జ్యోతిష్య పాఠాలు -4 - అచ్చంగా తెలుగు
జ్యోతిష్య పాఠాలు -4
పి.ఎస్.వి.రవికుమార్
పాఠం -  4



గ్రహ కారకత్వాలు:
ఒకొక్క గ్రహానికి కొన్ని కారకత్వములు నిర్ణయించడం జరిగింది. జాతక పరిశీలన చేసేటప్పుడు ఈ  గ్రహ కారకత్వాలు ఉపయోగ పడతాయి.
రవి:
తనువు, రాజ్యాదికారం, ఆధిపత్యం, ధైర్యం, నేత్ర సంబంద శిరో వ్యాది, ఆవేశం, పొగడ్తలకు లొంగిపోతారు, రాజకీయాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, పట్టుదల, ఆరోగ్యం, తండ్రి. 
చంద్రుడు:
మనస్సు, ఈత నైపుణ్యం, అన్య సంపర్క కారకుడు, కొంత కాలం ఉత్సాహం, కొంత కాలం నిరుత్సాహం, శ్వాసకోస వ్యాదులు, జ్ఞాపక శక్తి, మానసిక ప్రవర్తన, మనస్సు యందు నియంత్రన, తల్లి, నీరు, బాల్యం.
కుజుడు:
గాంభీర్యం, పట్టుదల, యుధ కారకుడు, భవనాలకు, భూములకు కారకుడు, పరుష వ్యాక్యా లు, వ్యవహార చాతుర్యత తక్కువ, దాంపత్య వినాశ కారకుడు, మిలిటరీ, పోలీస్, సాహస క్రీడలు, , ధైర్యశాలి, సాహస క్రుత్యాలు, రక్తం,  మొండివాడు, కోపం, కారగార వాసానికి కారకుడు, వ్యవసాయం, శస్త్ర చికిత్సలు, శస్త్ర చికిత్స యందు ఆశక్తి,  ప్రమాదాలకు కారకుడు.
గురుడు:
బ్రాహ్మణత్వం, రాజ సన్మానం, వేద విద్య, సాంప్రదాయ, సంతాన కారకుడు, ఆధ్యాత్మిక విద్యలకు కారకుడు,  మ్రుదు భాషి, జ్యోతిష్య విద్య నేర్చుకొనుటకు, తీర్త యాత్రలు, దైవ దర్శనాలు. 
 దోష స్తానం లో ఉన్న స్తూల కాయం, తిండిపోతు తనం. 
శని:
ఉచ్చ స్తితి కి తీసుకు పోయి పతనం చూపు స్వభావం, ఆయు కారకుడు, రాజ్యాదికార దాత, నీచ సాంగత్య కారకుడు, నీచ విద్య కు ప్రాప్తి, మోసకారి, కల్లు, సారాయి అంగల్లల్లో ఉండుట, ఇనుము, యంత్రాల వ్యాపారానికి కారకుడు, ప్రజాభిమానానికి కారకుడు, సన్నని దేహం, క్రమ శిక్షణ , భూములు, ఆస్తులు,  ఆలస్యానికి కారకుడు. 
బుధుడు:
గణిత శాస్త్రం లో ప్రావిణ్యత, జ్యోతిష్య శాస్త్రం లో ప్రావిణ్యత, ఉన్నత విద్య, శిల్పి, చిత్ర లేఖనం, రచన, కవిత్వం, చర్మ వ్యాది, ఎలర్జీ లకు కారకుడు, శత్రు వ్రుద్ది కి కారకుడు, వాక్ దోషాలకు కారకుడు
శుక్రుడు:
రూపం, కళత్ర కారకుడు, కవిత్వం, వాహన, దేహ సౌఖ్యం, అలంకారం, సంగీతం, నాట్యం, ఐశ్వర్యము,  విందు, విలాసములు, కళత్ర సౌక్యం, సంపద, జనాకర్షణ. 
రాహువు:
వైద్య విద్య కు కారకుడు, శస్త్ర చికిత్స కు కారకుడు, ఆకస్మిక ధనలాభం, ఆకస్మిక ప్రయానం, విదేశి యానం, దుష్త సాహసాలకు కారకుడు, మోసం, వర్ణ బ్రషుత్వం. 
శనివత్ రాహువు అందురు అనగా రాహువు ఎక్కువ గా శని ఫలితాలు ఇచ్చును. దాంతో పాటు గా ఏ గ్రహం తో కలిస్తే ఆ గ్రహ ఫలితాలు లేదా ఏ రాశి లో ఉంటే ఆ రాశ్యాదిపతి ఫలితాలుఇచ్చును.
కేతువు:
జ్ఞాన దీక్ష, వైరాగ్య కారకుడు, మోక్ష ప్రదాత, మనోచాచల్యం, భయం, యుధ విద్యలు (మార్షియల్ ఆర్ట్స్), సన్యాసం, మూఢ భక్తి.
కుజవత్ కేతు అనగా కుజ గ్రహ ఫలితాలు ఇస్తాడు. దాంతో పాటు గా ఏ గ్రహం తో కలిస్తే ఆ గ్రహ ఫలితాలు లేదా ఏ రాశి లో ఉంటే ఆ రాశ్యాదిపతి ఫలితాలుఇచ్చును.
దశలు:
ఒకొక్క గ్రహానికి కొన్ని సంవత్సారాల దశా కాలం ఉంటుంది. గ్రహ కారకత్వాలు బట్టి ఆ దశల యందు  ఆ  వ్యక్తి కి ఫలితాలు ఉంటాయి. ఆ గ్రహం శుభ స్తానాలలో ఉంటే శుభ ఫలితాలు, అశుభ స్తానాలలో ఉంటే పాప ఫలితాలు పొందుతాడు.
ఈ కింద పట్టిక లో గ్రహ దశలు ఎంతకాలం ఉంటాయి అనేది తెలపడం జరిగింది. ( ఏ దశ తర్వాత ఏ దశ వస్తుందో ఆ వరుస క్రమం లో ఇవ్వటం జరిగింది. వ్యక్తి పుట్టిన నక్షత్రం బట్టి ఏ దశ మొదలవుతుంది అనేది నిర్ణయం చేస్తారు, ఆ వివరాలు తర్వాత చూదాం.)

