శ్రీధరమాధురి -81 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి -81

Share This

 శ్రీధరమాధురి -81

(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)


అతను తన బాస్ గురించి షికాయతు చేసాడు.

అతను – గురూజీ, మా బాస్ పెద్ద మూర్ఖుడు, దీనికి తోడు దురహంకారంతో రగులుతూ ఉంటాడు. నాకు సహనం చచ్చిపోతోంది. ఏదో ఒకరోజున నేను అతని మీద అరుస్తాను.

నేను – అలా చెయ్యకు. నువ్వు ఇబ్బందిలో పడతావు. నదిలో ఈత కొడుతుండగా మొసలితో విరోధం పెట్టుకోకు.

***

  భవిష్యత్తు గురించి చింతించడం మాని, ఇంతవరకు  మిమ్మల్ని  దీవించిన అంశాలకుగానూ ప్రకృతి పట్ల కృతజ్ఞులై ఉండండి.


 


మీరున్న విధంగానే అందంగా ఉన్నారు. మిమ్మల్ని మీరు మార్చుకోవడం గురించి అంతా చెప్పే మాటలన్నీ విని, నిరాశకు లోను కాకండి. మీరు మీలాగే ఉండండి, ఇతరులు అవ్వాలనుకున్న విధంగా కాదు.


 


జీవితం సాగిపోతూనే ఉంటుంది. ఎవరికోసం ఆగదు. అందుకే మీరు ఏమవ్వాలనుకుంటే అది అవ్వండి, ఇతరులు చూడాలనుకున్న విధంగా కాదు.


 ***


అతను ధ్యానం చేసేందుకు కళ్ళు మూసుకున్నాడు. అతను చూడాలనుకోని అంశాలను అతను చూడదలచుకోలేదు. కాని, అతను తన హృదయాన్ని మూసుకోలేకపోయాడు, అలాగే నా పట్ల ఉన్న భావాలను కూడా. అతను కళ్ళు తెరిచాడు. అనుకోకుండా అతని కళ్ళ నుంచి కన్నీళ్లు జాలువారాయి. నేను వెనుక నుంచి అతన్ని గట్టిగా హత్తుకున్నాను. తన తలను వెనక్కు తిప్పకుండా, అతను ప్రేమగా ‘గురూజీ’ అన్నాడు. అదే నిజమైన ప్రేమయొక్క శక్తి. ఒకవిధంగా మేమిద్దరం ధ్యానంలో ఉన్నాము.


 కొన్నిసార్లు నిఘంటువులో ఉన్న పదాలన్నీ చిన్న భావనను వర్ణించలేవు.


 ***


గతం గురించిన ఆగ్రహాన్ని మీరు ఎంత ఎక్కువగా మోస్తే, ప్రస్తుతంలో ప్రేమకు అంత దూరమవుతారు. ఆ కోపానికి బందీ కాకండి, ఇది స్వేచ్చకు అవరోధం. ప్రేమ అంటే అటువంటి స్వేచ్చే.


***

No comments:

Post a Comment

Pages