జ్యోతిష్య పాఠాలు -2 - అచ్చంగా తెలుగు

                                           జ్యోతిష్య పాఠాలు -2 

పి.ఎస్.వి.రవికుమార్  

పాఠం -  2



రాశి చక్రం 

ప్రతి గ్రహం సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మనకున్నగ్రహాలు పరిభ్రమనం లో  ఎదో  ఒక రాశి లో ఉంటాయిమనిషి పుట్టినప్పుడు గ్రహం ఏ రాశి లో ఉంది, అని తెలిపేది రాశి చక్రం.


రాశి చక్రం  లో  12  రాశులు ఉంటాయి. అందులో మొదటి రాశి గా మేషం“ పేర్కొనబడుతుంది . ప్రతి రాశి కి ఒక గ్రహం ఆధిపత్యము వహిస్తుంది. అవి ఏమిటో ఇక్కడ చూద్దాం


సింహ రాశి కి రవి అధిపతి అనగా రవి గ్రహానికి సింహ రాశి స్వ క్షేత్రం 

కర్కాటకం కి చంద్రుడు అధిపతి  అనగా చంద్రుడు కి కర్కాటక రాశి స్వ క్షేత్రం


మేషం, వృశ్చికం కి కుజుడు అధిపతి, అనగా కుజ గ్రహానికి మేషం , వృశ్చికం స్వ క్షేత్రం


వృషభం, తుల కి శుక్రుడు అధిపతి అనగా శుక్ర గ్రహానికి వృషభం, తుల స్వ క్షేత్రం


మిథునం , కన్యా రాశులకు బుధుడు అధిపతి, అనగా బుధ గ్రహానికి మిథునం , కన్యా స్వక్షేత్రం 


ధనుస్సు, మీన రాసులకి గురు గ్రహం అధిపతి , అనగా గురు గ్రహానికి  ధనుస్సు, మీన  స్వ క్షేత్రం


మకరం కుంభం రాశులకు శని అధిపతి, అనగా శని గ్రహానికి మకరకుంభ రాశులు, స్వ క్షేత్రం



రాహు, కేతువులు  ఛాయా గ్రహాలు కావున  స్వ క్షేత్రాలు లేవు. కానీ కొన్ని పరిశోధనల అనంతరం ఆధునిక జ్యోతిష్య శాస్త్రాలలో రాహువు కి కన్య స్వక్షేత్రం గా, కేతువు కు మీనం స్వక్షేత్రాలుగా నిర్ణయించడం జరిగింది.

రాశి కారకత్వాలు:

రాశులని సరి రాశులు, బేసి రాశుల గా విభజించారు


సరి రాశులు (స్త్రీ)

బేసి రాశులు (పురుష)

వృషభం , కర్కాటకం, కన్య,  వృశ్చికం, మకరం, మీనం

మేషం, మిథునం, సింహం, తులా, ధనుస్సు, కుంభం


బేసి రాశులన్నీ పురుష రాశులుగాను, సరి రాశులన్నీ స్త్రీ రాశులుగాను నిర్ణయించారు.

రాశులను చర రాశి, స్తిర రాసి , ద్వి స్వభావ రాశి గా విభజించారు.


చర రాశి:

 చర రాశి లో జన్మించిన వ్యక్తులు తరచు మార్పు కోరుకుంటారుచురుకు తనం ఎక్కువ, నిర్ణయాలు వేగం గా తీసుకొంటారు, నిర్ణయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు, ప్రారంబించిన పనులను మధ్యలో ఆపి వేస్తారు.

స్తిర రాశి: 

స్తిర రాశి లో జన్మించిన వ్యక్తులు స్తిర మైన అభిప్రాయం కలిగి ఉంటారు చేసే వ్రుత్తులయందు స్తిరం గా ఉంటారు. మూర్కత్వం ఉండును.


ద్వి స్వభావ:

ద్వి స్వభావ రాశులలో జన్మించిన వ్యక్తులు సమస్యలను త్వరగా పరిష్కరిస్తారు, పలు విషయాలపై పరిజ్ఞానం ఉంటుంది వాక్చాతుర్యం కలిగి ఉంటారు, చొరవ తక్కువ.


చర రాశి

స్తిర రాశి

ద్వి స్వభావ రాశి

మేషం

కర్కాటకం

తుల

మకరం

వృషభం 

సింహం

వృశ్చికం

కుంభం

మిథునం

కన్య

ధనుస్సు

మీనం


రాశులకి 4 తత్వాలు కలవు. అవి అగ్ని, వాయు, భూ, జల తత్వాలు.

అగ్ని తత్వ రాశులు:

వీరికి నాయకత్వ అక్షణాలు ఎక్కువ. వీరికి పొగడ్తలు అంటే ఇష్టం. కోపం అధికం. కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా పోతుంది. ఆధ్యాత్మిక శక్తి అధికం.


భూ తత్వ రాశులు:

శరీర ధారుడ్యం, భోజన ప్రియులు, చేసే పని యందు పట్టుదల, సహనం ఎక్కువ, ఒక కార్యక్రమం చేసే ముందు అన్నీ కూలంకశం గా ఆలోచన చేస్తారు


జల తత్వ రాశులు:

ఊహా శక్తి అధికం, వీరిలో ఎక్కువ మంది కవులు, రచయితలు గా ఉంటారు, ఆవేశపరులు


వాయు తత్వ రాశులు:

సహనం తక్కువ, నిలకడలేమి, పని పూర్తి అయ్యేవరకు వేచి ఉండలేరు, పరిశీలన శక్తి ఎక్కువ

అగ్ని తత్వ రాశులు:


భూ తత్వ రాశులు:


వాయు తత్వ రాశులు:


జల తత్వ రాశులు:


మేషం

సింహం

ధనుస్సు

వృషభం 

కన్య

మకరం

మిథునం

తుల

కుంభం

కర్కాటకం

వృశ్చికం

మీనం


*(పైన తెలుపబడిన వివరాల ఆధరం గా జ్యోతిష్య నిర్ణయం చేయరాదు.)

No comments:

Post a Comment

Pages