దుర్గా సప్తశతి
-సుజాత.పి.వి.ఎల్.
తాము పైహి మహారాజ శరణం పరమేశ్వరీమ్!
ఆరాధితా సైవ నృణాం భోగస్వర్గాపవర్గదా !!'
అనగా ''మహారాజా! తాము ఆ పరమేశ్వరినే శరణు పొందుతూ చక్కగా ఆరాధించినచో ఆమెయే మానవులకు స్వర్గమును, భోగమును, చివరకు ఆపవర్గమును కూడా ప్రసాదించును '' అని చెప్పెను. ఈ విధముగానే ఐశ్వర్య కాముకుడగు సురథ మహారాజు భగవతి దుర్గామాతను ఆరాధించి అఖండ సామ్రాజ్యమును పొందగలిగెను. ఇంతవరకు ఆశీర్వాద రూపమగు ఈ మంత్రమయ గ్రంథము ను ఆశ్రయించి ఎందరో జిజ్ఞాసువులు, అర్ధార్ధులు, అలాగే జ్ఞాని భక్తులు, తమ తమ మనోభీష్టములను పొందగలిగిరని నిస్సంకోచముగా చెప్పవచ్చు.
'ఇత్త్యుక్తా సా తదా దేవీ గంభీరాంతఃస్మితా జగౌ !
దర్గా భగవతీ భద్రా యాయెడం ధార్యతే జగత్ !! '
జగజ్జనని శ్రీ దుర్గాదేవి కృపాకటాక్షముతో మార్కండేయ పురాణాంతర్గతమగు ఈ దుర్గా సప్తశతి ని గురోపదేశం తో పారాయణం చేసిన మిక్కిలి ఉపయుక్తము.
యయాశ్రీ: స్వయం సుకృతినాం భవనేష్వ లక్ష్మీ :పపాత్మనాం కృతధియాం హృదయేశు బుధ్ధి : !శ్రద్ధా సతాం కులజానా ప్రభవస్య లజ్జాత
తాంత్వాం సతా: స్మ పరిపాలయ దేవి విశ్వమ్ !!
'సప్తశతీ పారాయణము న విధిని జాగ్రత్తగా అవధానంలో ఉంచుకొనవలయును . అంతకన్నా కావలసినది శ్రీ దుర్గా మాత పాదపద్మములయందు భక్తి శ్రద్దాశక్తులతో జగన్మాతను స్మరించుచు సప్తశతీ పారాయణం గావించు వారికి అమ్మ అనుగ్రహం త్వరలోనే అనుభవమునకు వచ్చును .
దేవిప్రపన్నార్తి హరే ప్రసీద ప్రసీద మాతర్జగతో ఖిలస్య !
ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం త్వమేశ్వరీ దేవి చరాచరస్య !! '
*******
No comments:
Post a Comment