'వానా కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు '
-సుజాత పి.వి.ఎల్ .
సైనిక్ పురి, సికిందరాబాద్.
*వర్షాకాలంలో వరదల్లాగా ఈగలు, దోమలు అధికంగా మనపై ఎటాక్ కి సిద్దమవుతాయి . కాబట్టి ..ముందు మన పరిసరాల్ని , ఇంటిని పరిశుభ్రంగా వుంచుకోవాలి.
* ఫినాయిల్ని వాటర్లో కలిపి ప్రతి రోజూ ఇంటిని తుడుచుకోవాలి .
* వానా కాలం ఎంత తుడుకుచున్నా తేమ తేమగానే వుంటుంది. ఈ తడిలో తిరగటం వల్ల స్త్రీల కాళ్ళు, పాదాల వేళ్ళు పాసిపోతాయి. అందుచేత ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని నడవడం ఎంతో శ్రేయస్కరం.
* సాధ్యమైనంత వరకు బయటకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఇది 'కరోనా ' కాలం కాబట్టి మరింత జాగ్రత్త గా ఉండాలి.
* ఉద్యోగినులు రబ్బరు చెప్పులు కాకుండా ప్లాస్టిక్ చెప్పులు వాడితే రోడ్డు మీద మట్టి నీళ్లు, బురద నీళ్లు బట్టల మీద పడకుండా వుంటాయి.
* ఎప్పుడు వానొస్తుందో చెప్పడం కష్టం కనుక ప్రతి ఉద్యోగిని తమ హ్యాండ్ బాగ్లో త్రీఫోల్డింగ్ గొడుగుల్ని ఉంచుకోవడం ఎంతైనా మంచిది.
* గొడుగులు కూడా ఆపలేని వర్షాన్ని తట్టుకోగలిగేవి సిల్క్ వస్త్రాలు. కాటన్ డ్రెస్సులు కానీ, కాటన్ చీరలు గాని వానకి తడిస్తే ఒంటికి అంటుకుపోయి కాళ్ళకి చుట్టుకుని ముందుకు నడవనివ్వవు. అందుచేత వర్షాకాలం సిల్క్ చీరలే ధరించాలి. అవి ఒకవేళ తడిసిన...మళ్లీ తొందరగా ఆరిపోతాయి.
*ఆఫీసులకి పట్టుకెళ్లే ఫైల్స్ గాని...ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని గానీ , మనీ పర్స్ ల్లాంటివి నీటికి తడవని పాలిథిన్ కవర్లో ఉండేలాగా జాగ్రత్త పరుచుకోవాలి.
* వానా కాలం స్త్రీలు సాధ్యమైన్నoత వరకు తలకు నూనె పెట్టుకోకపోవడమే మంచిది. ఎందుకంటే.. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో తల తడిస్తే వాసన రాకుండా ఉంటుంది.
* వానా కాలంలో అతి మేకప్ చేసుకుని బయటకు వెళ్ళకూడదు. వీలైనంత వరకు లైట్గా మేకప్ వేసుకుని సింపుల్ గా వెళ్లడం ఎంతైనా మంచిది.
* ముఖ్యంగా వర్షా కాలం నీటి కాలుష్యం ఎక్కువ. అందుచేత బయటి వస్తువులు, రోడ్లపై చేసే తిను బండారాల జోలికి వెళ్లకుండా...అతివలు ఇంట్లోనే వండుకుని...పూర్తిగా చల్లారక ముందే వేడి వేడిగా భర్త తో కలిసి భుజించడం ఆనందదాయకమే కాకుండా ఆరోగ్యం కూడాను.
***********
No comments:
Post a Comment