చరిత్రలోని అత్యంత ధనవంతులు
అంబడిపూడి శ్యామసుందర రావు
మనదేశములో టాటా బిర్లాలు అంటే పూర్వము ధనవంతులుగా చెప్పుకొనేవారు. ప్రస్తుతము అంబానీలు ధనవంతులుగా చెప్పుకుంటాము. అలాగే పురాణాల విషయానికి వస్తే కుబేరుడు అత్యంత ధనవంతుడిగా చెప్పుకుంటాము, ఎందుకంటే ధనవంతుడిగా పరిగణింపబడే శ్రీ వేంకటేశ్వరునికి కుబేరుడు అప్పు ఇచ్చాడుట, ఆ అప్పుఇప్పటికి తీరలేదుట. ఎవరెన్ని చెప్పినా, డబ్బుతో సంతోషాన్ని కొనలేము అని చెప్పినా, డబ్బు అవసరము అని ఎవ్వరూ కాదన లేరు. డబ్బు ఉంటె కొండ మీద కోతి అయినా వస్తుందని పెద్దలు చెపుతుంటారు. ప్రస్తుత సమాజములో మనిషికి గౌరవము డబ్బును బట్టే ఇంగ్లిష్ లో 'మని మేక్స్ మెనీ థింగ్స్' అని అంటారు.
అమెరికన్ మాజీ కాంగ్రెస్ మన్, "డబ్బు సంతోషాన్ని కొనలేకపోయినప్పటికీ నిన్ను సుఖముగా జీవించేటట్లు చేస్తుంది." అని చెపుతాడు. అందుచేతే అందరూ ఎలాగైనా డబ్బు సంపాదించాలి అని తాపత్రయ పడుతుంటారు. ఆ సంపాదనలో కూడా తృప్తి ఉండదు.
ప్రస్తుతము మనము బిల్ గేట్స్, అంబానీ వారెన్ బఫెట్ వంటి బిలియనీర్ల పేర్లు వింటూ ఉంటాము. అంతార్జాతీయముగా ఫోర్బ్స్ సంస్థ ప్రతి ఏటా ధనవంతుల జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. ఈ జాబితాలలో కొంతమంది ముందుకు వెనక్కు కదులుతూ ఉంటారు. మన పెద్దలు చెపుతూ ఉంటారు కదండీ "లక్ష్మి దేవికి నిలకడలేదు" అని. మనము ప్రస్తుతము చరిత్రలోని ధనవంతుల పేర్లను వారి సంపదల విలువలను తెలుసు కుందాము. ఈ వివరాలన్నీ వారు ప్రకటించిన వారి ఆస్తుల వివరాలే వీరు కాకుండా రాజకీయముగా లేదా వ్యాపార రంగములో చాలా సంపాదించినప్పటికీ వారి ఆస్తులను బహిరంగముగా చెప్పుకోలేని వారు చాలా మంది ఉంటారు.
వారి విషయన్ని వదిలేస్తే, ప్రపంచానికి తెలిసిన మరియు చరిత్రకారులు గుర్తించి అత్యంత ధనవంతుల జాబితా లో చేర్చిన వారిని గమనిద్దాము.
1.మాన్సా మూస (1280-1337) :- ఈయన మాలి దేశానికీ రాజు ఈయన ఆస్తి విలువ చెప్పటానికి వీలు లేనంత. ఈ 14వ శతాబ్దానికి చెందిన పశ్చిమ అఫ్రికన్ రాజును మించిన ధనవంతుడు ఇప్పటి వరకు లేడని నిస్సందేహముగా చెప్పవచ్చు. ప్రముఖ పరిశోధకుల మరియు గణాంకుల లెక్కల ప్రకారము ముసా ఆస్తుల విలువ లెక్కగట్టటము అసాధ్యము. ముసాయొక్క దాతృత్వము ఒక దేశము యొక్క ఆర్ధిక వ్యవస్థనే నాశనము చేసింది. అమెరికాలోని సెలిబ్రిటి నెట్ వర్త్ అనే ఒక వెబ్సైట్ ముసా ఆస్తి ని 400 బిల్లియన్లుగా అంచనా వేసింది. కానీ చాలా మంది ఆర్ధికగణాంకులు చరిత్రకారులు ముసా ఆస్తి ని భౌతికముగా లెక్కించటం అసాధ్యమని తేల్చి చెప్పారు.
