ఈ దారి మనసైనది - 32
(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది. జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత. పల్స్ ప్రోగ్రాం టూర్ కి ఢిల్లీ, ఆగ్రా టూర్ వెళ్లి, ముగించుకుని తిరిగి వస్తారు. మెడికల్ కాలేజీ ఎక్సిబిషన్ కి వచ్చిన అనురాగ్ తల్లిదండ్రులకు అంతా తిప్పి చూపిస్తుంది దీక్షిత. ఆత్మహత్య చేసుకోబోయిన మన్విత ను కలిసేందుకు వెళుతుంది ప్రియబాంధవి.)
తన ఫ్రెండ్స్ అంతా ... పండగలని, పుట్టిన రోజులని, ఇలా సంవత్సరంలో అప్పడప్పుడు కొత్త బట్టలు వేసుకుంటుంటే . తనేమో వేసుకున్న డ్రస్లే వేసుకుంటూ చిరిగిపోయేంత వరకు వేసుకునేది. ఎప్పడైనా కొత్తవి కావాలని అడిగితే "ఉన్న డ్రస్‌లు చాలవా? అవన్నీ ఏం చేస్తావ్? అవి చిరిగిపోనియ్! తర్వాత చూద్దాం." అనేది ఎప్పడైనా ఫ్రెండ్స్ తో తిరిగినా,ఫ్రెండ్ ని ఇంటికి తీసుకొచ్చినా ... 'నీకు స్నేహాలెందుకే?నువ్వుకూడా వాళ్లలాగేతయారవ్వటానికా? సినిమాలని, షికార్లని, చిరుతిండ్లని... వాళ్లతో తిరగడం మొదలు పెట్టావంటే కొంపలో డబ్బులు మిగలవు. నీ సరదాల పుణ్యమా అని వాటికి నడక వచ్చి వెళ్లిపోతాయి. బయటకి వెళ్ళావంటే కాళ్లు విరగొడతాను ! ఏదో మీ నాన్న గారు చెప్పారు కాబట్టి అనురాగ్ వాళ్ల యింటికి వెళ్లు ఇంకెక్కడికివెళ్లకు." అనేది.
"మమ్మీ ! అక్క నాకు 'అక్కడ కన్పించింది. ఇక్కడ కన్పిచింది. బయట తిరుగుతుంది." అని తమ్ముడు కూడా తన విూద తల్లితో చెబుతాడే కానీ . "అక్క కూడా మనిషే .. అన్ని అవసరాలు వుంటాయి... అక్కకి కూడా స్నేహితులు కావాలి. అవసరమైన చోటుకి వెళ్తుండాలి." అని అనుకోడు తల్లి తన విూద మిలటరీ ఆఫీరసైతే,తమ్ముదేమో పోలీస్...
అమ్మంటే అమ్మే .... అమ్మ పదమే కమ్మగా అన్పిస్తుంది ఆ కమ్మదనం తల్లిలో చూసుకోవాలిని .... ఆడ పిల్లగా తనకి తెలియని ఎన్నో విషయాలను తెలుసుకోవాలని ఆశించేది. ఒక్కరోజు కూడా ఆ ఆశతీరలేదు.
ప్రస్తుతం మన్విత మనసునిండా స్థబ్దత, నిశ్శబ్దత....
ఈ సారి ఎలా చావాలి? అన్నదే ఆమె ఆలోచన.....
చచ్చేముందు ఎవరూ చూడకుండా - ఎవరూ అపలేని విధంగా ప్లాన్ చేసుకోవాలి. లేకుంటే ఇదిగో ఇలాగే బ్రతికిస్తారు....బ్రతికితే? అనురాగ్ లేకుండా బ్రతకలేదు. అతని మనసు, మాట, నవ్వు, కోపం, తాపం అన్నీ వేరెవరికోఅప్పజెప్పి.... తనేమీ కాని దానిలావుండ లేదు. ఇన్ని రోజులు అతనే ప్రాణం, అతనే ప్రపంచం అన్నట్లుగా వూహించుకొని, ఇక ముందు అతనేవిగాకాడు అన్న భావనతో, మానసిక వ్యధతో బ్రతకలేదు. అందుకే...!
