నరకాసురుని కుమారుడైన భగదత్తుడు
అంబడిపూడి శ్యామసుందర రావు
భగదత్తుడు మహాభారతము లో తక్కువగా పేర్కొనబడ్డ పాత్ర. ఇతను తూర్పు ప్రాంతానికి చెందిన రాజు మహాభారతములో ద్రోణ పర్వములోని రెండవ అధ్యాయములో ఈయన గురించి వివరింపబడింది కురుక్షేత్ర సంగ్రామములో కౌరవుల తరుఫున పోరాడిన యోధుడు ప్రాగ్జ్యోతిష రాజ్యానికి (ప్రస్తుత అస్సాము లోని గౌహతి నగరము) రాజైన దానవ చక్రవర్తి నరకాసురుని కుమారుడు హర్షచరిత, కలికపురాణాలప్రకారము నరకాసురునికి భగదత్తుడు, మహాసిర్సామడవన్ మరియు సుమాలి అనే ముగ్గురు కొడుకులు, వజ్రదత్తుడు పుష్పాదత్తుడు అనే ఇద్దరు భగదత్తుని కుమారులు దానవుడు అవటం శ్రీ కృష్ణునితో ఉన్న వైరము వలన కౌరవుల పక్షాన పొరాడటము వలన ఈయనకు మహాభారతము లో అంత గుర్తింపు రాలేదు శ్రీకృష్ణునితో జరిగిన యుద్దములో నరకాసురుడు ఏ విధముగా సత్యభామ చేతిలో చనిపోయాడో మన అందరికి తెలిసిన విషయమే నరకాసుర సంహారానికి గుర్తింపుగా దీపావళి పండుగను జరుపుకుంటున్నాము.నరకాసురుడు శ్రీ మహావిష్ణువు కోసము తపస్సు చేసి వైష్ణవస్త్రాన్ని వరముగాపొందాడు.ఈ ఆయుధము యొక్క జ్ఞానాన్ని నరకాసురుడు తన కుమారుడైన భగదత్తునికి అందజేయటం వలన భగదత్తుడు మహా యోధుడుగా గుర్తింపబడ్డాడు.
నరకాసుర వధ అనంతరము శ్రీ కృష్ణుడు భగదత్తుని ప్రాగ్జ్యోతిష రాజ్యానికి రాజుగా చేస్తాడు అర్జునుడు రాజసూయ యాగము సందర్భముగా ఉత్తరము వైపు సాగించిన దండయాత్రలో భగదత్తునితో పోరాడవలసివచ్చింది ఆ యుద్ధము ఎనిమిది రోజులపాటు సాగింది. చివరకు భగదత్తుడు అర్జునుడి అధిపత్యానికి లొంగ వలసి వచ్చింది భగదత్తుడు తానూ చేసే యుద్ధాలలో ఏనుగును అధిరోహించి యుద్ధము చేసేవాడు అతని ఏనుగు పేరు సుప్రతిక ఈ ఏనుగు భారీ ఆకారంతో తెలుపు రంగులో ఉండేది ఇంద్రుని ఐరావతమును పోలి ఉండేది. ఈ ఏనుగు అంజనా అనే ప్రముఖ ఏనుగుల వంశానికి చెందినది. మహాభారత కాలములో ఈ ఏనుగు పై అధిరోహించి భీకరముగా యుద్ధము చేసిన మహావీరుడు భగదత్తుడు.
కురుక్షేత్ర సంగ్రామానికి ముందు భగదత్తుడు ధర్మరాజు చేసిన రాజసూయయాగము సందర్భముగా అర్జునుడితో 8 రోజులపాటు పోరాడితే భగదత్తుని కుమారుడు వజ్రదత్తుడు కురుక్షేత్ర యుద్ధము తరువాత ధర్మరాజు చేసిన అశ్వమేధయాగము సందర్భముగా అర్జునుడితో యుద్ధము చేస్తాడు.దీనికంతటికి కారణము శ్రీకృష్ణుడు నరకాసురుని చంపటము మరియు శ్రీ కృష్ణుడు పాండవుల పక్షాన ఉండటం నిజానికి యుద్ధ భూమి లో భీష్ముడు, ద్రోణుడు తరువాత వయస్సులోపెద్దవాడు భగదత్తుడే శరీరము ముడతలు పడి తెల్లని జుట్టుతో యుద్ధభూమిలో సింహము లాగ ఉండేవాడు. తన కంటి చూపుకు నుదుటి మీది చర్మము అడ్డురాకుండా నుదుటికి గుడ్డ ను చుట్టుకొనేవాడు సుప్రతికను అధిరోహించి యుద్ధ భూమి లో తిరుగాడేటప్పుడు ఇంద్రుడిని తలపించేవాడు. తలపించటమే కాదు ఇంద్రునికి స్నేహితుడు కూడ యుద్దములో ఒక అక్షౌహిణి సైన్యాన్ని నడిపించేవాడు కౌరవుల పక్షాన ద్రోణుడు, అశ్వత్థామ ,వృషసేనుడు,కర్ణుడు, అలంబుషుడు సరసన మహారథి హోదాను పొందినవాడు భగదత్తుడు భగదత్తుడు ఏనుగు సుప్రతిక కూడ యుద్దములో మంచి ఆరితేరినది.ఇంచుమించుగా ఓటమి ఎరుగని ఏనుగు దీనిపై బంగారు కవచము రాజు కూర్చునే సింహాసనము ఆ రాజు విజయ కేతనము(జెండా) ఉంటాయి కధన రంగములోని ఇతర జంతువులకు భయము కలిగేటట్లు యుద్ధము చేసేది.
పాండవుల వైపు భీముడు హిడింబల కుమారుడైన రాక్షవీరుడు ఘటోత్కచుడు కౌరవసేనలకు భయము గొలిపేటట్లు యుద్ధముచేసేవాడు అలాగే భగదత్తుడు కౌరవపక్షాన ఉంది పాండవ సేనలకు భయము కలిగించేవాడు.ఇద్దరు దానవ వీరులే ఇద్దరు శక్తి మంతులే చెరో వైపు ఉండి యుద్ధము చేసేవారు కురుక్షేత్ర సంగ్రామములో నాల్గవ రోజు భగదత్తుడు ఘటోత్కచుడి తో తలపడతాడు.అలాగే భగదత్తుడు భీముడు అభిమన్యుడు వంటి యోధులతో కూడా తలపడతాడు నాల్గవ రోజు భీముడు భగదత్తుని సైన్యము పై దాడి చేసినప్పుడు భగదత్తుడు భీముని ఛాతీపై విసిరిన ఆయుధము వల్ల భీముడు రథములో కుప్పకూలుతాడు అప్పుడు భీముని కొడుకు ఘటోత్కచుడు వచ్చి భీభత్సము సృష్టించి మాయము ఆవుతాడు కొంచము సేపటికి మళ్ళా ప్రత్యక్షమై రాక్షస మాయతో యుద్ధము చేస్తాడు. తన మాయతో అంజనా, వామన, మహాపద్మ అనే దేవత ఏనుగులను సృష్టించి తానూ నాలుగు తొండాల ఐరావతము పై అధిష్టించి యుద్దాము చేస్తాడు భగదత్తుని ఏనుగు ఈ దాడిలో గాయపడుతుంది ఈ అరిస్థితిని గమనించిన భీష్ముడు ఆ రోజుకు యుద్దానికి విరామాన్ని ప్రకటిస్తాడు. ఆ విధముగా ఆరోజు యుద్దములో విజయము పాండవుల పక్షాన చేరుతుంది.
7వ రోజు యుద్దములో ఘటోత్కచుడు మరోసారి భగదత్తునితో తలపడతాడు. అమ్ముల వర్షము కురిపిస్తాడు. ఇద్దరు భీకరాయుధాలతో పోరుసాగిస్తారు.చివరలో భగదత్తుడు ఘటోత్కచుని కాళ్ళు చేతులపై అస్తరాలను వదులుతాడు అప్పుడు ఘటోత్కచుడు తేరుకొని తన గదను సుప్రతీకునిపై(ఏనుగు) విసురుతాడు భగదత్తుడు వేగముగా ఆ ఆయుధాన్ని అడ్డుకొని ముక్కలుచేస్తాడు.ఆ విధముగా ఘటోత్కచునిపై ఆధిక్యత సంపాదిస్తాడు ఘటోత్కచుడు ఆరోజు యుద్ధము నుండి విరమిస్తాడు.
కౌరవుల పక్షాన కురుక్షేత్ర యుద్దములో భగదత్తుడు 12 రోజులు యుద్దము చేస్తాడు 12వ రోజు యుద్దములో దుర్యోధనుడు సైన్యాన్ని ఏనుగులతో భీముని మీదకు పంపుతాడు భీముడు ఆ ఏనుగులను సైనికులను తన గదతో చంపుతాడు. ఈ వార్తా భగదత్తునికి చేరి భీముని మీదకు దాడికి వస్తాడు. ఆ దాడిలో భీముని రధము సుప్రతికుని కాళ్ళ క్రింద నలిగిపోతుంది సుప్రతికీడు తన తొండముతో భీముడిని పట్టుకోవాలని చూస్తుంది కానీ భీముడు తప్పుకుంటాడు. ఆ ప్రయత్నములో సుప్రతికుని తొండము దెబ్బకు భీముడు మరణించివుంటాడని కౌరవ సేన భావిస్తుంది.ధర్మరాజు భీమునికి సహాయముగా రాజు దాసర్నాను పంపుతాడు ఆ విధముగా ఆరోజు యుద్దములో భీముడు భగదత్తుని చేతిలోనుండి తప్పించుకుంటాడు అదే రోజు జరిగిన యుద్దములోఅభిమన్యుడు సాత్యకి వంటి వీరులు భగదత్తుని ధర్మరాజు వైపు పోకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తారు.
భగదత్తుని ఏనుగు పాండవుల సైన్యాన్ని తొక్కి నాశనము చేస్తూ ఉంటుంది. అప్పుడు అర్జునుడితో భగదత్తుని యుద్ధము ప్రారంభమవుతుంది. అర్జునుడితో భగదత్తుడు చేసిన యుద్ధము చాలా చారిత్రాత్మకమైనది భగదత్తుడు రెండు ఈటెలను అర్జునుడి పై విసిరితే అర్జునుడి కిరీటము క్రింద పడిపోతుంది.ఆ రోజు జరిగిన యుద్దములో భగదత్తుడు అర్జునునిపై వైష్జ్ఞావస్త్రాన్ని ప్రయోగిస్తాడు కానీ రథసారధిగా ఉన్న శ్రీకృష్ణుడిని చేరిన ఆ అస్త్రము వైజయంతి మాల గా మారి శ్రీకృష్ణుని మెడను అలంకరిస్తోంది అర్జునుడిట్ శ్రీకృష్ణుడు ఆ అస్త్రము విష్ణువు ప్రసాదించినది అని దానిని ఎవరు ఆపలేరు అని తానూ సాక్షాత్తు విష్ణు మూర్తి కాబట్టి ఆ అస్త్రము తనను చేరి హారముగా మారినది అని శ్రీ కృష్ణుడు వివరణ ఇస్తాడు తన శక్తి వంతమైన అస్త్రాన్ని కోల్పోయాడు కాబట్టి భగదత్తుని చంపటం సులభమని శ్రీకృష్ణుడు అర్జునునితో చెపుతాడు శ్రీకృష్ణుని సలహా మేరకు అర్జునుడు భగదత్తుడు తలకు కట్టుకున్న వస్త్రాన్ని ఛేదిస్తాడు అప్పుడు భగదత్తుని చూపుకు ముఖములోని ముడతలు అడ్డుపడి చూపు సరిగాకనిపించక యుద్ధము సరిగా చేయలేకపోతాడు.
అయినప్పటికీ భగదత్తుడు అర్జునుడితో తన పోరును కొనసాగిస్తాడు. అర్ధ చంద్రాకృతిలోని బాణాన్ని భగదత్తుని గుండెలోకి చొచ్చుకుపోయేటట్లుగా అర్జునుడు అస్త్రాన్ని ప్రయోగిస్తాడు అదేవిధముగా మరో అస్త్రాన్ని ప్రయోగించి భగదత్తుని ఏనుగు సుప్రతిక కుంభ స్థలము మీదకు ప్రయోగించి భగదత్తుడిని సుప్రతికను నెలకొరిగేటట్లు చేస్తాడు. ఫలితముగా ఇద్దరు మరణిస్తారు ఆ విధముగా భగదత్తుడు అర్జునుడి సౌర్య పరాక్రమాలకు తలవొగ్గి ప్రాణాలను విడుస్తాడు యుద్ధము ముగిసినాక చనిపోయిన భగదత్తుడి శరీరము చుట్టూ గౌరవసూచకంగా ప్రదక్షిణాలు చేసి శ్రద్ధాంజలి ఘటిస్తాడు ఆ విధముగా కురుక్షేత్ర సంగ్రామంలో 12వ రోజున అర్జునిడికి భగదత్తుడికి జరిగిన యుద్ధము భగదత్తుడు పడిపోవటం భయంకర ఘట్టముగా పేర్కొనబడింది.
***
No comments:
Post a Comment