమిటి సార్‌ నిద్ర వస్తోందా ? ’’ అన్నాడు అక్షయ.
‘‘ కాదు బాబూ నేను ఎక్కడ ఉన్నాను అని నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను`` ’’  అని నేను అంటూ ఉంటే``
ఇంతలో ``
ముప్పైఐదు సంవత్సరా యువకుడూ, ముప్పైసంవత్సరాల  యువతీ, ఒక బాబూ, బుడి బుడి నడకల తో ఒక పాపా వచ్చేశారు హాలులోకి, వాళ్లంతా వస్తూనే గోపాలకృష్ణగారి పాదాల వద్ద మోకరిల్లారు. ‘‘ నాన్నగారూ`` ’’ అంటూ గోపాకృష్ణగారిని దాదాపు కావలించుకున్నంత గా తన శరీరానికి హత్తుకుంటూంది అమ్మాయి, తండ్రి అంటే ఆమె కు ఎంత వ్లల్లమాలిన ప్రేమో, ఆ దృశ్యాన్ని చూస్తూంటే నా కనులు  తడి అయ్యాయి.
‘‘ నా పేరు కల్పవల్లి, నేను వీడికి చెల్లెల్ని, మా నాన్నగారి ముద్దుల  కూతుర్ని మేము రెండో అంతస్థు లో ఉంటాం. అంటూ అన్నయ్య భుజం మీద అప్యాయం గా చేయి వేసింది. మా తల్లితండ్రులు సాక్షాత్తూ పార్వతి ప రమేశ్వరులే రమేశ్వరులే. నాకు చదువు పూర్తి కాగానే పెళ్ళి చేశారు. ఆయనకు తల్లీతండ్రీ లేకపోవడం తో మా అమ్మానాన్నలే ఆయనకు సర్వస్వమూను. ఈయన తెలుగు  పి.జి చేసి డాక్టరేట్‌ పొంది రాజమండ్రి కాలేజీ లో తెలుగు  లెక్చరర్‌ గా పనిచేస్తున్నారు. తనకు ప్రమోషన్‌ వచ్చినా సరే రాజమండ్రి నుండి కదిలే ప్రసక్తే లేదని అంటారీయన. మాకు అందరికీ ఆర్ధికలాభాల  కన్నా మా ప్రియమైన తల్లితండ్రుల  దగ్గర ఉండిపోవడం మహాభాగ్యం గా భావిస్తాం, మా పిల్లలని  కూడా ఇదే భావన తో పెంచుతున్నాం. నా కుటుంబం కోసం మా నాన్నగారు కొంత డబ్బు ఫిక్సెడ్‌ డిపాజిట్‌ లో వేశారు. ప్రతీ నెలా దాని మీద వచ్చే వడ్డీ, మా వారికి వచ్చే జీతభత్యాతో కలిపి ఖర్చుపెట్టుకుంటాం. ఎక్కువ మొత్తం మాకూ, మా పిల్లల భవిష్యత్‌ అవసరాల కోసం బ్యాంకుల్లో ఆదా చేస్తున్నాం.ప్రతీ నెలా వెయ్యిరూపాయలు  మా భవంతి నిర్వహణ కోసం బ్యాంక్‌ లో వేస్తాం. మా అన్నయ్య అక్షయ మరియు మా శ్రీవారూ బయట పనుల న్నీ  చూస్తారు.
మాకు ఎటువంటి ఆరమరికలూ   అపార్ధాలూ  లేనే లేవు. ఎప్పుడూ మనసారా మాట్లాడుకుంటాం. మా పిల్లలు  ఇంకా చిన్నవాళ్ళే, బాబు యల్కేజీ స్టేజీ లోనూ, పాప ఇంకా నడక  నేర్చుకుంటూంది. మాది ఒక అసామాన్యమైన కుటుంబం, మా నాన్నగారి వేపు బంధువులూ , మా అమ్మగారి వేపు బంధువులూ  వచ్చి వెళుతుంటారు, ఎవరి ప్రభావమూ మా కుటుంబం పై పడడానికి మలు లేదు. మేమందరమూ ఒకటే, తల్లీతండ్రీ, కొడుకు, కూతురూ, కోడలో, అల్లుడూ , మనవాలు, మనవరాళ్ళూ అనేవి వరసలు  మాత్రమే కాని మేమందరం శారీరకం గా వేరైనా మా మనసులు , పెనవేసుకుని అతి దగ్గరగా ఉంటాయి ఎప్పుడూ, కుటుంబం లో అందరమూ ఒకే చోట వుండడం తో ఎవరు ఎలా వున్నారో అనే దిగు లేదు మాకు,  ప్రస్తుత సమాజం లో కుటుంబాలూ, వారి మధ్యన అసమానతలు, అపార్ధాలూ, రాగద్వేషాలు, ఆర్ధికఅసమానతలు ఇవన్నీ  సమసిపోయి అందరూ మా వలెనే ఉండాని నా కోరిక `` ’’ అని అమ్మాయి అంటోంటే, అల్లుడు  వచ్చాడు,
చామన చాయ రంగులో గిరజాల  జుట్టుతో స్లిమ్‌ గా ఉన్నాడు, సన్నని కళ్ళజోడులోంచి అనురాగపు  జల్లు కురిపిస్తున్నాడు తన కుటుంబం మీద. వస్తూనే మామగారి ప్రక్కనే కూర్చుని ఆయన్ను తనకు దగ్గరగా పొదువుకుంటున్నాడు.
గంధపు చెక్క కావాంటే మంచి గంధపు చెట్టును నాటి పెంచాలి. ఆ చెట్టు బలమైన కాండం తో ఎదిగితేనే గంధపు చెక్క వస్తుంది. అప్పుడు ఆ చెక్కను ఎంతో శ్రమ కోర్చి ఒక రాతి మీద బలం గా రుద్దితేనే మంచి గంధం వస్తుంది. మరి ఈ అనుబంధాల  గంధపు చెట్టు ఎవరు ? మహదాశయం గల గోపాల కృష్ణ గారు కాదూ.
నేను గభాల్న  లేచి వారి పాదాల వద్ద షాష్టాంగప్రణామాలు సమర్పించుకున్నాను.
ఆయన వెంటనే నన్ను లేవదీస్తూ ‘‘ ఏమిటిది పిచ్చి పని లేవండి అన్నారు.
అనాడు శ్రీకృష్ణదేవరాయల  కాలo  స్వర్ణయుగం అనీ, రాజమార్గాల్లో రత్నాలు  రాశు పోసి అమ్మేవారనీ, ప్రజలు ఎప్పుడూ సుఖసంతోషాల లో తుల తూగేవారనీ, బీదరికం మచ్చుకైనా కానవచ్చేది కాదనీ, చరిత్ర చెబుతూంటే, నిజమేనని మనం ఇప్పుడు అనుకుంటున్నాం.

‘‘ నేను వచ్చే ఆదివారం మా దినపత్రిక లో  మీ అపూర్వమైన ఉమ్మడి కుటుంబం గురించి ఒక ప్రత్యేక వ్యాసం ‘‘ అనుబంధాల  గంధపు చెట్టు ’’ ఏ.వి.ఆప్పారావు రోడ్‌ రాజమహేంద్రవరం లో ఉందని రాస్తే, మా పాఠకులు  ఇలాగే అనుకుంటారేమోనని భావిస్తున్నానండీ నాన్నగారూ`` మన్నించండి
మిమ్మల్ని అలా సంబోధించినందుకు. క్షణకాలం   అయినా మీ కుటుంబ సభ్యుని గా మెలిగాలనీ నా చిరు ఆశ సుమా !
కుటుంబ వ్యవస్ధ గురించి అందరూ మీ వలె ఆలోచిస్తే ఎంత బాగుండును ?
సుమారు నల భై సంవత్సరాలు  మీరు ఇద్దరూ, మిమ్మల్ని మీరు కట్టుబాటు లో పెట్టుకుని, డబ్బు ఆదా చేసి, ఆ డబ్బు తో మీ ఆలోచనల కు కార్యరూపం ఇచ్చి, దానికి తోడు మీ సంతానం కూడా బాగా చదువుకుని మీకు సహకరించడం తో మీ ఆశయాలు ఆలోచనూ, నెరవేరాయి.
‘‘ గమ్యం చేరే వరకూ విశ్రమించకు, పట్టుదల  సడలించకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది, ఒక్క రోజలో దేన్నీ సాధించలేం`` ’’ అని స్వామీవివేకానంద శెలవిచ్చినట్లు గా మీ రిద్దరూ ఎంత శ్రమించిఉంటారు ? ఊహించడానికి నా మనసుకు సాధ్యం కావడం లేదు``` ’’ అంటూ నేను లేచి నిలబడి సుగంధాన్ని విస్తరింపచేసే వారందరినీ నా కెమెరా తో ఫోటోలు  తీసి, బిల్డింగ్‌ ని కూడా ఫోటోలు  తీసి,  మనసారా, కన్నులారా అభినందన పూర్వకం గా చూస్తూ ‘‘ అనుబంధాల సుగంధాన్ని ’’ మా పత్రిక పాఠకుకు అందచేయడానికి ఉద్యుక్తుణ్ణి అయ్యాను.
ఆశ్చర్యం ! గేటు దగ్గర కు చేరుతోంటే ఇరువేపులా రెండు గంధపు చెట్లున్నాయి. దగ్గరకు వెళ్ళాను. సుమారు ఐదు అడుగుల  ఎత్తులో ఉన్నాయి. ఆ చెట్ల దగ్గరకు వెళ్ళగానే సుగంధం నా ముక్కుపుటాను తాకింది.
అందరూ నిలబడి నాకు వీడ్కోు చెబుతున్న అపురూపమైన కుటుంబసభ్యుల ను వదల  లేక, వదల  లేక వారిని విడిచి వస్తోంటే, కళ్ళు మూసుకుంటే వారందరూ నా కనుల లో మెదులుతూనే ఉన్నారు సుమా !  
 
***          

No comments:

Post a Comment

Pages