ఆధ్యాత్మిక వర్ణమాలిక
కె.శ్రీరామచంద్ర మూర్తి
అనంతకోటి బ్రహ్మాండములో ఇలపై ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మహోన్నతమైనది మానవజన్మ.
ఆత్మ,పరమాత్మల కలయికవల్లే మానవశరీరంలో చైతన్యము కలుగుతున్నది. చైతన్యమనగా ఈశ్వర స్వరూపము.
ఇలలో మానవులు ఒక్కరే మాట్లాడకలిగి,విచక్షణ జ్ఞానము కలిగివుంటారు.
ఈశ్వరసంకల్పములేనిదే ఏపని జరుగదు.
ఉచ్ఛ్వాస ,నిశ్వాసలు మానవ ప్రాణానికి సంకేతములు.
ఊహలలో తేలియాడే మానవుడు ఆశాజీవి.
ఋణానుబంధాలతో భూమిపై పుట్టుతూ,మరణించుచూ వుంటారు.
ఋషిరుణము, పితృరుణము, దైవరుణములు మానవుడు తమ జీవితములలో తీర్చుకోవలసినవి.
ఎవ్వరునూ విధివ్రాతను తప్పించుకొనలేరు.చేసిన కర్మఫలము ను అనుభవించ తప్పదు.
ఏలాంటి విషయవాంఛలకు లోనుకాకుండ మనస్సు,బుద్ధి,ఇంద్రియములు అదుపులోనుంచుకొ గలగాలి.
ఐశ్వర్యములు ఎన్నడూ శాశ్వతములుకావు
ఒక్కడే పరమాత్మ ఎల్ల జీవులకు.రూపాలు అనేకముగా వారివారి ఇష్టానుసారం ధ్యానించుకుంటారు.
ఓర్పు వలన సమస్యలు పరిష్కరించుకోవచ్చు.
ఔరా! కలిమహిమ వల్ల మానవులు మాయలోపడి అనేక వ్యసనాలకు దాసుడగుచున్నారు.
అందమైన జీవితం భగవంతునిప్రసాదము దానిని నిష్ప్రయోజనం చేయకూడదు.
కలసికట్టుగా ఉండగలిగిననాడు ఏ పనినైనా మానవులు సాధించగలుగుతారు.
ఖచ్చితమైన అభిప్రాయానికి ఏవిషయములమీద ఆధారరహితముగా నిర్ణయానికి రారాదు.
గమ్యము లేకుండ పయనించటం,లక్ష్యంలేకుండ అభివృధ్ది సాధించటం తగదు.
ఘనమైన జీవనప్రగతి సద్గురువు సాంగత్యముతోనే పొందగలుగుతారు.
జ్ఞానము సంపాదించాలని జిజ్ఞాస వుంటేనే పరమేశ్వరానుగ్రహం లభిస్తుంది.
చరిత్రలో ఎంతొమంది మహానుభావులు ఆధ్యాత్మిక చింతనలో తరించారు.
ఛాదస్తముతో కాక ఏకాగ్రతతో మనస్సువుంచి సాధన చేస్తే ఆత్మజ్ఞానము కలుగుతుంది.
జన్మజన్మల పాపఖర్మలు మనవెంటనంటేవుంటాయి.అవి తీరేదాక జనన,మరణములు తప్పవు.
ఝరిలో పుణ్యస్థలములలో స్నానాదికాలు ఆచరించి ,మానసిక పరివర్తన కలిగి,సాధనతో పరిపక్వత పొందవచ్చు.
ఞంగిత జ్ఞానము లోపిస్తే మనిషికి ,పశువుకు,భేదముండదు.
టక్కరిపనులు తాత్కాలిక ఆనందముకలిగించవచ్చుకాని ,చివరికి దుఖఃనకు హేతువుగామారుతుంది.
డంబము వలన మనిషి తన ఉనికిని మరచే ప్రమాదమున్నది.
ఢాంభికము గా జీవించాలనుకోవటం కోరికవల్ల కలుగుతుంది .అది అత్యాశకు దారివెతుకుతుంది.
తపోచింతన వలన తామసం నశించుతుంది.తాపాలు మూడు రకాలు ఆధ్యాత్మికం,ఆదిభౌతికం,ఆదిదైవికం.
దరహాసవదనము వల్ల మనస్సు శాంతినిపొంది ద్వేషభావాన్నివిడనాడుతుంది.
ధనమును ఆర్జించుట ధర్మమార్గమున జరగాలి కాని అన్యదారులు తొక్కరాదు.
నలుగురితో సఖ్యత జీవితములో ఎంతో అవసరము.
పరుషమైనమాటలు పలుకక ఇతరులమనస్సు రంజింపచేయాలి.
ఫలితాన్ని ఎన్నడూ ఆశించక కర్తవ్య దీక్ష ను సాగించిన రావలసినది రాక మానదు.
బంధాలు పెరిగేకొద్ది బాధ్యతలుకూడా పెరుగుతాయి.
భగవంతుని నామస్మరణే కలియుగములో ముక్తికి మార్గం.
మమకారాలు మనిషిని ఆధ్యాత్మిక విషయములందు నిలుపజాలవు.
యత్నకార్యసిద్ధికి ఏకాగ్రత అత్యంత అవశ్యకత.
రమ్యమైన ఈజన్మను సార్ధకపరుచుకొని జన్మరహిత్యము నకు సాధన చేయ్యాలి.
లక్ష్యసాధన కు ఆత్మవిశ్వాసం ,పట్టుదల ,ఏకాగ్రత చాలా ముఖ్యం.
వాసన దోషము ఎవరికుండదో వారికి మృత్యుభయం కలగదు.
శమ ,దమముల వలన ఆత్మజ్ఞానము పొందవచ్చు.
సృష్టిని ఎవరునూ మార్చలేరు దృష్టిని మార్చుకుంటేచాలు.
హరినామ స్మరణ ఐహిక వాంఛలను దూరం చేయగలదు.
క్షమాగుణము మానవుని ఔదార్యమునకు నిదర్శనం.
***
No comments:
Post a Comment