2. జాన్ డి రాక్ ఫెల్లర్ (1830-1937) :పరోపకారి, వ్యాపారవేత్త అయిన
అమెరికన్ జాన్ రాక్ ఫెల్లర్ ఆస్తి విలువ సెలిబ్రిటీ నెట్ వర్త్ అనే సంస్థ అంచనాల ప్రకారము 340 బిలియన్ డాలర్లు. స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ వ్యవస్థాపకుడిగా రాక్ ఫెల్లర్ తన ఆస్తులను సంపాదించాడు. 27 సంవత్సరాల పాటు రాక్ ఫెల్లర్ తన కంపెనీని దిగ్విజయముగా నడిపాడు. సమాజసేవ, పరోపకారం
వంటి విషయాలలో ముందు ఉండి కాలేజీలు మొదలైనవి స్థాపించాడు. ఈ రోజుకి కూడా రాక్ ఫెల్లర్ ను అయన చేసిన మంచి పనుల వల్ల అమెరికన్ చరిత్రలో గొప్పవాడిగా పరిగణిస్తారు.
3.అండ్రు కార్నిజ్ (1835-1919):- స్కాటిష్ అమెరికన్ వ్యాపారవేత్త ఆస్తుల విలువ సుమారు 310 బిలియన్ అమెరికన్ డాలర్లు అమెరికాలోని ఉక్కు పరిశ్రమ 19వ శతాబ్దము పూర్వభాగములో వ్యాప్తికి దోహదపడ్డ వ్యాపార దిగ్గజము కార్నెజ్ రాక్ ఫెల్లర్ లాగానే ఈయన కూడా ప్రజాహిత కార్యక్రమాలు చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. అయన కాలములో ప్రముఖలలో ఒకడిగా గుర్తింపబడ్డాడు. కార్నేజ్ పుట్టుకతో ధనవంతుడు కాదు చాలా చిన్న స్థాయినుంచి ఎన్నో కష్టాలుపడి ధనవంతుడిగా ఎదిగాడు. ఎన్నో అడ్డంకులను అధిగమించి ఉక్కు పరిశ్రమలో తనగమ్యాన్ని చేరుకోగలిగాడు. అతని చరిత్ర భావి తరాల వారికి మార్గదర్శకము.
4. నికొలాయ్ అలెగ్జాండ్రో విచ్ రోమనోవ్ (1868 -1916):- ఈయన రష్యా చివరి చక్రవర్తి ఈయన అస్తి విలువ 300 బిలియన్లు అధికారికంగా ఈయనను నికోలస్ II గా వ్యవహరిస్తారు. ఈయన అలెగ్జాన్డర్ III చక్రవర్తి పెద్ద కుమారుడు. తండ్రి మరణానంతరము నికోలస్ సింహాసనాన్ని అధిష్టించాడు. కానీ అయన రోజుల్లో అంత ప్రసిద్ధి చెందిన చక్రవర్తి కాదు. బ్లడీ నికోలస్ అన్న చెడ్డ పేరు సంపాదించుకున్నాడు. ఆయన సింహాసనాన్ని అధిష్టించినప్పుడు జరిగిన తొక్కిసలాటలో సుమారు 1400 మంది ప్రజలు చనిపోవటం ఆయనకు ఆ పేరు వచ్చింది. కానీ అయన హయాములో జరిగిన మంచి పని ట్రాన్స్ సైబీరియన్ రైలుమార్గము పూర్తి అవటం. ఇప్పటికి ప్రపంచములోనే పెద్దదైన రైల్ మార్గముగాప్రసిద్ధి చెందిన రైల్ మార్గము ట్రాన్స్ సైబీరియన్ రైల్ మార్గము.
5. మీర్ ఉస్మాన్ అలీఖాన్ (నైజామ్ నవాబ్-1886- 1967) : మన హైదరాబాద్ నైజామ్ నవాబ్ గారు ప్రపంచములోని ధనవంతులలో ఒకడు, అయన ఆస్తి విలువ 230 బిలియన్లు. హైదరాబాద్ రాజధానిగా 37 ఏళ్ల పాటు రాజ్యపాలన చేసాడు. ఈయన హయములోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమములు హైద్రాబాద్ ప్రాంతములో జరిగినాయి. రోడ్లు రైల్వేలు, విద్యుత్ , విద్య వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసాడు. ఈయన ఎలిజిబెత్ రాణి వివాహ సందర్భముగా వజ్రాలు పొదిగిన నెక్ లెస్ మరియు కిరీటము బహూకరించాడు.