" అనురాగ్ ! నువ్వు నాకు గుర్తిస్తే చాలు ... నాలో ఏమీవుండదు నీజ్ఞాపకం తప్ప...అప్పడే నువ్వు నా పక్కన లేకపోయినా నీ జ్ఞాపకం తప్ప.... నీ జ్ఞాపకాలు చాలనిపిస్తోంది.... నీ జ్ఞాపకాలు నాపక్కన వుంటే నాలో నేనుండను. అంతా నువ్వే... ఇంత కన్నా ఏం చెప్పను నేను ..?" అని మనసులో అనుకుంటున్న ఆమె కంటి చివరన కన్నీటి చుక్క వేదనతో జారుతుంటే .. !
ధీరజ్ తన బెడ్ వైపు వస్తూ కన్పించాడు. ఇతనేంటి ప్రత్యేకించి తన బెడ్ వైపే వస్తున్నాడు?
హాస్పిటల్ కి పోస్టింగ్స్ కి వచ్చినప్పుడు. అసిస్టెంట్ ప్రొపెసర్లతో వుండేపి.జి. లతో ఇతను కూడా కన్పిస్తుంటాడు ....ఏఫ్రాన్వేసుకాని డీసెంట్ గా, డిగ్నిఫైడ్ గా అన్పిస్తాడు. అతను కన్పించగానే ఓపిక వున్న రోగులు కూర్చుని నమస్కారం చేస్తుంటే, ఓపిక లేని వారు పడుకునే చేతులు జోడిస్తున్నారు.
నిన్న తనని క్యాజువాలిటీ నుండి జనరల్ వార్డుకి మార్చే ముందు- అమ్మాయిని ప్రైవేటు హాస్పిటల్కితీసుకుపోదామని తండ్రి అంటుంటే "ఏం ! ఇక్కడుండే వాళ్లు డాక్టర్లు కాదా? ఇక్కడ మందులు లేవా? అని తల్లి అనడం అంత బాధలో కూడా విన్పించింది మన్వితకి.
ప్రైవేటు హాస్పటల్‌కి వెళ్లకుండా ఇక్కడ వున్నందువల్ల తనకి తెలియని ప్రపంచాన్ని చూడగలుగుతుంది.
ఇన్ని రోజులు. ఈ హాస్పిటల్‌కి వచ్చి తనొక మెడిసిన్ సూడెంట్గా పోస్టింగ్స్ టైంలో పేషంట్లను మాత్రమే చూసి వెళ్తుండేది ఇప్పడు తనుకూడా ఒక పేషంట్లా ఆ పేషంట్లమధ్యన పడుకొని వాళ్ల బాధల్ని ఇబ్బందుల్ని చూడగలుతోంది.
తన బాదేమో గాని . ప్రస్తుతం వాళ్ల బాధలు, వాళ్ల విచిత్ర మనస్వత్వాలుమన్విత మనసును హత్తుకుంటున్నాయి.
ఆ జనరల్ వార్డులో వుండే బెడ్స్ లో కొంత మంది పేషంట్లు ఎంత చూసిన రాని ఆత్మీయుల కోసం ఎదురు చూస్తుంటే .... ఇంకొంత మంది ఇంటి కన్నాఇది పదిలం అన్నట్లుగా లేని జబ్బుల్ని బాధల్ని నటించి అక్కడ అడ్మిట్ అవుతున్నారు. మరి కొంత మంది హాస్పటల్ని నరకంగా భావించి అక్కడ నుండి ఎప్పుడు బయటపడదామా అన్నట్లుగా చూస్తున్నారు.
ఒక వైపు ఒక రోగి కడుపులో నొప్పి అని అరగంటకోసారి గట్టిగాకేకలు పెడుతుంటే... ఇంకో వైపు చనిపోయిన పేషంటుతాలుకు వాళ్లు శోకాలు పెట్టి ఏడుస్తున్నారు. అది చూస్తుంటే భూలోకంలో ఈ లోకం కూడా వుందా అన్పిస్తోంది.
అక్కడకొచ్చే డాక్టర్లతో అంటే చీఫ్, అసిస్టెంట్లు, హౌస్‌సర్జను, పి.జిలతో - తమ బాధల్ని రకరకాలుగా మార్చి చెబుతుంటారు. అన్ని జబ్బులకి ఒకేసారి మందులు పడితే ప్యూచర్లోయింకేంరావన్నఉద్దేశ్యం కావొచ్చు వాళ్లది. వాళ్లంతా పల్లెల నుండి వచ్చిన నిరక్షరాస్యులు.
కొంత మందికి ఇంజక్షన్ల పిచ్చి చేతిలో సిరంజితో వున్న డాక్టర్ వంక ఆశగా చూస్తుంటారు. ఇంజక్షన్ పడితేనే గాని తమ జబ్బులు తగ్గవన్నదే వాళ్ల భావన.
ఒక హౌస్ సర్జన్ వచ్చి .... ఒక పేషంటికి ఇంజక్షన్ చేస్తున్నప్పడు నీడిల్ బ్లాక్ అవడంతో అతను మళ్లీ ప్రయత్నించి ఇంజక్షన్ చేసివెళ్లాడు. "పొడిచి, పొడిచి, చంపాడు. ఏం డాక్టరో ఏమో ! కొత్త డాక్టర్ కన్నా పాతరోగిమేలన్నట్లు. స్టెతస్కోపు మెల్లో వేసుకోవడం కూడా సరిగ్గా రాని ఇలాంటి వాళ్లంతా డాక్టర్లేనా? నేను ఇక్కడ నుండి వెళ్లేలోపల పెద్ద డాక్టర్‌తో చెప్పే వెల్తాను." అని పక్క ఊరి మాజీ సర్పంచి తన చేతి వైపు చూసుకుంటూ అంటుంటేమన్వితకినవ్వొచ్చింది.
కొంత మంది కాస్త జబ్బుకే ఉలిక్కిపడి చిన్నదాన్ని పెద్దగా చేసి చెపుతుంటే .. ఇంకొంత మంది ఎంత బాధ వున్నా ధైర్యంగా వుండి నోరెత్తకుండా పడుకున్నారు. మరికొంత మందేమో డాక్టరు కన్పించగానే మళ్లీ రేపటి వరకు కన్పిస్తారోలేదోన్నట్లు - ఆ రోజు వాళ్లకి ఎన్నిసార్లు కడుపు నొప్పి వచ్చిందో.... ఎన్ని సార్లు వాంతులు అయ్యాయో .... రాత్రి టైంలో నిద్రరాక ఎన్ని సార్లు మేల్కోన్నారో... టకటక చెప్పి 'హమ్మయ్యా’ఇక నా బాధలన్నీ తీరిపోతాయి అన్నట్లుగా డాక్టర్ వైపు చూస్తుంటే మన్వితవాళ్లనేచూస్తోంది.
కొంత మంది సెక్యూరిటి వాళ్లు, వార్డ్ శుభ్రపరిచే బాయ్, బయట నుండి లోపలికి వచ్చే పేష్ంట్ అటెండర్స్ వద్ద మనీ లంచంగా వసూలు చేస్తున్నారు. హాస్పిటల్ లోపల ఒక అంటెడర్ మాత్రమే వుండాలన్న రూల్ వున్నా కూడా బంధువులు వాళ్ల ఆత్మీయుల పైన ప్రేమను చంపుకోలేక గుంపులుగా సెక్యూరిటీ వాళ్లకిమనీ ఇచ్చి వార్డులోకి వస్తున్నారు. పేదవాళ్ళకి ఇది కష్టమైనా ధనికులకు మాత్రం ఈ విధంగానైనా వాళ్ల ఆత్మీయులని చూడనిస్తున్నారన్న ఆనందం కలుగుతుంది. వాళ్ళ ఆనందాన్ని చూసి ప్రేమ ఇంత గొప్పదా? అనిఫీలయింది ఆ ప్రేమ నాకు దొరకట్లేదు ఏమిటి ? అనిఫీలయింది.
కొంత మంది డాక్టర్ని చూడగానే, లేచి కూర్చుని... ఆయనలా వెళ్లగానే .. "ఈ డాక్టరు సారు చేతి వాసి చాలా మంచిది. మొన్న మా పిన్నికి క్షణంలో బాగు చేశాడు. వాళ్ల మామగారికి కూడా బాగయింది. ఆ గురితోనే ఏది బాగలేకున్నాఇక్కడికే వస్తారు." అనిఅంటుంటేవెళ్తున్న డాక్టర్ వైపు గొప్ప స్వామిజీనిచూసినట్లు చూస్తున్నారు మిగిలిన పేషంట్లు...
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment