జ్యోతిష్య పాఠాలు - 8
PSV రవికుమార్
ఒక్కోక్క లగ్నం లో జన్మించిన వారికి ఆ లగ్నాధిపతి ని బట్టి, ఆ వ్యక్తి స్వభావాన్ని నిర్ణయించవచ్చు. లగ్నములు అన్నిటికీ కొన్ని లక్షణాలను తెలియ చేశారు. కాని, లగ్నాధిపతి ఉన్న స్థానాన్ని బట్టి ఆ వ్యక్తి స్వభావాలను నిర్ణయించాలి.
మేష లగ్నం:
లగ్నాధిపతి కుజుడు. వీరికి ఓర్పు
తక్కువ, కోపం ఎక్కువ. తొందరపడి మాటలాడు లక్షణం కలవారుగా ఉందురు. నిర్భయం గా ఉందురు.
ధైర్య సాహసాలని ఇష్టపడతారు. త్వరగా మోసపోవుదురు. గొడవలకు వెళ్ళు స్వభావం ఉండును.
అధికారులతో వాదనలు చేయు స్వభావం ఉండును. వ్రుత్తి యందు మార్పులు ఎక్కువ. ధనార్జన బాగుండును, ఖర్చు
కూడా చేయును.
వృషభ లగ్నం:
లగ్నాధిపతి శుక్రుడు. వీరు ఏ
కార్యమునైననూ ఎంత శ్రమనొందయినా పూర్తి చేస్తారు.
ధన సంపాదన బాగుండును. జీవితం లో సుఖములు అనుభవించును. కుటుంబ బాద్యతలు
ఎక్కువగా ఉండును. కాస్త మొండి, వైఖరి
ఉండును. వీరి అభిప్రాయములను ఇతరులకు చెప్పరు. కళల యందు ఆశక్తి ఉండును. పట్టుదల
ఎక్కువ. సంకల్పం సాదించు వరకు కష్టపడుదురు.
మిథున లగ్నం:
లగ్నాధిపతి బుధుడు. వీరు
పుణ్యకార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చేయుటయందు
ఆశక్తి కనపరుచును. పెద్దలయందు గౌరవ మర్యాదలు ఎక్కువ.వ్రుత్తి యందు మార్పులు
ఎక్కువ. మంచి సలహాదారులుగా ఉందురు. శాస్త్ర పరిజ్ఞానము ధర్మ శాస్త్రముల యందు
జ్ఞానం బాగుగా ఉండును. నైపుణ్యం, చురుకుదనము ఎక్కువ. చిరాకు
స్వభావం కలిగి ఉండెదురు. కోపం, చిరాకు
వచ్చిన సమయమున వీరి బుద్ది సరిగా పనిచేయదు. అవి తగ్గిన పిమ్మట, తీసుకున్న
నిర్ణయముల గురించి చింతిస్తారు.
కర్కాటక లగ్నం:
లగ్నాధిపతి చంద్రుడు. ఈ లగ్నం లో
జన్మించిన వారు చాలా మంది, కష్టపడి ఉన్నత స్తితి కి
చేరుకొందురు. ధన సంపాదన బాగుగా ఉండును. ఖర్చులు కుడా అధికంగానే ఉంటాయి. వీరు చంద్ర
కలల మాదిరి, ఒకోసారి ఒకో మాదిరిగా వ్యవహరిస్తారు. ఒకోసారి సంతోషం గా, మర్క సారి
కోపంగా, ఇలా వివిద రకములుగా ప్రవర్తిస్తారు.
అందరితోను త్వరగా కలిసిపోగలరు. ధర్మాచరన కలిగి ఉంటారు. లగ్నాధిపతి బలహీనుడయి ఉన్నచో మానసిక సమస్యలతో ఉంటారు. నీటి
పై ప్రయాణం అనగా ఇష్టపడెదరు, కాని, ప్రయాణ
కాలం యందు, జాగ్రత అవసరం.
