దక్షిణ భారతము గురించిన కొన్ని విశేషాలు
అంబడిపూడి శ్యామసుందర రావు.
వింధ్య పర్వతాలకు దిగువన వుండే భారత దేశాన్ని దక్షిణ భారతము అంటారు. చాలా విషయాల్లో అంటే భాష, సంస్కృతీ,ఆహార ,కట్టు బొట్టు లాంటి విషయాలలో ఉత్తర భారతముతో చాలా తేడాలను కలిగి ఉంటుంది. దక్షిణ భారతము అంటే తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, తమిళ నాడు మైసూర్, కేరళ పాండిచ్చేరి రాష్ట్రాలు. దక్షిణాది రాష్ట్రాల విశేషాలను ప్రత్యేకతలను తెలుసుకొందాము.
దక్షిణ భారతము ను 4000 సంవత్సరాలుగా 18 రాజా వంశీకులు పరిపాలించారు. వీరిలో చోళులు, శాతవాహనులు, పల్లవులు, హొయసాలలు వాడయార్లు, కాకతీయులు, విజయనగర ప్రభువులు మొదలైనవారు ఉన్నారు .క్రీ శ 1323 నుండి దక్షిణాదిన ముస్లిము ల రాజ్య స్థాపన జరిగింది బహుమనీ సుల్తానులు నైజం నవాబ్ ముస్లిం పాలకులలో పేరున్న వారు. నైజామ్ పాలన తరువాత 18 వ శతాబ్దములో బ్రిటిష్ వారి పాలన ప్రారంభమయింది.
భారత దేశములోని ఆరు ప్రాచీన భాషలలో నాలుగు దక్షిణాదివే, అవి తమిళము, మళయాళము కన్నడము,తెలుగు. చాలా మంది దక్షిణాది వారికి రెండు దక్షిణాది భాషలు హిందీ భాష మాట్లాడగలరు.
శాస్త్రీయ నృత్యలైన భరతనాట్యము (తమిళనాడు),కుచి పూడి(ఆంధ్ర ప్రదేశ్),కధాకళీ (కేరళ),యక్షగానము (కర్ణాటక) దక్షిణాదిన పుట్టి ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి.
దక్షిణ భారతము విలువైన పట్టు ఖాదీ వస్త్రాలకు పుట్టినిలు.మైసూర్ సిల్క్, పోచంపల్లి (తెలంగాణా) పట్టు చీరలు, అలాగే ఆంధ్ర ప్రదేశ్ లోని కలంకారీ అద్దకము చీరలు, దక్షిణ భారత చీర కట్టుకు అందానికి తార్కాణాలు.అలాగే కంచి పట్టు చీరలు వీటినే కంజీవరము చీరలు అని కూడా అంటారు. ఇవి ఉత్తర హిందూస్థానములో బెనారస్ పట్టుకు ఏవిధముగాను తీసిపోనివి. మగవారు కట్టుకొనే చేనేత ధోవతులు కండువా దక్షిణాది సాంప్రదాయానికి గుర్తు.
ఐక్య రాజ్య సమితి కి చెందిన సాంస్కృతిక విభాగము యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వపు (వరల్డ్ హెరిటేజ్ సైట్స్) 32 ప్రదేశాలలో 9 దక్షిణ భారతము లోనే ఉన్నాయి. భారతదేశములోని పత్తి (కాటన్).సాగులో 48 శాతము దక్షిణభారతములో జరుగుతుంది.
తమిళ నాడు లోని రెండవ పెద్ద నగరము అయిన కోయంబత్తూరు ప్రాంతములో భారత దేశములోని పత్తి సాగులో 35% జరుగుతుంది అందుచేతనే ఆ ప్రాంతములో ఎక్కువ కాటన్ స్పిన్నింగ్ మిల్స్,కాటన్ క్లాత్ మాన్యుఫ్యాక్చరింగ్ మిల్స్,హోజరీన్ ఎక్కువ.
భారతదేశములో సుగంధద్రవ్యాల ఉత్పత్తి దక్షిణ భారతములోనే ఎక్కువ,2011 లెక్కల ప్రకారము ప్రపంచములోనే భారతదేశము సుగంధద్రవ్యాలు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. భారదేశములో సంవత్సరానికి 15 లక్షల మెట్రిక్ టన్నుల సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి అయితే, దక్షిణాది వాటా 9 లక్షల మెట్రిక్ టన్నులు భారత దేశ జనాభాలో ఐదవ వంతు దక్షిణ భారతములోనే నివసిస్తున్నారు. అంటే భారత దేశపు జనాభాలో 20% దక్షిణాది రాష్ట్రాల జనాభాయే.
ప్రపంచములోనే అత్యధిక ధనము ఉన్న దేవాలయాలు దక్షిణ భారతములోనే ఉన్నాయి.
తిరువనంతపురం(కేరళ)లోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయము ప్రపంచములోనే అత్యంత సంపన్న దేవాలయముగా గుర్తించారు ఈ దేవాలయము అస్తి విలువ $22. 3 బిలియన్లు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము వార్షిక ఆదాయము 57 కోట్లు ఇలాగే దక్షిణాదిన గల అన్ని దేవాలయాలుసంపన్నమైనవే దక్షిణాది అక్షరాస్యత రేట్ భారత దేశపు అక్షరాస్యత రేట్ కన్నా ఎక్కువ. దక్షిణాది ప్రజల అక్షరాస్యత రేట్ 80% భారత దేశ ప్రజల అక్షరాస్యత రేట్ 62. 6% మాత్రమే!
