శ్రీధరమాధురి - 80 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి - 80

Share This

శ్రీధరమాధురి - 80 

(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)


బౌద్ధ మఠం ... సన్యాసి... దయ...

అప్పుడే అందరు సన్యాసులు తమ ధ్యానాన్ని ముగించారు. మఠాధిపతి విశ్రాంతి తీసుకునేందుకు తన గదికి వెళ్లనున్నారు.

సన్యాసి గురువర్యా, మీ పరీక్ష కోసం ఎవరో తలుపువద్ద నిరీక్షిస్తున్నారు,

మఠాధిపతి అతన్ని నా గది వద్దకు తీసుకుని రండి.

ఆయన గదిలోకి ప్రవేశించగానే, మఠాధిపతి ఒక 20 ఏళ్ళ వయసున్న యువకుడు తనకోసం నిరీక్షించడాన్నిచూసారు.

మఠాధిపతి ఎవరునువ్వు ? నీకేమి కావాలి ?

సందర్శకుడు నాకు సన్యాసి కావాలని ఉంది. నాకు ఎటువంటి విద్యా పరిజ్ఞానం లేదు. మా నాన్నగారు నాకు చెస్ ఆడడం నేర్పారు, అదొక్కటే బాగా ఆడగలను.

మఠాధిపతి పర్వాలేదు, మేము నిన్ను చేర్చుకుని, సన్యాసం ఇప్పించగలము. కాని, ప్రస్తుతం మఠం నిండుగా ఉంది. అయినా నీకొక అవకాశం ఉంది.

మఠాధిపతి తన శిష్యులతో : ఈ సందర్శకుడు మఠంలో చేరాలని అనుకుంటున్నాడు, అతనికి చదరంగం తప్ప ఏమీ తెలీదు. అందుకే సన్యాసి బాషోఈ కుర్రవాడితో చదరంగం ఆడాల్సిందిగా నేను కోరుతున్నాను. ఒకవేళ బాషో గెలిస్తే, అతను మఠం వదిలి వెళ్ళాలి, అతని బదులు ఈ సందర్శకుడు మఠంలో చేరతాడు. సందర్శకుడు ఓడిపోతే, అతనికి మనతో ఉండే అవకాశం ఉండదు.

మఠాధిపతి ముందుకు ఒక చదరంగం బోర్డు తీసుకుని రాబడింది. ఆట మొదలైంది. సందర్శకుడు బాగా ఆడుతున్నాడు, కాని బాషో అతనితో పోటీ పడలేకపోతున్నాడు. సందర్శకుడు హఠాత్తుగా బాషో ముఖం వంక చూసాడు. అతను చాలా పవిత్రంగా, మౌనంగా ఉన్నాడు. అతని కళ్ళలో ఎంతో శాంతి ద్యోతకమవుతుంది. సందర్శకుడు ఇలా అనుకున్నాడు,’ఈ సన్యాసి మఠంలో ఉంటే, అది ప్రపంచానికి మంచిది. ఈ విషయం తాను సన్యాసి కావడం కంటే గొప్ప విషయమని అతనికి అనిపించింది.

అందుకే సందర్శకుడు, కావాలనే ఒక్కొక్క అడుగులో ఆటను ఓడిపోవడం మొదలుపెట్టాడు. అతనికి సన్యాసి ఓడిపోవడం ఇష్టం లేదు. మఠాధిపతి ఇది గమనించి, వెంటనే అక్కడికి వచ్చి, ఆట చెక్కను తీసి విసిరేశారు.

మఠాధిపతి నీకు ఈ ఆటను గెలిచేందుకు తగిన నైపుణ్యం, సామర్ధ్యం ఉన్నాయి. కాని, నీలోని దయ నీవీ ఆటలో ఓడిపోయేలా చేస్తోంది. ఈ సన్యాసి ఓడిపోతే బయటకు వెళ్లిపోతాడని నువ్వు భయపడ్డావు. ఇదే నేను తెలుసుకోవాలని అనుకున్నది. మా మఠానికి స్వాగతం. పిల్లలూ, ఇతని తలను గొరిగి, స్నానం చేయించి, కొత్త దుస్తులు తొడిగి, ఇతన్ని ధ్యాన మందిరానికి తీసుకుని రండి. ఈ దయగల వ్యక్తికి మనం సన్యాసం ఇవ్వాలి.

***

 

No comments:

Post a Comment

Pages