ప్రకృతి రక్షతి రక్షతః - అచ్చంగా తెలుగు
ప్రకృతి రక్షతి రక్షతః
-ప్రతాప వెంకట సుబ్బారాయుడు



రేపటి జీవ నాశన పంటకు
భూమ్మీద ప్లాస్టిక్ నారు వేశావు..
కాలుష్యం నీరు పోశావు భవిష్యత్ తరాల తలరాతను
పచ్చని మొక్క కనిపించని..జీవజంతువు లేని
నేడే బొగ్గు ముక్కతో లిఖించుతున్నావు సకల రోగ కారక..సూక్ష్మక్రిమి సహిత
రాక్షతత్వం..కిరాతకత్వం పెచ్చుమీరడమంటే..ఇదే
ప్రకృతిని కానుకగా అందించబోతున్నావు మానవత్వం అడుగంటి ఇప్పటికైనా బుద్ధిజీవివై..ఆశాదీపాన్ని కొడిగట్టనీకు
నిత్యావసరాలకై మృణ్మయ పాత్రలను..
వెలుగు కిరణ శూలానివై.. ప్లాస్టిక్ మహమ్మారిని మట్టుబెట్టు.. కాలుష్యపు కోరలు పీకు జనపనార సంచులను ఉపయోగించు
అన్న భావన సర్వత్రా వ్యాపింపజేయి
మనిషి, పర్యావరణ ప్రేమికుడు..స్నేహితుడని నిరూపించు..పంచభూతాలను పరిరక్షించు ప్రకృతి రక్షతి రక్షితః లోకాస్సమస్తా సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతిః
***

No comments:

Post a Comment

Pages