దక్షిణాదిన ప్రపంచప్రఖ్యాతి గాంచిన మెట్రో నగరాలు ఉన్నాయి. హైదరాబాద్ ,బెంగళూరు IT హబ్ లుగా ప్రసిద్ది చెందాయి.ఈ నగరాలలో గూగుల్ మైక్రోసాఫ్ట్,పేస్ బుక్ వంటి సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. చెన్నై విశాఖపట్నము వంటి నగరాలు వ్యాపార,పరిశ్రమలకు కేంద్రాలుగా చాలా ఏళ్లుగా ఉన్నాయి.
దక్షిణ భారతము అమోఘమైన నిర్మాణాత్మక శైలిని ప్రతిబింబించే భవంతులతో నిండి ఉన్నది. హైదరాబాద్ లోని నైజామ్ నాటి కట్టడాలు, వరంగల్ లోని కాకతీయల కాలము నాటి కట్టడాలు, తంజావూరులో దేవాలయాల నిర్మాణాలు అమోఘమైనవి. చూపరులను ఆకట్టుకొంటాయి. ఈ ప్రాంతాలన్నీ నైజామ్, ద్రవిడ మరియు పాశ్చాత్య నిర్మాణ శైలులు మిశ్రమాల భవంతులతో నిండి ఉంటాయి.
ఉత్తర భారదేశపు ఆర్ధిక అభివృద్ధి కన్నా దక్షిణభారత దేశపు ఆర్థికాభివృద్ధి పెరుగుదల రెండింతలు ఎక్కువ. దేశ వార్షిక అర్ధికా భివృద్ది రేట్ 8% ఉండగా దక్షిణ భారత దెస ఆర్థికాభివృద్ధి రేట్ 17% గా ఉంటుంది.
దక్షిణ భారతములోని దేవాలయాలలో శిల్పసంపద రాతి చెక్కడాలు పూర్వకాలంనాటి శిల్పుల ప్రతిభకు ,ఆనాటి చరిత్రకు నిదర్శనాలుగా నేటికి నిలిచి ఉన్నాయి.
దేవాలయాలలో రాళ్లపై చెక్కిన శిలాశాసనాలు ఆనాటి రాజుల చరిత్రను కూడా తెలియజేస్తాయి. వాటి వలన ఆనాటి రాజవంశస్తుల చరిత్ర అ దేవాలయము చరిత్ర నేటి తరాలకు తెలియజేస్తున్నాయి. హంపి విజయనగరం లోని శిల్ప సంపద నేటికీ దేశీయ విదేశీయ యాత్రికులకు కనువిందు చేస్తున్నాయి. అలాంటి శిల్ప కళా వైభవాన్ని ప్రతిబింబించే దేవాలయాలు దక్షిణ భారతములో చాలా ఉన్నాయి.
భారతదేశములోని అతి పెద్ద జీవ వైవిధ్యనికి దక్షిణ భారతము పుట్టిల్లు. ఈ ప్రాంతము సుమారు 450 పక్షి జాతులకు,140 జాతుల క్షీరదాలకు,200 జాతుల సరీసృపాలకు,175 జాతుల ఉభయచరాలకు ఆశ్రయము కలుగజేస్తుంది.అంతేకాకుండా 6000 రకాల మొక్కల జాతులు ఉన్నాయి. వీటిలో సుగంధద్రవ్యాలు ఉత్పత్తి చేసే మొక్కలు కూడా ఉన్నాయి.
భారత దేశము మొత్తము లోని భౌగోళిక ప్రదేశములో దక్షిణ భారతము 19. 31% విస్తరించి ఉంటుంది. అంటే 245. 480 చదరపు మైళ్ల విస్తీర్ణము దక్షిణాదిన అన్ని మారుమూల ప్రాంతాలకు కూడా బస్సు సౌకర్యము విస్తరించింది.
అన్ని రాష్ట్రాలలో కలిపి 68,055 ప్రభుత్వము చే నడపబడు బస్సులు ఉన్నాయి. వీటిలో రోజులో 22,100 బస్సులు నడుపుతూ తమిళ్ నాడు అగ్రస్థానంలో, 6,145 బస్సులు నడుపుతూ కేరళ చివరి స్థానములో ఉన్నది.
దక్షిణాదిన గల కేంద్రపాలిత ప్రాంతము పాండిచ్చేరి (పుదుచ్చేరి) చాలా ప్రత్యేకత కలిగిన ప్రాంతము ఈ కేంద్రపాలిత ప్రాంతము. చుట్టూ ఉన్న మూడు రాష్ట్రాలలో విస్తరించి ఉంటుంది ఈ ప్రాంతము. మొదట్లో ఫ్రెంచ్ వారిచే పాలింపబడింది. అందుచేత పుదుచ్చేరిలో ప్రెంచ్ సంస్కృతీ కనిపిస్తుంది. పుదుచ్చేరిలో యానము ఆంధ్ర ప్రదేశ్ లోను,,మహే కేరళ లోను , కారైకాల్ పాండిచ్చేరి తమిళ్ నాడులోను ఉంటాయి.
ఇడ్లి(సాంబార్ తో) దోశ, ఉప్మా, ఊతప్పమ్ ,పొంగల్ లాంటి 17 రకాల పదార్ధాలు బ్రేక్ ఫాస్ట్ గా ప్రసిద్ధి. దక్షిణాదినే కాకుండా కాకుండా ప్రపంచములో ఎక్కడైనా సోత్ ఇండియన్ ఫుడ్స్ పేరుతొ ఉండే రెస్టారెంట్లలో బాగా పాపులర్ అంటే చాలా మంది ఇష్టపడి తినేవి.
ఇవండీ మన దక్షిణాది రాష్ట్ర గురించిన కొన్ని ఆసక్తి కరమైన విశేషాలు.
***
No comments:
Post a Comment