రవి మహా దశ 6 సంవత్సరములు
చంద్ర మహా దశ 10 సంవత్సరములు 
కుజ మహా దశ 7 సంవత్సరములు
రాహు మహా దశ 18 సంవత్సరములు
గురు మహా దశ 16 సంవత్సరములు
శని మహా దశ 19 సంవత్సరములు
బుధ మహా దశ 17 సంవత్సరములు
కేతు మహా దశ 7 సంవత్సరములు
శుక్ర మహా దశ 20 సంవత్సరములు
ఇక పుట్టిన వ్యక్తి కి ఏ దశ మొదలవుతుంది చెప్పలంటే ఆ వ్యక్తి నక్షత్రం తెలుసు కోవాలి. ఒకొక్క నక్షత్రానికి ఒకొక్క గ్రహం ఆదిపత్యం వహిస్తుంది. ఆ ఆధిపత్య గ్రహం యొక్క దశ పుట్టిన వ్యక్తికి మొదలవుతుంది.

రవి

కృత్తికా

ఉత్తర

ఉత్తరషాడ

చంద్రుడు

రోహిణి

హస్త

శ్రవణం

కుజుడు

మృగశిర

చిత్త

ధనిష్ట

రాహువు

ఆరుద్ర

స్వాతి

శతభిష

గురుడు

పునర్వశు

విశాఖ

పూర్వాభాద్ర

శని

పుష్యమి

అనూరాధ

ఉత్తరాభాద్ర

బుధుడు

ఆశ్లేష

జ్యేష్ట

రేవతి

కేతువు

మఖ

మూల

అశ్వని

శుక్రుడు

పుబ్బ

పూర్వాషాడ

భరణి


ఉదాహరణకు ఒక వ్యక్తి పూర్వాషాడా నక్షత్రం లో జన్మిస్తే ఆ వ్యక్తి కి పుట్టినప్పుడు శుక్ర మహా దశ ఉంటుంది.

***

No comments:

Post a Comment

Pages