శ్రీధర మాధురి -83 - అచ్చంగా తెలుగు

శ్రీధర మాధురి -83

Share This

శ్రీధర మాధురి -83

(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు) 





మహాభారతం నుంచి ఒక చిన్న కధ. ప్రతి రోజూ యుద్ధం కొనసాగుతోంది. కాని, ఇరుపక్షాల వారికి ఒకటే వంటిల్లు ఉండడమే ఇక్కడ గొప్ప విషయం. వంట కళలో నిష్ణాతుడైన ఉడిపి రాజు, కృష్ణుడి వద్దకు వెళ్లి,”కృష్ణా, నాకు యుద్ధంలో పాల్గొనాలని లేదు. నేను ఇరుపక్షాల వారికీ వంట చేస్తాను.” అన్నాడు. ప్రతిరోజూ, యుద్ధం ముగియగానే, యోధులందరికీ అద్భుతమైన భోజనం వడ్డించబడుతోంది. అందరి గురించీ శ్రద్ధ వహించాలి. ఆయన ఎక్కువ భోజనాన్ని వండితే, అది వృధా అవుతుంది. ఒకవేళ తక్కువ భోజనాన్ని వండితే, యుద్ధరంగం నుంచి అలసిపోయి వచ్చిన యోధులు ఆకలితో తిరిగి వెళ్ళిపోతారు. ఎంత మందికి వండాలో ఆయనకు ఏం తెలుసు? ఇది చాలా పెద్ద సమస్య. ఆయన జోడించిన చేతులతో కృష్ణుడి వద్దకు వెళ్ళాడు. “కృష్ణా, ఎంతమందికి వండాలో లెక్కపెట్టడం నాకు తెలీదు. నాకు అన్నాన్ని వృధా చెయ్యడం ఇష్టం లేదు. “అన్నం నా నిందయాత్ , ప్రాణోవాన్నం” అన్నారు కదా. అందుకని, నేను మిమ్మల్ని గమనిస్తాను. ప్రతి రోజూ యుద్ధరంగం నుంచి ఎంతమంది తిరిగి వస్తారో మీకు బాగా తెలుసు కనుక, మీరు ఎంతమందికి వండాలో నాకు చూపండి.” అని అర్ధించాడు. కృష్ణుడు ఉదయం అల్పాహారంగా ఉడికించిన వేరుశనగల్ని తినేవాడు. ఉడిపి రాజు కృష్ణుడు తిన్న వేరుశనగల సంఖ్యను లెక్కించి, దాన్ని ఒక నిర్దిష్ట సంఖ్యతో గుణించడం ద్వారా, ఆ రోజున యుద్ధంలో చనిపోయే వారి సంఖ్యను తెలుసుకుని, దాన్ని బట్టి వండేవాడు. ఆహారం అస్సలు వృధా కాలేదు, ఎన్నడూ అతడు ఆహారాన్ని తిరిగి వండలేదు. ఇదే ఉడిపి రాజు యొక్క గొప్పదనం. జరగబోయే సంఘటనలన్నీ కృష్ణుడికి తెలుసు. అయినా ఆయన సంపూర్ణత దిశగా సాగిన ఈ ఆటలో తన పాత్రను పోషించారు. శిష్యుడి జీవితంలో గురువు పాత్రే ఒక వరం. ఆయనకు జరగబోయేవన్నీ తెలుసు, కాని ఏమీ తెలియనట్టు నటిస్తూ, మామూలు ఆటను ఆడతారు. దీనినే “సంపద” అంటారు. సంపద అంటే అనంతమైన దీవెనలు. 

 ***

రావణుడిని ‘దశగ్రీవుడు’ అంటారు. ఆయనకు పది తలలు. ఆయనకు నాలుగు వేదాల్లో, షట్ శాస్త్రాలలో మంచి పట్టు ఉంది. 64 రకాల త్రంత్రాలలో ఆయన ప్రావీణ్యం కలిగిఉన్న వారు. ముని విశ్రవుడికి, అసుర మాత కైకసికి జన్మించిన బ్రాహ్మణుడు అతడు. మొత్తం సామవేదాన్ని ఆయన సంగీత స్వరాలుగా రచించారు. ఆయన శివుడిని స్తుతిస్తూ శివతాండవ స్తోత్రం చేసారు. 

ఆయన చాలా తెలివైన మేధావి.

కాని ఆయనకున్న జ్ఞానం ఆయనలో 10 దుర్గుణాలను నింపింది. 

కామ  ...................... కోరిక 

మద ........................ గర్వాంధత  

మోహ ......................... విభ్రాంతి 

లోభ ........................ దురాశ 

మాత్సర్యం ............... ఈర్ష 

క్రోధ ......................కోపం 

దుర్బుద్ధి ............ చెడు బుద్ధి 

ద్వైత మనస్ .......... ద్వంద్వ వ్యక్తిత్వం 

దుర్భాగ్య చిత్త .. చెడు సంకల్పం 

అహంకారం ................... అహం 

***

రావయతీతి రావణః ...

రావణుడికి రావణుడే సాటి. అంటే అతడికి సమానమైన వారు మరెవరూ లేరని అర్ధం. రావణుడి శక్తి, శౌర్యం, మేధస్సు తో ఇతరులెవరూ పోటీ పడలేరు. పైలోకాలలో, క్రింది లోకాలలో రావణుడితో పోల్చదగ్గవారెవరూ లేరు. అతడు సంపూర్ణమైన వ్యక్తీ, కేవలం అతడికి అతడే సాటి. అతడొక తెలివైన మేధావి, స్పష్టమైన ఆలోచనలు కలవాడు.


No comments:

Post a Comment

Pages