6. జాకోబ్ ఫగ్గర్ (1456 -1525) :- ప్రపంచములో చాలా మందికి ఈ పేరు అంతగా పరిచయము లేదు. కానీ అయన కాలములో ఆయన అత్యంత ధనవంతులలో ఒకడుగా ప్రసిద్ధి చెందాడు. ఈయన అస్తి విలువ 221 బిలియన్లు బ్యాంకింగ్, వ్యాపార కార్యకలాపాలలో అయన చూపించే చోరవ నేర్పులవల్ల బాగా పేరు సంపాదించాడు. ఈయన జర్మనీలోని ఆగ్స్ బర్గ్ లో జన్మించాడు. ఈయన సంపాదన అంతా హంగేరీలోని వెండి అంగారము గనుల త్రవ్వకాలు, మరియు ఇటలీలోని వస్త్రపరిశ్రమ వల్ల వచ్చినదే.
7.విలియం ద కాంకరర్ (విజేత)-1028-1087:- మధ్య యుగానికి చెందిన గొప్ప సైనికుడుగా, పరిపాలకుడిగా పేరుపొందిన విలియమ్ 1066లో విజయవంతముగా ఇంగ్లాండ్ ను ఆక్రమించాడు ఈయన అసలు పేరు గిలోమ్ లీ కాంకరెంట్ ఈయన ప్రాన్స్ చెందిన శక్తివంతమైన నోబుల్ ఇంగ్లాండ్ ను జయించి పరిపాలించాడు. ఆయన సంపాదన అంతాయుద్దాల వల్ల సంపాదించినదే చనిపోయే నాటికి తన వారసులకు 229. 5 బిలియన్ల ఆస్తిని అప్పజెప్పగలిగాడు.
8. ముఅమ్మర్ గడాఫీ (1942 - 2011):- లిబియాను 42 సంవత్సరాలు ఏకధాటిగా పరిపాలించిన నియంత గడాఫీ ఈ పరిపాలనలో చాలా వివాదస్పదమైన వ్యక్తిగా పేరు పొందాడు. ఈయన పరిపాలన కాలములో ఎన్నో ప్రజలచే వ్యతిరేక ఉద్యమాలు వచ్చాయి. అంతర్గత అశాంతి ఉండేది 2011లో ఈ నియంత చంపబడ్డాడు అయన తదనంతరమే అయన ఆస్తి వివరాలు ప్రపంచానికి తెలిసింది. బ్యాంకు ల ఉన్న నిల్వ ఇతర అసెట్స్ అన్ని కలిపి ఆనాటి విలువ 200 బిల్లియన్లుగా గుర్తించారు ఆ విధముగా ఆయన ప్రపంచములోని ధనవంతులలో ఒకడుగా గుర్తింపబడ్డాడు.
9. హేన్రి ఫోర్డ్ (1863-1947) : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజము ప్రపంచములో పేరెన్నిక గన్న ఫోర్డ్ మోటార్ కంపెనీ వ్యవస్థాపకుడు అయిన హేన్రి ఫోర్డ్. ఆస్తి విలువ199 బిలియన్లు ఫోర్డ్ బ్రాండ్ ను ప్రపంచవ్యాప్తముగా తీసుకు రావటంలో ఈయన పాత్ర ఎంతో ఉంది. కార్లను సాధారణ పౌరులకు కూడా అందుబాటులో అంటే కొనగలిగిన స్థితి కి తీసుకు వచ్చినవాడు ఫోర్డ్ ఆ విధముగా అమెరికాలో విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు తెచ్చు కున్నాడు.
10. కొమిలియస్ వాండెర్ బిల్ట్ (1704 - 1877) :- ఆ రోజుల్లో అత్యంత ధనవంతులలో మూడవవాడుగా పెరెన్నిక గన్న వ్యక్తి ఈయన. ఈయన ప్రఖ్యాత ఎంటర్ప్రెన్యూర్ దాత ఈయన ప్రముఖ మీడియా ఛానల్ CNN అధినేత ఆండర్సన్ కూపర్ యొక్క గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఈయన మొదట స్టీమ్ బోట్ పరిశ్రమతో వ్యాపారము ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా 70ఏళ్ల వయస్సులో రైల్ రోడ్లలో పెట్టుబడులు పెట్టాడు ఆ విధముగా తక్కువ కాలములోనే తనకాలములోని ధనవంతులలో ఒకడుగాఎదిగాడు. అయన చనిపోయేనాటికి అయన ఆస్తి 185 బిల్లియన్లు.
***
No comments:
Post a Comment