సింహ లగ్నం:
లగ్నాధిపతి రవి. వీరికి కోపం ఎక్కువ.
పట్టుదల చాలా అధికం. ఎదైనా అనుకున్న, ఆ పనిని చేసి తీరుతారు. వీరు
సమాజం లో పేరు ప్రక్యాతల కోసం తపిస్తారు. కఠినం గా మాట్లాదెదరు. గొడవ పడు స్వభావం
కలవారు. లగ్నాధిపతి బలహీనుడయిననూ, లేక
దుస్థానములలో ఉన్ననూ, తండ్రి తో అభిప్రాయ బేదములు
కలుగును. వాహనములను వేగం గా నడుపుటకు ఇష్టపడెదరు.
భగవంతుని పై అమిత భక్తి, ధర్మ శాస్త్రములపై ఆదరన ఎక్కువ.
కన్యా లగ్నం:
లగ్నాధిపతి బుధుడు. విరు గుణవంతులు.
శాస్త్రములయందు జ్ఞానం కలవారు. డబ్బు ఖర్చు యందు నియంత్రన కలవారు. దాన గునం తక్కువ.
విద్య యందు అధిక ప్రావీణ్యం. చాదస్తం ఎక్కువ. ఆచారాల యందు ఆసక్తి, అవి
పాటించు విషయం లో ఖచ్చితం గా ఉండురు. వీరు, రచనలయందు ఆసక్తి. కథలు, పద్యాలు, మున్నగునవి
రాయుటకు ఆసక్తి చూపెదరు. అందరిని అభిమానిస్తారు, కాని అపకారం చేసిన వారిని, అదే
విదంగా ద్వేషిస్తారు.
తులా లగ్నం:
లగ్నాధిపతి శుక్రుడు. ధర్మం యందు ఆసక్తి.
లలిత కళల యందు ప్రావీణ్యం. స్వయం క్రుషి
వలన అభివ్రుద్ది లోనికి వస్తారు. నిర్ణయములు తీసుకొను విషయములో జాప్యం ఎక్కువ.
వీరు తన చుట్టుపక్క వారిని తన మాటలతో కాని, చేతలతో కాని, సౌందర్యం
తో కాని ఆకర్షింతురు. అందరిని త్వరగా నమ్ముతారు. భయస్తులు, బాదలకు
ఓర్వలేరు. శాంత స్వభావులు. రచనా సామర్ద్యం
కలవారు. నచ్చని విషయముల యందు, ఎక్కువగా బాద పడెదరు.
వస్త్రాలంకరన యందు ఆసక్తి. బాహ్య సౌందర్యం యందు అసక్తి.
వ్రుశ్చిక లగ్నం:
లగ్నాధిపతి కుజుడు. పరుషంగా మాట్లాడెదరు.
కోపం అధికం. ధైర్యవంతులు. సాహస కార్యముల యందు ఆసక్తి. తరచూ ఆరోగ్య సమస్యలు.
రహస్యముల యందు, రహస్య విద్యలయందు ఆసక్తి. ఇతరులకి సహాయం చేసే గుణము కలిగినవారు. ఏ పనినయినా
పూరి చేసే స్వభావంకలవారు. స్తిర స్వభావం లేని వారు. ఇతరుల సలహా పాటించరు.
నిర్ణయాములు సరిగా తీసుకొనలేరు. అతి విశ్వాసం.
ధనుర్లగ్నం:
లగ్నాధిపతి గురుడు. ధర్మ మార్గమును
ఇష్టపడెదరు. మంచి మాటకారులు. పిత్రార్జితం వలన అభివ్రుద్ది లోనికి వచ్చెదరు.
సున్నిత మనస్కులు. దైవ చింతన ఎక్కువ. తీర్త యాత్రలయందు అమిత ఆసక్తి. ధనార్జన
బాగుగా ఉండును. పండితుడు గా ఉండును. పెద్దల యందు గౌరవ భావన కలిగి ఉండును.
