మన దేశపు కరెన్సీ ( రూపాయి నోట్ల) చరిత్ర - అచ్చంగా తెలుగు

మన దేశపు కరెన్సీ ( రూపాయి నోట్ల) చరిత్ర

Share This
మన దేశపు కరెన్సీ ( రూపాయి నోట్ల) చరిత్ర
అంబడిపూడి శ్యామసుందర రావు




మొదటిసారిగా పేపర్ కరెన్సీ ని 18 వ శతాబ్దములో బ్యాంక్ ఆఫ్ హిందూస్తాన్ ,బ్యాంక్ ఆఫ్ బెంగాల్,బ్యాంక్ ఆఫ్ బొంబాయ్,బ్యాంక్ ఆఫ్ మద్రాస్ వంటి ప్రయివేట్ బ్యాంక్ లు మని ట్రేడింగ్ లో పేపర్ కరెన్సీ ని ముద్రించారు 1861లో వచ్చిన పేపర్ కరెన్సీ చట్టముకు లోబడి ఈ ప్రింటింగ్ జరిగింది.   మొదట రూపాయి నోట్లు కాగితముతో తయారుచేయబడ లేదు దూది మరియు గుడ్డపీలికలను వాడి తయారు చేసేవారు భారత దేశములో ఒక రూపాయి నోట్ మరియు నాణేలను మాత్రమే కేంద్ర ప్రభుత్వము ఆర్ధిక శాఖ ఆధ్వర్యములో ముద్రిస్తుంది అందుచేతనే వీటిపై ఆర్ధిక శాఖ కార్యదర్శి సంతకము చేస్తాడు మిగిలిన అన్ని డినామినేషన్ల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ముద్రిస్తుంది.
స్వాతంత్రము వచ్చిన తరువాత పాకిస్తానీ రూపాయి చెలామణిలోకి వచ్చినప్పటికీ మొదట్లో భారతీయ నాణేలను కరెన్సీని వాడేవారు వాటిపైన పాకిస్తాన్ అనే స్టాంప్ వేసి వాడేవారు పాకిస్తాన్ ప్రభుత్వము తరుఫున భారతీయ ప్రభుత్వము రిజర్వ్ బ్యాంకుకు పాకిస్తాన్ లో మాత్రమే వాడు కోవటానికి వీలుగా ముద్రించి ఇచ్చేవారు ఆ నోట్లు ఇండియాలో చెల్లుబాటు ఆయెవి కావు.,పాకిస్తాన్ 1948 నుండి తన స్వంత కరెన్సీని ముద్రించు కోవటం ప్రారంభించింది బ్రిటిష్ పరిపాలనలోను ఆ తరువాత కొన్నాళ్ళు రూపాయికి 16 ఆణాలు,రెండు అణాలను బేడా అని నాలుగు అణాలను పావలా అని, ఎనిమిది అణాలను అర్ధరూపాయి అనివిభాగాలుగా పిలిచేవారు అణాని పైసలు గా విభజించారు రూపాయి నాణేలను వెండితో తయారుచేసేవారు ఆ తరువాత ముద్రణ ఖర్చు ఎక్కువ అని అల్యుమియం, నికెల్ కోబాల్ ల మిశ్రమ లోహముతో  నాణేలను తయారుచేయటం మొదలుపెట్టారు. ఈ పైసలు రాగితో తయారు చేసేవారు 1947 నుండి పైసలు అణాలు బేడలు,పావలా, అర్ధరూపాయలు పోయి రూపాయికి 100 నయా పైసలు అనే డెసిమల్ పద్దతిని ప్రవేశపెట్టారు ప్రస్తుతము అంటే 1964 లో నయా పోయి పైసా మిగిలింది.
నాణేలను 2011లోని కాయినేజ్ చట్టము ప్రకారము 1000 రుపాయల దినామినేషన్ వరకు ముద్రిస్తారు. ఈ నాణేలను గమనించినట్లయితే కొన్ని విశేషాలను తెలుసుకోవచ్చు మొదటిది ఆ నాణెము ముద్రించిన సంవత్సరము ఆ సంవత్సరము క్రింద ఉన్న గుర్తు ఆ నాణెము ఏ టంకశాల లో తయారు అయిందో  తెలియజేసే గుర్తు ఉంటుంది భారతదేశములో నాణేలను నాలుగు చోట్ల ముద్రిస్తారు ఢిల్లీలోని నోయిడాలో తయారు అయినా నాణేలకు సంవత్సరము క్రింద ఒక చుక్క ఉంటుంది. ముంబాయి లో తయారు అయినవాటికి ఒక డైమండ్ ఉంటుంది హైదరాబాదు లో వాటికి ఒక నక్షత్రము, కలకత్తాలో తయారు అయినా వాటికి సంవత్సరము క్రింద ఏ గుర్తు ఉండదు బ్రిటిష్ పాలనలో నాణేలపై బ్రిటన్ రాజు జార్జి ,రాణి విక్టోరియా  బొమ్మలు ఉండేవి .అప్పుడప్పుడు ప్రముఖుల జ్ఞాపకార్డఫము గౌరవ సూచకముగా 75,100, 1000 రూపాయల నాణేలను మొదటిసారిగా 2010లో  ముద్రించారు రిజర్వ్ బ్యాంక్ 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భముగా, రవీంద్రనాధ్ టాగోర్ శతజయంతి సందర్భముగా, 1000 ఏళ్ల చరిత్ర కలిగిన తంజావూర్ బృహదీశ్వరాలయము గౌరవార్థముగా జ్ఞాపక చిహ్నముగా ఈనాణెలను ముద్రించారు. నాణేలు ముద్రించి టంకశాలలు రూపాయి నోట్లకు అవసరమైన కాగితము ప్రింటింగ్ ప్రెస్ ఆర్ధిక శాఖ  ఆధ్వర్యములో పని చేస్తాయి.
ఇంక రూపాయి నోట్ల విషయానికి వస్తే  భారత దేశములో రెండు కంపనీలకు చెందిన ప్రింటింగ్ ప్రెస్ లు రిజర్వు బ్యాంక్ ఆధ్వర్యములో నోట్లను(కరెన్సీ) ముద్రిస్తాయి.ముద్రణ్  ప్రయివేట్ లిమిటెడ్ సంస్థకు కర్ణాటక  మైసూర్ లోను, వెస్ట్ బెంగాల్ సల్బోనీలోను ఈ ప్రెస్ లు ఉన్నాయి ఇక్కడ ఏటా 16బిలియన్ల నోట్లు ముద్రించబడతాయి ఈ నోట్లకు కావలసిన కాగితము మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ లో గల సెక్యూరిటీ పేపర్ మిల్ లో తయారు అవుతుంది కర్టేన్సి ముద్రణలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అయినప్పటికీ దొగనోట్ల చలామణి తీవ్రవాద  సంస్థలు మన పొరుగు దేశాలైన పాకిస్తాన్ బంగ్లా దేశ్ లనుండి తెప్పించుకొని మన భారత దేశములో చలామణి చేస్తాయి .. ప్రస్తుతము మనదేశములో సర్క్యులేషన్ లో ఉన్న నోట్లు, నాణేల విలువ అధికారికంగా 17.77లక్షల కోట్లు  మొత్తము సర్క్యులేషన్ లో ఉన్న కరెన్సీ విలువ 14.1లక్షల కోట్లు.డిమానిటైజేషన్ వల్ల పనికిరాకుండా పోయిన నోట్లు 86%. . కొత్త నోట్ల ముద్రణకు అయ్యేఖర్చు 12,000కోట్ల రూపాయలు. 2007 నాటికి  మన దేశ జి.డి.పి లో నల్ల ధనము 23.2%.ప్రస్తుతానికి ఇంకా ఎక్కువగా పెరిగి ఉండవచ్చు.స్విస్ సెంట్రల్ బ్యాంక్ వారి తెలిపిన వివరాలను బట్టి  2015చివరకు విదేశాలలోని నల్ల ధనము విలువ 8,392కోట్లు (1.2 బిలియన్ ఫ్రాన్క్ లు). ప్రపంచ దేశాలలో క్యాష్ - జి .డి,పి. నిష్పత్తి సగటున 4%  ఉండగా మనదేశములో  నిష్పత్తి 12% (భారతదేశము జిడిపి 2.3ట్రిలియన్ డాలర్లు. నోట్ల ను రద్దు చేసిన వారిలో మోడీ మొదటివాడు ఏమికాదు 1946లో అంటే స్వాతంత్రానికి ముందే అప్పటి రిజర్వు బ్యాంక్ గవర్నర్ సి.డి దేశముఖ్ వేయి,పదివేల రూపాయల నోట్లను రద్దుచేశారు . 1970లో కె.ఎన్ వాంచూ కమిటీ నల్ల ధనాన్ని అరికట్టటానికి పెద్దనోట్ల రద్దుకు సిఫార్స్ చేసింది. 1978లో మొరార్జీ దేశాయి ప్రభుత్వము  డిమానిటైజేషన్ యాక్ట్ 1978 ప్రకారము వెయ్యి,ఐదు వేలు పదివేల నోట్లను కలిగివుండటం నేరమని ప్రకటించింది.ఇప్పటివరకు రిజర్వ్ బ్యాంక్ ప్రింట్ చేసిన నోట్లలో పెద్ద డినామినేషన్ 1938లో ప్రింట్ చేసిన 10,000 రూపాయల నోటు. మళ్లా  1954 లో కూడా ప్రింట్ చేశారు కానీ 1946 ఒకసారి 1978 మరోసారి రద్దు చేశారు.
ప్రస్తుతము నడుస్తున్న బ్యాంక్ నోట్లను మహాత్మా గాంధీ సీరీస్ అంటారు ఈ సీరీస్ ను 1996లో ప్రవేశపెట్టారు మనకున్న 17 భాషలలో 15 భాషలు నోట్ల మీద కనిపిస్తాయి ఈ భాషలలో హిందీ మధ్యలో ప్రామినెంట్ గాఉంటుంది నోట్ వెనుక భాగములో ఇంగ్లిష్ స్పష్టముగాఉంటుంది  నోట్ల మీద నంబర్ తో పాటు I,J,O,X,Y,Z , అనే ఇంగ్లిష్ అక్షరాలు ఉంటాయి 26 అక్షరాలలో రిజర్వ్ బ్యాంక్ 20 అక్షరాలని వాడు కుంటుంది.భద్రతా కారణాల వల్ల  రిజర్వ్ బ్యాంక్ ఏ ప్రింటింగ్ ప్రెస్ కు ఏ అక్షరాలను కేటాయించింది బయటికి తెలియనివ్వరు ప్రస్తుతము మన రూపాయికి గుర్తును దేవనాగరి లిపిలోని "र"లాటిన్ అక్షరము R ను కలిపి డిజైన్ చేశారు దీనిని 2010లో ఉదయ్ కుమార్ అనే యువకుడు డిజైన్ చేసాడు ఈ గుర్తుకు సమాంతర ముగా ఉండే రేఖ మన జెండా లోని మూడు రంగులను కలిగి ఉంటుంది.చూపు లేని వారి కోసము నోట్ల మీద ఎడమ వైపు వేరు వేరు జామెట్రికల్ షేప్స్ ఉంటాయి చేతితో తడమాటానికి వీలుగా వెయ్యి రూపాయల నాట్ మీద డైమండ్ అకృతి ,ఒక వలయము ఐదు వందల నోటు మీద, చతురస్రము వంద నోటు మీద దీర్ఘ చతురస్రము ఇరవై నోటు మీద పది రూపాయల నోటు మీద ఏమి ముద్రించరు.ఇవండీ మన రూపాయి నోట్ల ముచ్చట్లు వీటి విషయములో రిజర్వ్ బ్యాంక్ దే తుది నిర్ణయము.
***

No comments:

Post a Comment

Pages