'అయోధ్య నామ సార్ధకం..!'
పి.వి.ఎల్.సుజాత
ఎన్నో ఏళ్ళ
నిరీక్షణ ఫలితం..
అయోధ్యలో రామ మందిర నిర్మాణ సంరంభం..
హిందువులు గర్వించే సుదినం..
సత్యానికి, ధర్మానికీ ప్రతిరూపం..
జగదభి రాముడే మన జాతి ఆదర్శం..
రాముని జీవనయానమే రామాయణం..
మనలని సన్మార్గంలో నడిపించే మార్గ దర్శనం..
భారతీయ సనాతననాచార పావనా శిష్ట చరితం..
సంస్కృతి సంప్రదాయాల నిలయం..
హిందుత్వమంటేనే వసుదైక కుటుంబ భావం..
అక్షరజ్ఞానం లేని బోయవాని నోటి వెంట
ఆసువుగా రామాయణ మహాకావ్యాన్ని
పలికించింది ఆఁ..ధర్మం..
మాధుర్యానికి మారు పేరు రామనామం..
రమ్యమైనది..ఆఁ..దివ్య మంగళ రూపం..
శ్రీ రామ చంద్రుడే సదా ఆదర్శనీయుడు..
రామతత్వం భజామ్యహం..
రామపాదం శరణ్యహం..
అయోధ్యలో పుట్టి, పెరిగి నడయాడిన ప్రదేశంలో
ఇన్ని వత్సరాలకు రామమందిర నిర్మాణం..
పరమపావనం.. ఆనందదాయకం..
అయోధ్య నామ సార్ధకం..!
*****
No comments:
Post a Comment