ఉపాద్యాయులుగా రాణింతును. పురాన పఠనము యందు ఆసక్తి. ప్రవచనములు చెప్పువారు.
మకర లగ్నం:
లగ్నాధిపతి శని. అభివ్రుద్ది
నిదానముగా ఉండును. వ్యవహార సమర్దులు. విషయములను గుర్తుపెట్టుకోగల సామర్ద్యం
కలవారు. జీవితం నందు చాలా కష్టపడ్డ తర్వాత గాని విజయములు దరి చేరవు. ధన సంపాదన పై వ్యామోహం
ఎక్కువ. విజయం సాదించుటకు ఎన్ని అడ్డంకులు వచ్చిననూ కార్యం సాదించెదరు. ధనమును మితముగా ఖర్చు చేయుదురు. ఏ పనినైననూ
నిదానం గా చేస్తారు.
కుంభ లగ్నం:
లగ్నాధిపతి శని. హుషారు తక్కువ.
నలుగురిలో కలవటానికి చాలా సమయం తీసుకొందురు. ఏకాంతాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. సభల
పై మాటలాడడానికి జంకుతారు.వ్రుత్తి యందు అభివ్రుది నిదానం గా కలుగును. శని మంచి
స్తానం లో కనుక ఉంటే జీవితాన్ని ఆనందం గా అనుభవిస్తారు లేదంటే, ఒడిదుడుకులు
ఉండును.
మీన లగ్నం:
లగ్నాధిపతి గురుడు. ధర్మం తెలిసిన వారు. శాస్త్రములయందు
ఆశక్తి కలిగిన వారు. వీరికి చట్టం,న్యాయం యందు గౌరవం. అన్యాయం
సహించరు. ధన సంపాదన బాగుండును. కవులు, రచయితలు గా రాణింతురు. అప్పు
తీసుకొను విషయములో కాని, ఇచ్చు విషయములలో కాని, తగు
జాగ్రత్త తీసుకొనవలెను. ఆహారం యందు అమిత ఇష్టం కలిగి ఉండును. ఉన్నత చదువుల కోసం
కాని, సంసారం కోసం కని,ఉద్యోగరిత్యా గాని, దూర
ప్రాంతలకు వెళ్ళెదరు.
లగ్నాధిపతి జాతక చక్రం లో
ఏ స్తానలలో ఉంటే ఆ భావ కారకత్వాలు మరియు లగ్నాధిపతి అయిన గ్రహ కారకత్వాలతో ఆ వ్యక్తి యొక్క
వ్యక్తిత్వం అంచనా వేయచ్చు. లగ్నం తను భావాన్ని, ఆలోచనలని సూచిస్తుంది. పేరు
ప్రతిష్టలు, విజయ అవకాశాలు ఆరోగ్యం వంటివి సూచిస్తుంది.
లగ్నాధిపతి లగ్నం లో ఉంటే
ఇటువంటి వ్యక్తులకి సమాజం
లో గుర్తింపు తెచ్చుకోవటం అంటే చాలా ఇష్టం.
వీరి జీవితం విజయవంతం గా ఉంటుంది. ఒక వేళ జీవితం లో ఒడి దొడుకులు ఎదురయినా వాటిని
తట్టుకుని విజయం సాదిస్తారు.
కుజుడు లగ్నాధిపతి అయ్యి, లగ్నం
లో ఉంటే వీరు దూకుడు గా ఉంటారు. శరీర
ధారుడ్యం కలిగి ఉంటారు. కుజుడు లగ్నాధిపతి
అవ్వడం వలన, మాటతీరు కాస్త కఠినం గా ఉండును.
అనాలోచిత నిర్ణయాలు తీసుకొనెదరు.
కుజుడు లగ్నాధిపతి అయ్యి లగ్నం లో
ఉండి, సప్తమ ద్రుష్టి తో సప్తమ స్థానన్ని చూస్తున్నందున, భార్య తో
వాదములు కలుగవచ్చు. లగ్నం లో కుజుడు ఉన్న వారికి గురుడు, శుక్రుడు
మంచి స్తానములలో లేకపోతే వివాహ సౌఖ్యం తక్కువగా ఉండును.
ఏ గ్రహం లగ్నానికి ఆదిపత్యం వహించునో ఆ కారకత్వాతల పై మక్కువ ఉంటుంది. ఉదాహరణకు
శుక్రుడు లగ్నాధిపతి అయ్యి లగ్నం లో ఉంటే అయితే వీరికి, వస్త్రాలంకరణ
పైన బహు ఆసక్తి ఉంటుంది, వీరికి, అందం పైన, ఆభరాణాల పైన మక్కువ ఎక్కువ. వీరికి కళల
పైన కూడా ఆసక్తి ఉంటుంది.
లగ్నాధిపతి ద్వితీయం
లోఉంటే:
ద్వితీయం సాధరణం గా ధనమును,
కుటుంబాన్ని, వాక్కు గురించి ఎక్కువ గా తెలియచేయును.
వీరికి సాధారణంగా వాక్చాతుర్యం
ఎక్కువ. లగ్నాధిపతి
రెండవ స్థానం
లో ఉంటే వీరికి వారసత్వ ఆస్తి వచ్చే అవకాశం ఉంది. వీరు కుటుంబం తో ఎక్కువ గడపటానికి ఇష్టపడతారు. వీరు
బయట వారితో కుటుంబ గురించి చర్చించడానికి ఇష్టపడరు.
సౌమ్య గ్రహాలు లగ్నాధిపతి అయ్యి, ద్వితీయ
స్థానం లో ఉంటే, మాట తీరు ప్రియం గా ఉంటుంది, అదే కుజుడు లాంటి, గ్రహాలు లగ్నాధిపతి
అయ్యి, ద్వితీయం లో ఉంటే, మాట తీరు
కాస్త కఠినం గా ఉంటుంది.
ద్వితీయం లో కుజుడు
ఉన్నచో కుజ దోషం గా చెప్పెదరు. కావున వీరికి ఆలస్యం గా వివాహం కావచ్చు. లేదా కళత్ర
సౌఖ్యం తక్కువ.కుటుంబ
బాద్యతలు ఎక్కువగా ఉండవచ్చు.
కొంతమంది, వాక్చాతుర్యం ద్వారా ధన సంపాదన చేసెదరు. ఉదాహరణ కు టెలివిజన్ రంగం లో ఉండే, యాంకర్లు, మిమిక్రీ
ఆర్టిస్ట్లు, ప్రవచనకర్తలు.
అదే లగ్నాధిపతి బలహీనుడయ్యి, లేదా
శత్రు క్షేత్రం లో ఉంటే, పైన చెప్పిన విధంగా ఉండకపోవచ్చు.
మాట తీరు వలన ఇబ్బందులు, ధన సంఫాదనలో ఇబ్బందులు వంటివి
కలగవచ్చు.
లగ్నాధిపతి తృతీయం లో ఉంటే:
తృతీయ భావం సాధరణంగా సోదరుల గురించి, కోపం, మైత్రి, ధైర్య సాహసాలు
వంటివి తెలియచేయును.
వీరికి సోదరుల యందు అభిమానం ఎక్కువగా ఉంటుంది. లగ్నాధిపతి సప్తమ ద్రుష్టి
తో 9వ స్థానాన్ని చూస్తాడు కాబట్టి, ఉన్నత విద్య ని సాదిస్తాడు.
విరికి ఉన్న వాక్చాతుర్యం వలన
ఉపాధ్యయ వ్రుత్తులలో కూడా పై స్తాయికి వెళ్ళు అవకాశం కలదు.
