ఓ బొజ్జ గణపయ్యా..!
-సుజాత.పి.వి.ఎల్
ఆది వేల్పువు..
తొలుత అవిఘ్నమస్తు అనుకొంటే..
అండ ఉండి ఆపదలు బాపుతావు..
శివ పార్వతుల గారాల పుత్రుడవు..
కైలాసం నుంచి భూలోకానికి
మాకోసం దిగి వచ్చిన
గిరి తనయి తనయుడవు..
మా అందరి గృహాలకు ఏతెంచి
వినాయక చవితి నాడు విందారగిస్తావు..
నీ బొజ్జ నిండుగా కుడుములు,
ఉండ్రాళ్ళు దండిగా పెడతాము..
సుష్టుగా ఆరగించి మము దీవించుమయ్యా..
ఓ బొజ్జ గణపయ్యా..
మా కళ్ళు చంద్రునివి కావు..
మా మనసు పరిహసించదెపుడు..
చల్లగా మము కావుమయ్యా..
దీర్ఘకాయా..విఘ్నరాయా..
నవరాత్రులు మా శక్తి కొలదీ..ఇరువదొక్క పత్రితో
తీరికొక్క తీపితో,
నిన్ను సంతృప్తి గావించెదము..
ఏటి నుంచి పారివచ్చే
నీటిలో నిను నిమజ్జనం చేసెదము..
భక్తి శ్రద్ధలతో చేసిన
మా పూజలను మరువకయ్యా..!
తోటి వారికి సాయపడి
తోడు నడిచే బుద్ధినివ్వుమయ్యా..
బాధలొస్తే బెదిరిపోని
గుండె ధైర్యాన్నివుమయ్యా.
.ఓ బొజ్జ గణపయ్యా..
ఎప్పటికీ నీ బంటు మేమయ్యా..!!
****
No comments:
Post a Comment