స్వర్గాధిపతి ఇంద్రుడు - అచ్చంగా తెలుగు
స్వర్గాధిపతి ఇంద్రుడు
అంబడిపూడి శ్యామసుందర రావు


ఇంద్రుడు లేదా దేవేంద్రుడు హిందూ పురాణాల ప్రకారం దేవతలందరికీ, స్వర్గలోకానికీ అధిపతి. ఋగ్వేదం ప్రకారం హిందువుల కు ముఖ్యమైనదైవము.సాధారణంగా "ఇంద్రుడు" అన్నది "స్వర్గాధిపత్యము" అన్న పదవిని సూచిస్తుంది. కానీ సందర్భోచితంగా ఇంద్రపదవిలో ఉన్నవారందరినీ ఇంద్రుడు అనే సంబోధించడం తరచూ కనిపిస్తుంది.ఇంద్రపదవి ప్రతి మన్వంతరానికీ మారుతూ ఉంటుంది.

ఉత్తమ మన్వంతరములో సుశాంతుడు, రైవత మన్వంతరములో విభుడు చాక్షుష మన్వంతరములో మనోజవుడు సావర్ణి మన్వంతరములో బలి చక్రవర్తి ఇంద్రపదవిని ధరించారు. హిందువుల పురాణాల ప్రకారం ఒక మనువు పాలనా కాలాన్ని మన్వంతరం అంటారు. ఒక్కొక్క మన్వంతరం 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును. ఒక బ్రహ్మ దినములో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి.

ప్రస్తుతం మనము ఏడవ మన్వంతరంలో ఉన్నాము. ప్రతి మన్వంతరం 71 మహాయుగములుగా విభజించబడింది. భాగవతం అష్టమ స్కందంలో మన్వంతరాల గురించిన వివరణ ఉంది.

ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల తరువాత కలియుగం నడుస్తున్నది. ప్రతి మన్వంతరం లోను సప్తర్షులు, ఇంద్రుడు, సురలు మారుతుంటారు. భగవంతుని అవతారాలు కూడా మారుతుంటాయి. దేవతలకు రాజు, పూర్వదిక్పాలకుడు ఇంద్రుడు. ఇతడు కశ్యపప్రజాపతికి, అదితికి పుట్టిన కొడుకు.ఈయన రాజధాని:అమరావతి ఆయుధము వజ్రము(వజ్రాయుధము) సభ - సుధర్మ, గుఱ్ఱము - ఉచ్చైశ్రవము, సారథి  మాతలి, ఉద్యానవనము  నందనము ఈతడు వాస్తు శాస్త్రమునకు అధిదేవత. అష్టదిక్కులలో, తూర్పుదిక్కుకు అధిపతి. 

ఇంద్రుని  వాహనం: 'ఐరావతం' అనేతెల్లని ఏనుగు.ఇంద్రుని భార్య: శచీదేవి.ఇంద్రుని కూతురు: జయంతి ఇంద్రుని కొడుకు:జయంతుడు.ఇంద్రసభలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి మొదలైన అప్సరసలు నాట్యం చేస్తూ ఇంద్రునికి అతని పరివారానికి వినోదం కలుగచేస్తుంటారు.ఇంద్రుడి గురించి వేదకాలం తరువాతి సాహిత్యములో తక్కువ చేసి వర్ణింపబడినది. 

మన తెలుగు పౌరాణిక సిమాలలో ఇంద్రుడిని పూర్తిగా భోగలాలసుడిగా స్వార్ధపరుడిగా చిత్రీకరించాయి. ఎందుకంటే స్వర్గములో పూర్తి భోగలాలసత్వముతో చాలా సార్లు ఇబ్బందులపాలైన నిదర్శనాలు ఉన్నాయి. తన ఇంద్రపదవి కాపాడుకోవటానికి ఇతరులు ముఖ్యముగా దానవులు తపస్సు చేస్తుంటే వారి తపస్సు భగ్నము చేయటానికి అప్సరలను వారి మీద ప్రయోగించేవాడని ప్రచారము ఉంది విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నప్పుడు మేనకను పంపటం శకుంతల జన్మించటం మనకు తెలిసినదే. అలాగే సాక్షాత్తు కృష్ణ భగవానుని మీద ఆగ్రహముతో వరుణుడు వాయు దేవులను ప్రయోగించి అభాసుపాలు అవటం కూడా మనకు తెలిసిన విషయమే.

ఋగ్వేదములో ఇంద్రుడిని కీర్తిస్తూ సుమారు 250 శ్లోకాలు ఉన్నాయి ఆ విధముగా ఋగ్వేదంలో సోమ(అమృతము) తో పాటు కీర్తింపబడ్డాడు మన పురాణాలలో ఇంద్రుడికి
అనేక బిరుదులు ఉన్నాయి.వాటిలో మేఘవాహనుడని, దేవ రాజు అని సురేంద్రుడు అని స్వర్గాధిపతి అనేవి కొన్ని. అనేక మంది అసురులను రాక్షసులను చంపినవాడుగా పేరు కూడా ఉంది. వర్షాలు పడకుండా అడ్డుకున్నరాక్షసుడు వ్రిత్ర ను అతని సహచరులను చంపి వర్షాలు పడేటట్లు చేసాడు. భౌద్ద మతములో కూడా ఇంద్రుడు మానవాళిని రక్షించే దేవుడిగాను రక్షకుడికిగాను కీరింపబడ్డాడు. జైనమతములో కూడా సౌధర్మ కల్ప( స్వర్గ) కు రాజుగా ప్రస్తావించారు.ఇంద్రుడు వజ్రాయుధముతో ఐరావతము ఎక్కిరాక్షసులను సంహరించేవాడని పురాణాలు చెపుతున్నాయి. బౌద్ద పురాణాల ప్రకారము ఈ ఏనుగు ఐరావాతానికి మూడు తలలుగాను, జైన సిద్ధాంతాల ప్రకారము ఐదు తలలుగాను వర్ణించబడింది.ఇంద్రుడి రాజధాని అమరావతి మేరు పర్వతము మీద ఉన్నది.

వేదిక మైథాలజి ప్రకారము ఇందు అంటే వర్షపు బిందువు అంటే వర్షాన్నిజయించి వర్షాన్ని భూమికి తెప్పించిన వాడు అని అర్ధము.అలాగే అధిక శక్తి శాలి అని కూడా అర్ధము.ఇంద్రుడు దేవుడిగా నార్త్ ఈస్ట్రన్ ఆసియా మైనర్ ప్రాంతములో ఉన్నట్లు పురాతన శిలాశాసనాలు బట్టి తెలుస్తుంది. ఈ శిలాశాసనాలపై ఉన్న ఇతర పేర్లు మిత్ర, వరుణ, వంటి దేవతలు.దీనిని బట్టి ఇంద్రుడు ఇతర దేవతలు సౌత్ ఆసియా, ఆసియా మైనర్ లలో బాగా ప్రసిద్ధి అని తెలుస్తుంది.ఇంద్రుడిని ఉన్నతమైన దేవుడిగా కీర్తిస్తూ ఋగ్వేదములో 250 శ్లోకాలు ఉన్నాయి ఇతర దేవతలతో పాటు కీర్తిస్తూ మరో 50 శ్లోకాలు ఉన్నాయి. ఈ విధముగా వేదాలలో బాగా కీర్తింప బడ్డ దేవుడిగాపేరు పొందాడు.ఈయన ప్రస్తావన పురాతన ఇండో ఇరానియన్ సాహిత్యములో కూడా ఉంది.వేదాలలో ఇంద్రుడు గొప్ప హీరోగా కీర్తింపబడ్డాడు. కానీ ప్రీ ఇస్లామిక్ ఇరానియన్ గ్రంధాలలో ఇంద్రుడిని ఒక రాక్షసుడిగా వర్ణించారు ఇలా ఇంద్రుడి పాత్ర రకరకాలుగా వర్ణింపబడిందిి. ఏది ఏమైనప్పటికి పురాణాలలో ఇంద్రుడి పేరు ప్రముఖముగా వినిపించే పేరు దేవతలకి అష్ట దిక్పాలకులకి అధిపతి అయినవాడు ఈ ఇంద్రడు.

***

No comments:

Post a Comment

Pages