ఈ దారి మనసైనది - 31
అంగులూరి అంజనీదేవి
(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది. జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత. పల్స్ ప్రోగ్రాం టూర్ కి ఢిల్లీ, ఆగ్రా టూర్ వెళ్లి, ముగించుకుని తిరిగి వస్తారు. మెడికల్ కాలేజీ ఎక్సిబిషన్ కి వచ్చిన అనురాగ్ తల్లిదండ్రులకు అంతా తిప్పి చూపిస్తుంది దీక్షిత. బాధగా ఉన్న కొడుకును గమనించి విషయం అడుగుతుంది ప్రియబాంధవి.)
ఇంట్లో వాళ్లు తన టాలెంట్‌ని పట్టించుకోకపోయినా ఇతరుల అభినందనల్ని పొందటానికి ఎంతగానో ఆరాటపడి చదివేది. పోటితత్వాన్ని పెంచుకునేదిఇప్పడాపోటితత్వాన్ని చదువు మీద నుండి దీక్షిత మీదకి మళ్లించిందా? ఎలాగైనా ప్రేమను సాధించుకోవాలని ప్రయత్నిస్తుందా? ఇప్పడెలా?
అదోలాంటి షాక్‌లో వున్న తల్లిని చూస్తు....
“ఏంటిమమ్మీ ! అలా అయ్యావ్?" అన్నాడు అనురాగ్ తన తల్లికి మన్వితఅంటే ఎంత అభిమానమో అనురాగ్ కి తెలుసు. మన్వితకిచదువుపట్ల వున్న ఆసక్తిని చూసి ఒక లెక్చరర్‌గా ముచ్చట పడేది. ఇంకాప్రోత్సహించేది తనతో పాటు కూర్చోబెట్టిచదివించేది. తనకి పెట్టినట్లే తిండి పెట్టేది. జాగ్రత్తలు నేర్పేది. కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకునేది
ఈ వార్త విని కృష్ణవేణమ్మ కన్నా తన తల్లే ఎక్కువగా బాధ పడుందని తెలుసు. అందుకే ముందు చెప్పొద్దనుకున్నాడు. కానీ . తప్పలేదు.
అంత వరకు శూన్యంలోకి చూస్తున్న ప్రియబాంధవి అనురాగ్ వైపు చూసూ...
"నేను వెంటనే మన్వితను చూడాలి. ఇపుడెక్కడుంది?" అంది.
తల్లి అలా అడుగుతుంటే అతనిలో కంగారు కన్నా భయమే ఎక్కువగా కలిగింది. ఎందుకంటే... మన్విత ప్రేమించింది తననేఅని తెలిస్తే కృష్ణవేణమ్మ ఊరుకోడు. అక్కడ ఎవరు వున్నా లెక్క చేయకండా... మమ్మీ పై తన నోటి ప్రతాపాన్ని చూపిస్తుంది. అసలే ఆమెకు ‘ఆడపులి’అని వాళ్ల వీధిలో అవార్డ్ ఇచ్చినట్లు మన్విత ఒకసారి చెప్పింది.
“ఎం.జి.ఎం. హాస్పిటల్లో వుంది మమ్మీ! నేనే తీసుకెళ్తాను. ఒక్కదానివి వేళ్ళకు. అక్కడికి వచ్చే పేషంట్లని ...ఆ వాతావరణాన్ని...నువ్వు చూస్తే భయపడతావు. ఎక్కువగా అక్కడికి యాక్సిడెంటు కేసులు,మండుతాగిన కేసులు వస్తుంటాయి. చూడటానికి భయంకరంగా వుంటుంది. రేపు వెళ్దాం”. అన్నాడు.
కొడుకు చెప్పేదికరక్ట్ గా అన్పించినా... త్వరగా మన్వితను చూడాలని వుంది.
*****
మన్వితనుఎం.జి.ఎంహాస్పటల్ కు తీసికెళ్ళి ముందుగా క్యాజువాల్టి వార్డులో ఉంచారు. ఆమె కండీషన్ చూసి ట్రీట్ మెంట్ యిచ్చారు. బ్లెడ్ ఎక్కువగా పోవడంతో బ్లెడ్ ఎక్కించారు. రక్తం బాగా పోవడం వల్ల వీక్ గా వుందని రెండు రోజులు హాస్పిటల్ లో స్పెషల్ రూమ్ లో ఉంచమని చెప్పారు డాక్టర్. ఎందుకంటే ఆమె కూడా డాక్టరే అయినందువల్ల...కానీ...ఆమెను క్యాజువాల్తీ వార్డు నుండి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. కారణం రూమ్ ఖాళీ లేనందున జనరల్ వార్డులో ఉండవలసి వచ్చింది.
ఆమెను చూడటానికి క్లోజ్ ఫ్రెండ్స్ వస్తున్నారు. అబ్బాయిలు మాత్రం పెద్దగా రావటం లేదు.
ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు తెచ్చి ఇచ్చిన ఫ్రూట్స్,బొకేలు‘మన్విత చాలా ముఖ్యమైన వ్యక్తి’అన్నట్లు, ఆమె దగ్గరకి రాగానే ‘హాయ్’ చెబుతున్నాయి.
మన్వితకి మాత్రం ఎంతో వెలితిగా అన్పిస్తూ, ఆ వెలితిని పోగొట్టుకునే శక్తి తనలో లేదన్నట్లు నిరాశగా చూస్తోంది. తనకి కావలసిందేమిటో తెలుసుకొని, దాన్ని పొందగలిగే ప్రయత్నం చేసి ఓడిపోయి, ఒంటరిగా దిగులుగా చూస్తోంది. అసలే ప్రేమరాహిత్యంలో వున్న ఆమెను ఆ ఒంటరితనం మరింత బాధిస్తోంది.
ఆమె మణికట్ట దగ్గర డాక్టరు కట్టిన కట్టు తెల్లగా, స్పష్టంగా కన్పిస్తూ "ఏం తొందర వచ్చిందని ఇంత నిర్ధాక్షిణ్యంగా కోసుకున్నావు?" అన్నట్లుమన్విత వైపు చూస్తున్నా....మన్విత మాత్రం తన చేతి వైపు చూడకుండా అసలు తన శరీరం పై తనకి ఏ మాత్రం ఆసక్తి లేని దానిలా శూన్యంలోకి చూస్తోంది.
తల్లి ప్రేమ గుర్తుచ్చిందిమన్వితకి. తనకి తెలియకుండానే తల్లి నుండి ఎంతో ప్రేమను ఆశించింది. కానీ తన తల్లి తమ్ముడి మీద చూపించే ప్రేమలో ఒక వంతు ప్రేమను కూడా తన విూదచూపేది కాదు. ఏది పెట్టినా ముందు వాడికే పెట్టేది. వాడు తిన్నాక ఏం మిగిలేది కాదు. ఏది చేసినా వాడ్ని దృష్టిలో పెట్టుకునే చేసేది. ముందుగా తింటే ... వాడేంతినాలే, అంతా నువ్వే తినేస్తే .. ఆడ పిల్లవి ఏది తిన్నా సరిపోతుంది కదా! అనేది. ఆడపిల్లకి ఒక తిండి మగపిల్లవాడికి యింకో తిండి అనివుంటుందాఎక్కడైనా? తను మాత్రం బిడ్డకాదా? ఆమెకడుపున పుట్ట లేదా? తన కడుపులో ఆకల్నితీర్చే బాధ్యత ఆమెకు లేదా? ఇలా ఏ భారతం, రామాయణంలోనైనఉందా?
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment