జ్యోతిష్య పాఠాలు -1 - అచ్చంగా తెలుగు

జ్యోతిష్య పాఠాలు -1

Share This

జ్యోతిష్య పాఠాలు -1 

పి.ఎస్.వి.రవికుమార్  

ఓం 

నమో వెంకటేశాయ

శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినామ్

శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌.



 


జ్యోతిష్యం అనేది మన ఆరు వేదాంగాలలో ఉన్నటువంటి ఒక శాస్త్రం. జ్యోతిష్యం ద్వారా మనకు భవిష్యత్తు లో జరిగేవి ముందుగానే తెలుసుకొనవచ్ఛు. జ్యోతిష్యం మానవ జీవితానికి ఒక జ్యోతి వలె ఉపయోగ పడుతుంది. కష్టకాలం లో ఆ కష్టాల ప్రభావంను  తగ్గించే శక్తి జ్యోతిష్య శాస్త్రం కి ఉంది. మన  పురాణాల్లో శ్రీనివాసుని  తో పద్మావతి కళ్యాణం జరుగుతుందని నారదుడు, చేయి చూసి చేప్పినట్టు తెలుసు

వరాహ మిహిరుడు మొదటిసారిగా జ్యోతిష్యాన్ని గ్రంథ రూపం లో అందించాడు. మిహిరుడు ఉజ్జయిని నగరం లో జన్మించిన గణిత , జ్యోతిష్య రంగాలలో ప్రావీణ్యం పొందిన  శాస్త్రవేత్త. ఈయన కు శాస్త్రం లో ఉన్న పరిజ్ఞానం తెలుసుకుని, మహారాజు  విక్రమాదిత్య చంద్రగుప్తుడు ఆయన ఆస్థానం లో నవరత్నాలలో ఒకని గా నియమించాడు

ఒక నాడు మిహిరుడు,  రాజు కుమారుని జ్యోతిష్యం పరిశీలన  చేసిఅతని యుక్త వయసు వచ్చ్చేసరికి, వరాహం కారణం గా మరణిస్తాడు అని తెలిపెను. కారణం గా  రాజు,  కుమారునికి చాలా కట్టు దిట్టములు చేసి పెంచెను.

రాజ కుమారునికి యుక్త వయసు వఛ్చిన పిమ్మట, నివాసం లో ఉన్న వరాహ ప్రతిమ మీద పడి  మరణం సంభవించెను. మహారాజు  తన కుమారుని మరణానికి విలపించెను

అటు పిమ్మట రాజు మిహిరుని శాస్త్ర పరిజ్ఞానం కు మెచ్చుకుని ఆయనకు వరాహముద్ర తో సత్కరించేను. ఆనాటి నుండి మిహిరుడు నామం వరాహమిహిరుడు గా స్థిరపడిపోయినది 

 

పాఠం -  1

 

ఒక మనిషి యొక్క జాతక చక్రం వేయుటకు, ఆ మనిషి పుట్టిన తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం, పుట్టిన ఊరు వివరాలు సేకరించి , ఆ తర్వాత జాతక చక్ర నిర్మాణం చేయాలి.

జ్యోతిష్యం ను నేర్చుకొనుటకు ముందుగా  మనం  గ్రహాలూ, రాశులు, రాశి చక్రం, లగ్నం, నక్షత్రాలు గురించి తెలుసుకోవాలి. జ్యోతిష్యం అంతా వీటి మీదే ఆధారపడి ఉంటుంది.

గ్రహాలు:

మొత్తంగ్రహాలు .

  1. రవి

  2. చంద్రుడు

  3. బుధుడు 

  4. గురుడు

  5. శుక్రుడు


  1. కుజుడు 

  2. శని

  3. రాహువు 

  4. కేతువు


రాశులు :

మొత్తం 12  రాశులు 

  1. మేషం

  2. వృషభం 

  3. మిథునం

  4. కర్కాటకం

  5. సింహం

  6. కన్య


  1. తుల

  2. వృశ్చికం

  3. ధనుస్సు

  4. మకరం

  5. కుంభం

  6. మీనం







లగ్నం: మనం పుట్టినప్పుడు భూమి పైన ఎక్కడ ఉన్నామో చెప్పేదే లగ్నం.
లగ్నం అన్నది రెండు గంటలకు ఒక సారి మారును. మనిషి జన్మించిన కాలం నందు, లగ్నం ఏ రాశి లో ఉన్నదో అదియే ఆ మనిషి యొక్క లగ్నం. ఈ లగ్నం యందే మనిషి యొక్క జ్యోతిష్యం అంతా ఆదారపడి యున్నది. ఈ ఆధునిక ప్రపంచం లో కంప్యూటర్స్ సహాయం తో లగ్నం కనుగొనటం చాలా సులభం.

నక్షత్రాలు:

మనకు 27  నక్షత్రాలు ఉన్నాయి


అశ్వని, భరణి, కృత్తికా, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పూర్వ ఫాల్గుణి,  (పుబ్బ ), ఉత్తర ఫాల్గుణి, (ఉత్తర ), హస్త, చిత్త , స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూలా , పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషా,పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి

ఒకొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి. అనగా 27 నక్షత్రాలు 4 పాదాలు వెరసి, 108 పాదాలు. ఒకొక్క రాశి లో 9 పాదాలు ఉంటాయి 


మేష రాశి లో అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు కృత్తికా 1 పాదం 


వృషభ రాశి లో కృత్తికా 2, 3, 4  పాదాలు, రోహిణి 4 పాదాలు మృగశిర 1,2 పాదాలు 


మిథున రాశి లో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వశు 1,2, 3 పాదాలు


కర్కాటక రాశి లో పునర్వసు 4 పాదం , పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు


సింహ రాశి లో మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం 


కన్యా రాశి లో ఉత్తర 2,3,4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1,2 పాదాలు


తులా రాశి లో చిత్త 3,4, పాదాలు స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు


వృశ్చిక రాశి లో విశాఖ 4 పాదం, అనూరాధ 4 పాదాలు, జ్యేష్ట 4 పాదాలు


ధనూ రాశి లో మూల 4 పాదాలు, పూర్వాషాడ 4 పాదాలు ఉత్తరషాడ 1 పాదం


మకర రాశి లో ఉత్తరషాడ 2,3,4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1,2, పాదాలు


కుంభ రాశి లో ధనిష్ట 3,4, పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3, పాదాలు


మీన రాశి లో పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు రేవతి 4 పాదాలు

(రెండొవ భాగం వచ్చే నెల)


No comments:

Post a Comment

Pages