జ్యోతిష్య పాఠాలు -3 - అచ్చంగా తెలుగు
జ్యోతిష్య పాఠాలు -3
PSV రవి కుమార్ 

గ్రహములు వాటి స్వభావములు:
మనకున్న 9 గ్రహములకు విభిన్న స్వభాములు, గుణములు, లింగ, భేదములు కలిగి ఉన్నవి. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.

రవి, కుజ, గురు  లను పురుష గ్రహములుగా, 
చంద్రుడు, శుక్రుడు, రాహువు లను స్త్రీ గ్రహములుగా, 
బుధ, శని, కేతువు లను  నపుంసక గ్రహములుగా నిర్ణయించారు. 

గ్రహ గుణములు: 
సత్వ గుణ గ్రహములు: రవి, చంద్ర, గురు
రజో గుణ గ్రహములు: బుధ, శుక్ర
తమో గుణ గ్రహములు: శని, రాహు, కేతు, కుజ

గ్రహ తత్వములు: 
అగ్ని తత్వం: రవి, కుజ
జల తత్వం: చంద్ర, శుక్ర
భూ తత్వం: బుధుడు
వాయు తత్వం: శని
ఆకాశ తత్వం: గురు

శుభ - అశుభ గ్రహములు:
శుభ గ్రహములు: గురుడు, శుక్రుడు, పూర్ణ చంద్రుడు (శుక్ల పంచమి నుండి బహుళ పంచమి)
పాప గ్రహములు: రవి, కుజ, శని, రాహువు, కేతువు, క్షీణ చంద్రుడు (బహుళ పంచమి నుండి శుక్ల పంచమి వరకు)
బుధ గ్రహం శుభ గ్రహాలతో కూడిన శుభత్వాన్ని, పాప గ్రహాలతో కూడిన పాపత్వాన్ని పొందును 
రాహు కేతువులు పాప గ్రహాలతో కూడిన పాపత్వం, శుభ గ్రహాలతో కూడిన అర్ద పాపత్వాన్ని పొందును.

గ్రహ గమనం : 
ప్రతి గ్రహం ఒక రాశి లో కొంత నిర్దిష్ట కాలం ఉండును. ఒక రాశి నుండి ఇంకొక రాశి మారుటకు ఒకొక్క గ్రహానికి కొంత సమయం పడుతుంది. ఆ వివరాలు
గురుడు:  గురుడు ఒక రాశి లో 12 నెలలు అనగా ఒక సంవత్సరం ఉండును. గురుడు అన్ని రాశులు తిరగటానికి 12 సంవత్సరములు అగును.
శని:  శని ఒక రాశి లో 2 సంవత్సరాల 6 నెలలు ఉండును. అనగా 12 రాశులు తిరగటానికి 
పట్టే కాలం 30 సంవత్సారాలు.
రాహువు - కేతువు: ఈ గ్రహములు, ఒక రాశి లో ఉండే కాలం, 18 నెలలు. 

ఈ గ్రహాలు మాత్రమే ఒక రాశి నుండి ఇంకొక రాశి కి వెళ్ళుటకు ఎక్కువ కాలం అగును. మిగితా అన్ని రాశులు త్వరిత గతిన వెళ్తాయి.
రవి రాశి మారుటకు పట్టే సమయం ఒక నెల అయితే, చంద్రుడు కు పట్టే సమయం రెండున్నర రోజులు, కుజుడు కు 45 రోజులు, బుధుడు కు మరియు శుక్రుడు కు పట్టే సమయం 1 నెల.

గ్రహ మిత్ర శత్రుత్వాలు:
మనకు వెరే వారితో మిత్ర శత్రుత్వాలు ఉన్నట్టే  గ్రహములకు కూడా మిత్ర శత్రుత్వలు ఉన్నవి. ఏ గ్రహమైనను జాతక చక్రం లో  మిత్రులతో కలిసి ఉన్ననూ, మిత్ర క్షేత్రం లో ఉన్నను, మంచి ఫలితములు ఇచ్చును.

గ్రహం

మిత్రులు

శత్రువులు

సములు

రవి

చంద్ర, కుజ, గురుడు

శని, శుక్ర

బుధ

చంద్ర

రవి, బుధ

 ---------------

కుజ ,శని, శుక్ర, గురుడు

కుజ

రవి, చంద్ర, గురుడు

బుధ

శని, శుక్ర

బుధ

రవి, శుక్ర

చంద్ర

శని, కుజ, గురుడు

గురుడు

చంద్ర, కుజ

బుధ, శుక్ర

శని, రవి

శుక్ర

బుధ, శని,

రవి, చంద్ర

కుజ, గురుడు

శని

బుధ,,శుక్ర

రవి, చంద్ర, కుజ

గురుడు

రాహువు

శుక్ర, శని

రవి, చంద్ర, కుజ

బుధ, గురుడు

కేతువు

రవి, చంద్ర, కుజ

శుక్ర, శని

బుధ, గురుడు


గ్రహ దృష్టి:
ఏ గ్రహమైనను, తానున్న రాశి నుండి ఏడవ రాశి లో ఉన్న గ్రహమును వీక్షించును. 
గురుడుకి, శనికి, కుజునికి మాత్రం ప్రత్యేక దృష్టి కలదు.
శని - తానున్న రాశి నుండి ఏడవ రాశి ని వీక్షిస్తూ, 3,10  రాశులని అందులో ఉన్న గ్రహాలను కూడా చూస్తాడు 
కుజుడు - తానున్న రాశి నుండి ఏడవ రాశి ని వీక్షిస్తూ, 4,8 రాశులని అందులో ఉన్న గ్రహాలను కూడా చూస్తాడు
గురుడు - తానున్న రాశి నుండి ఏడవ రాశి ని వీక్షిస్తూ, 5,9 రాశులని అందులో ఉన్న గ్రహాలను కూడా చూస్తాడు 
గ్రహ సంచారం:
ప్రతీ గ్రహం ఒక రాశి లో  నిర్దిష్ట కాలం ఉండి ముందుకు వెలుతుంది. ఉదాహరణ కు, గురు గ్రహం, ధనస్సు రాశి లో ఒక 12 నెలల కాలం ఉండి ఆ తర్వాత మకర రాశి లోకి ప్రవేసిస్తుంది. అలా కాకుండా కొన్ని సందర్బాలలో గ్రహాలకు ప్రత్యేక సంచారం లేక గతులు కూడా చెప్పబడ్డాయి.

వక్ర గతి: ఎదైన గ్రహం తానున్న రాశి నుండి వెనుక రాశి కి వెళ్ళినట్టయితే ఆ గమనాన్ని వక్ర గమనం లేక వక్ర గతి అంటారు. ఉదాహరణకు, గురుడు ధనస్సు రాశి నుండి వృశ్చికం రాశి లో కి వెళ్తే దానిని వక్రగతి అంటారు. ఈ పరిస్తితుల్లో ఆ గ్రహం తానిచ్చు ఫలితాలకి వ్యతిరేక ఫలితాలు ఇచ్చును.

అతిచారం: ఎదైన గ్రహం నిర్దిష్ట కాలం కంటే ముందుగా తానున్న రాశి నుండి తర్వాత రాశి కి వెళ్ళినట్టయితే ఆ గమనాన్ని అతిచరం అంటారు. 
ఉదాహరణకు గురుడు ధనస్సు రాశి లో నుండి 12 నెలలకంటే ముందుగా మకర రాశి లోకి ప్రవేసిస్తే దానిని అతిచారం అంటారు. ఈ పరిస్తితి లో ఉన్న గ్రహాలు బలహీనమయ్యి శుభ ఫలితాలు ఇవ్వవు.

గ్రహ స్తంబన: ఏదైన గ్రహం తానున్న రాశి లో నిర్దిష్ట కాలం కంటే ఎక్కువ కాలం ఉంటే ఆ సమయం లో ఉన్న గ్రహమును స్తంబన లో ఉన్నది అని తెలుపుతారు. ఇటువంటి గ్రహాలు పాప ఫలితాలు ఇచ్చును. 

అస్తంగత్వం:
ఎదైనా గ్రహం రవి గ్రహం తో కలిసి ఒకే రాశి లో ఉన్నచో దానిని అస్తంగత్వం అంటారు. ఈ పరిస్తితుల్లో రవి తో ఏ గ్రహమైతే కలిసిందో ఆ గ్రహం తన శక్తి ని కోల్పోయి పూర్తి ఫలితాలు ఇవ్వలేవు.
కాని రవి గ్రహం తో బుధ గ్రహం కలిసిన చో అస్తంగత్వ దోషం ఉండకపోగా బుధాదిత్య యోగం గా పరిగణింపబడుతుంది. రవి బుధుల కలయిక కు కూడా కొన్ని డిగ్రీ ల దూరం   (రవి బుధుల మధ్య దూరం) వరకు లెక్క కట్టి చెప్పవలెను. 

రవి కి బుధునికి మద్య 14 డిగ్రీ ల పైన దూరం ఉంటే అస్తంగత్వ దోషం ఉండదు
రవి కి చంద్రుడి కి మద్య దూరం 12 డిగ్రీ ల పైన ఉంటే అస్తంగత్వ దోషం ఉండదు
రవి కి కుజుడు కి మద్య దూరం 17 డిగ్రీ ల పైన ఉంటే అస్తంగత్వ దోషం ఉండదు
రవి కి శుక్రుడు కి మద్య దూరం 10 డిగ్రీ ల పైన ఉంటే అస్తంగత్వ దోషం ఉండదు
రవి కి గురుడు కి మద్య దూరం 11 డిగ్రీ ల పైన ఉంటే అస్తంగత్వ దోషం ఉండదు
రవి కి శని కి మద్య దూరం 15 డిగ్రీ ల పైన ఉంటే అస్తంగత్వ దోషం ఉండదు.

గ్రహ ఉఛ్చ నీచ  
ప్రతి గ్రహానికి స్వక్షేత్రం అని ఉన్నట్టే ఉఛ్చ నీచ  క్షేత్రాలు కలిగి ఉంటాయి.
ఉచ్చ పొందిన రాశి అధ్బుత ఫలితాలు ఇచ్చును. నీచం పొందిన రాశి పాప ఫలితాలు ఇచ్చును. గ్రహానికి ఏ రాశి అయితే   ఉఛ్చ  అయిందో ఆ రాశి నుండి ఏడవ రాశి నీచం అగును.  

గ్రహం

ఉఛ్చక్షేత్రం

నీచక్షేత్రం

రవి

మేషం

తుల

చంద్రుడు

వృషభం

వృశ్చికం

కుజ

మకరం

కర్కాటకం

బుధుడు

కన్య

మీనం

గురుడు

కర్కాటకం

మకరం

శుక్రుడు

మీనం

కన్య

శని

తుల

మేషం

రాహువు

వృషభం

వృశ్చికం

కేతువు

వృశ్చికం

వృషభం


No comments:

Post a Comment

Pages