వీరికి రాజకీయాల యందు ఆసక్తి
ఉంటుంది. వీరు ధర్మ బోధనలు చేసే అవకాశం ఉంది. లగ్నాధిపతి త్రుతీయం లో ఉంటే మార్కెటింగ్ రంగం లో పనిచేసే
అవకాశం కాని మార్కెటింగ్ విద్య అభ్యసించు అవకాశం కలదు.
లగ్నాధిపతి చతుర్ధంలో
ఉంటే:
చతుర్థ స్థానం ద్వారా తల్లి,
భూమి, వాహనాలు వంటి వాటి గురించి తెలుసుకోవచ్చు.
లగ్నాధిపతి చతుర్దం లో ఉండటం ఒక రాజయోగం. లగ్నం కేంద్రం, కోణం
అవుతుంది. చతుర్దం కేంద్రం అవుతుంది. కోణాదిపతి కేంద్ర స్థానం లో ఉంటే రాజయోగం.
వీరికి మాత్రు సౌఖ్యం
ఎక్కువ.మాత్రు భూమి పైన కూడా ఎక్కువ మమకారం ఉంటుంది. ఇలాంటి జాతకులు ఎక్కువగా తమ
ఉద్యోగాలు వారి స్వస్థానం లో నే చేస్తారు. అలాగే వీరికి దేశ భక్తి ఎక్కువ. లగ్నాధిపతి చతుర్దం లో ఉండి సప్తమ దృష్టి తో రాజ్య భావాన్ని (10వ భావాన్ని)
చూస్తాడు. వీరికి వారి ఉద్యోగం యందు ఉన్నత లక్ష్యాలు ఉంటాయి.
శుక్రుడు లగ్నదిపతి అయ్యి చతుర్దం లో ఉంటే వాహనాలు కలిగి ఉండచ్చు. వాహన
సంబందిత వ్యాపారం చేసే అవకాశాలు ఎక్కువ.
కుజుడు లగ్నదిపతి
అయ్యి చతుర్దం లో ఉంటే, భూములు కలొగి ఉంటారు. రియల్
ఎస్టేట్ వ్యాపారం చేయు అవకాశాలు.
చతుర్దం లో కుజుడు ఉన్నచో కుజ దోషం గా చెప్పెదరు. కావున వీరికి
ఆలస్యం గా వివాహం కావచ్చు. లేదా కళత్ర సౌఖ్యం తక్కువ.
లగ్నాధిపతి పంచమం లో ఉంటే:
పంచమ భావం సృజనాత్మకత, సంతానం, రచనా, సాహిత్యం, రాజకీయాలు
వంటివి తెలియచేస్తుంది.
కేంద్రాదిపతి కోణం లో ఉండుట కూడా
రాజయోగం.
వీరికి కళల యందు ఆశక్తి, పిల్లల
యందు ప్రేమ ఎక్కువ, వీరు పిల్లలతోనే వారి సమయం గడపడానికి ఇష్టపడతారు.
వీరికి క్రియేటివిటీ (సృజనాత్మకత)ఎక్కువ.
వీరు స్నేహ భావం తో ఉంటారు. లగ్నాధిపతి
పురుష గ్రహం
అయితే ఎక్కువగా పురుషులు స్నేహితులుగా ఉంటారు. స్త్రీ గ్రహాలు అధిపతులు అయితే
స్త్రీ లు స్నేహితులుగా ఉంటారు.
ఈ జాతకులకు ప్రేమ వ్యవహారములు ఉండే
అవకాశములు కలవు. సప్తమ అధిపతి, శుక్రుడు స్థానాలని బట్టి ప్రేమ పెళ్ళి జరుగుతుందో
లేదో తెలుసుకోవచ్చు.
కుజుడు పంచమం లో ఉంటే పిల్లయందు అమిత ప్రేమ తోపాటు, క్రమశిక్షణ
కూడా ఉండును. పంచమ కుజుడు వలన సంతాన సమస్యలు లేదా సంతానమునకు తరచూ అనారోగ్య సమస్యలు కలుగు అవకాశములు ఉన్నవి.
శుక్రుడు లగ్నదిపతి అయ్యి పంచమం లో ఉంటే కళల యందు ఆసక్తి,, వాటి
ద్వారా ధన సంపాదన.
లగ్నాధిపతి షష్టంలో ఉంటే :
షష్ట స్థానం రోగాలను, గొడవలను,
శత్రువులను, అప్పులను తెలియచేస్తుంది.
ఈ జాతకులు మంచి చెడు ఫలితాలు
రెండూ అనుభవిస్తారు.
లగ్నాధిపతి బలహీనం అయితే (శత్రు స్థానం లో ఉండటం,
వక్రించడం, నీచ లో ఉండటం), దీర్గకాల రోగాలతో బాధ పడతారు.
కుజుడు లగ్నాధిపతి అయ్యి షష్టం లో
శత్రు క్షేత్రం లో ఉంటే,వీరికి అనారోగ్య సమస్యలు, తరచూ
గాయాల పాలగుట, ప్రమాదములు. అదే శుభ స్థానం లో ఉంటే, పోలీస్, మిలిటరీ
వ్రుత్తులు చేపట్టుట లేదా వైద్య వ్రుత్తి చేపట్టుట జరుగును.
విదేశీ ప్రయాణములు కలుగును. న్యాయ సంబదిత సమస్యలు కలుగుట, లేదా న్యాయ
సంబందిత విద్య అభ్యసించవచ్చు.
లగ్నాధిపతి సప్తమం లో ఉంటే :
సప్తమం ద్వారా వివాహం (కళత్రం),
వ్యాపార భాగస్వామ్యం, ప్రేమ, దాంపత్య సుఖం వంటి విషయాల గురించి తెలుసుకోవచ్చు.
కోణాదిపతి కేంద్రం లో ఉండుట వలన ఇది
ఒక రాజయోగం
ఈ జాతకులు ఎక్కువగా వివాహానంతరం
స్థిర పడే అవకశాలు ఎక్కువ. వివాహం తర్వాత వీరికి గుర్తింపు
లభిస్తుంది.
వీరికి భాగస్వామి సగం బలం. వీరు
వ్యాపారం లో రాణించే అవకాశం ఎక్కువ. ఈ జాతకులు చేసే క్రుషే వారి విజయలను
అందిస్తుంది. వీరు ఒంటరితనాన్ని ఇష్టపడరు.
శుక్రుడు, లగ్నాధిపతి అయ్యి, సప్తమం లో ఉంటే, భార్య యందు, అమిత ప్రేమ. వివాహం అయిన
తర్వాతనే వీరికి వ్రుత్తి లో విజయం వచ్చును. కళల యందు రాణించును. ధనవంతులు
అగును.
కుజుడు, లగ్నాధిపతి అయ్యి, సప్తమం లో
ఉంటే, కుజ దోషం గా చెప్పబడింది. వీరికి వివాహం ఆలస్యం అవును. వ్రుత్తి యందు రాణించును.
కుటుంబం లో తరచూ సమస్యలు.
లగ్నాధిపతి అష్టమం లో ఉంటే :
అష్టమం ఆయుష్షు, నిధులు, మారకం,
పాప స్వభావం జ్యోతిష్య
విద్య, వేద విద్య వంటివి తెలుపుతుంది.
ఇది ఒక దుస్థానం. లగ్నాధిపతి ఇక్కడ ఉండటం
వలన మంచి చెడులు రెండూ ఉంటాయి. ఈ జాతకులకు ఊహించని ధన లాభం వస్తుంది. అలాగే అనుకోకుండా ధన
నష్టం కూడా జరుగుతుంది. ఒకో సారి వీరి జీవితం తలకిందులు కూడా అవ్వవచ్చు.
వీరికి గుప్త శాస్త్రాలపైన అభిరుచి
కలిగి ఉంటారు, కొన్ని సార్లు ఆ శాస్త్రాలను నేర్చుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. వీరికి
భూగర్బ శాస్త్రం పై మక్కువ ఎక్కువ, అటువంటి విద్య ని అభ్యసించే అవకాశాలు ఎక్కువ.
లగ్నాధిపతి అష్టమ దృష్టి రెండవ భావం పై ఉంటుంది కాబట్టి, వీరికి అనుకోని కుటుంబ
సమస్యలు, ఆరోగ్య సమస్యలు సంభవించవచ్చు.
కుజుడు లగ్నాధిపతి అయి అష్టమం లో ఉంటే
కుజ దోషం గా తెలుపబడింది. వీరికి వివాహం ఆలస్యం అవ్వటం జరగవచ్చు. వీరికి వివాహ
విషయం లో జాతక పొంతన చూసుకోవాలి.
లగ్నాధిపతి నవమం లో ఉంటే :
ఈ స్తానం ద్వారా, భాగ్యం, అద్రుష్టం, ఉన్నత
విద్య, పూర్వ జన్మ పుణ్యం, ధర్మ బుధ్ధి, భక్తి, వంటి
విషయాలు తెలుసుకోవచ్చు.
లగ్నాధిపతి నవమ స్తానం లో ఉండటం చాలా
మంచిది. వీరికి ఉన్నత విద్య పై ఆశక్తి. శుభ గ్రహాలు లగ్నాధిపతి అయ్యి, భాగ్యం లో ఉంటే, ఆధ్యాత్మిక విద్య పై ఆశక్తి
కలగవచ్చు. పాప గ్రహాలు భాగ్యం లో ఉంటే, విదేశాలలో ఉన్నత
విద్యభ్యాసం, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళటం జరగచ్చు.
భాగ్యం లో ఉన్న లగ్నాధిపతి సప్తమ
ద్రుష్టి తో త్రుతీయ స్తానం ను చూడటం వలన, వాక్చాతుర్యం కలిగి ఉంటారు.
నవమం కోణ స్తానం కాబట్టి, ఇది కూడా ఒక రాజ యోగం.వీరికి తండ్రి అలవాట్లు, ఆచార
సాంప్రదాయాలు పాటించే అవకాశం కలదు.
లగ్నాధిపతి దశమం లో ఉంటే:
ఈ స్తానం ద్వారా, ఉద్యోగం, కీర్తి ప్రతిష్టలు, ప్రభుత్వ
ఉద్యోగ ప్రాప్తి, వంటివి
తెలుసుకోవచ్చు. దశమం రాజ్య స్తానం. లగ్నాధిపతి రాజ్య స్తానం లో ఉంటే, వీరు
ఉద్యోగం లో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఉద్యోగం లో క్రుషి ద్వారా ఉన్నత స్తానానికి వస్తారు.
రవి గ్రహం లగ్నాధిపతి అయ్యి, దశమం లో ఉంటే,
ప్రబుత్వ ఉద్యోగాలకు అవకాశం ఉంది.
దశమం లో ఉండే లగ్నాధిపతి , సప్తమ ద్రుష్టి తో, చతుర్ద స్తానం ను చూస్తుంది
కాబట్టి, వీరు విదేశాలలో స్థిర పడే అవకాశాలు తక్కువ.
లగ్నాధిపతి శని అయ్యి, దశమం లో ఉంటే,
ఉద్యోగం నందు అభివ్రుద్ది నిదానం గా ఉండును. కాని ఉన్నత స్తితి కి
చేరును.
లగ్నాధిపతి కుజుడు అయ్యి, దశమం లో ఉంటే,
కుజ సంబందిత వ్రుత్తులు, అనగా పోలీస్, మిలిటరీ, సర్జన్లు (శస్త్ర చికిత్స నిపుణులు), లాంటి వాటిలో స్థిర పడవచ్చు.
లగ్నాధిపతి ఏకాదశం లో ఉంటే
ఈ స్తానం ద్వారా, ఆదాయం, లాభాలు, వ్యాపారం
వంటి విషయాలు తెలుసుకోవచ్చు.లగ్నాధిపతి ఏకాదశం లో ఉంటే చాలా మంచిదనే చెప్పాలి. ఇది
లాభ స్తానం. వీరు అందరితో చాలా కలుపుగోళు
వ్యక్తులు గా ఉంటారు.
శని ప్రభావం ఉన్నా, లేదా లగ్నాధిపతి శని అయితే,
వీరు కలవటానికి సమయం తీసుకోవచ్చు, కాని ఒక
సారి వీరి తో స్నేహంచేస్తే, జీవితాంతం స్నేహం గా ఉంటారు.
వీరు అధికారులు అవుతారు.
రవి గ్రహం కనుక లగ్నాధిపతి అయ్యి లాభ
స్తానం లో ఉంటే, రాజకీయాల
ద్వారా కాని, ప్రభుత్వం ద్వారా కాని లాభం పొందుతరు. వ్యాపారం
లో కలిసి రావచ్చు. శుక్రుడు ఉంటే, వస్త్ర వ్యాపారాం లో
రాణించును.
లాభ నష్టాలు సులభం గా బేరీజు వేస్తారు. ద్వితీయాదిపతి కి లాభాస్తానాదిపతి కి
కనుక సంబందం ఉంటే, స్టాక్ మార్కెట్ పై అవగాహన, ఆ రంగం లో లాభాలు కలుగుతాయి. శని ప్రభావం కనుక ఏకాదశం పై ఉన్నచో, వీరికి
లాభాలు చాలా నిదానం గా వస్తాయి. వీరు దీర్గకాలిక లాభాల పై ప్రయత్నాలు చేయుట
మంచిది.
లగ్నాధిపతి ద్వాదశం లో ఉంటే
లగ్నాధిపతి ద్వాదశం లో ఉండటం అంటే, సుఖాలు, దుఖాలు, లాభాలు, నష్టాలు
అన్ని అనుభవిస్తారు. వ్యయ స్థానం, విదేశాలు, ధన లాభం, ధన నష్టం, అనారోగ్యం, కారాగారం
వంటివి తెలుపును.
లగ్నాధిపతి కనుక ద్వాదశం లో ఉంటే, ఆకస్మిక
ధన లాభం జరగటం, లేదా పాప గ్రహం ఉండటం వలన కాని, పాప గ్రహ వీక్షన ఉండటం వలన, అనారోగ్యం
పాలగుట, లేదా, ఆరోగ్యం కోసం ధనం ఖర్చు చేయుట, లేదా విదేశాలకు వెళ్ళవచ్చు.
కుజుడు వంటి గ్రహం ఉంటే, క్రీడల్లో రాణీంచవచ్చు, లేదా, సర్జన్లు
అవ్వవచ్చు. ఇది కూడా కుజ దోషమే.
వీరిలో స్రుజనాత్మకత ఎక్కువగా ఉండవచ్చు. వీరికి, సాహిత్యం, రచనలు, జ్యోతిష్యం, వంటి పై
ఆశక్తి ఉంటుంది. తెలియని
రహస్యాలని ప్రపంచానికి తెలియచెప్పే తత్వం కలిగి ఉంటారు, అనగా
రీసెర్చ్, సైంటిస్ట్ వంటివి.
పైన తెలిపినవి సూచన ప్రాయం
మాత్రమే. జ్యోతిష్య నిర్ణయం తెలిపే ముందు, అన్ని స్థానాధిపతుల వివరాలు చూసుకుని ఫలితాలు తెలపాలి.
No comments:
Post a Comment