ప్రశ్నార్ధకం - అచ్చంగా తెలుగు
 'ప్రశ్నార్థకం!?!'
-సుజాత.పి.వి.ఎల్.




అసలే మన చదువులు అంతంత మాత్రం..

తరగతి గదిలో గంటలతరబడి పాఠాలు చెప్పినా..

మస్తిష్కాలకు చేరేది తక్కువ..

బుద్ధి చైతన్యం కన్నా, రుబ్బుడుతో 

సాధించే మార్కుల వెల్లువకే విలువెక్కువ..

గుడ్డి కన్నా మెళ్ల ఫరవాలేదని, 

ఈ పద్ధతే కాస్త మెరుగని.. గానుగెద్దులమయితే

ఇప్పుడు కరోనా వల్ల ఆ కాస్త చదువులు కూడా అటకెక్కాయి..

ఆన్లైన్ తరగతులంటు, కంప్యూటర్, సెల్ఫోన్ల చదువులకు తెరలేపాయి..

అర్థం కాని పాఠాలకు బుర్రగోక్కుంటూ

సమయాన్ని వ్యర్థం చేసుకుంటే..

భవిష్యత్తు పూతపూసిన బంగారం కాక ఏమవుతుంది? 

ఇలాగే కొనసాగితే.. 

రేపటి పౌరుల జీవితం ప్రశ్నార్థకం అనిపిస్తోంది!

*****


No comments:

Post a Comment

Pages