శివం -74
రాజ కార్తీక్
(బందిపోట్ల నుండి కాపాడటానికి రాజు గారిని పల్లకిలో తీసుకువెళ్తూ ఉండగా, పల్లకిలో బాణం తగలటం వల్ల రక్తం బయటకు వచ్చింది. కొంతమంది సైనికులకు కూడా బాణం దెబ్బలు తగిలాయి...)
బందీ పోటు నాయకుడు "చచ్చాడు ముసలాడు... ఇక ఈ రాజ్యం నాదే. మా పన్నాగం ఫలించింది." అన్నాడు.
రాజు గారు చనిపోయిన బాధలో సైనికులు బాధాతప్త హృదయంతో ఉన్నారు.
బందీ పోటులతో పాటు, సైనికులు, హర సిద్దు సమంగా ఉన్నారు.
హర సిద్దా "బందీ పోటులారా! ఈ పెద్దయ్యని, తండ్రి లాంటి రాజును చంపి మీరు ఏమీ సాధించారు.."
బందీ పోటు "గత 60 ఏండ్లుగా వీని పాలన మాకు విసుగు పుట్టిస్తుంది. ఏ అక్రమాలు కల్లోలాలు, గొడవలు లేవు. అందుకే రాజ్యం లో వీరి తర్వాత రాజు లేడు. అతను కుతూర్ని పట్టపు రాణిని చేసుకొని, అన్ని రాజ్యాలు ఆక్రమించి నేను సామ్రాట్ అవుతాను." అన్నాడు.
వీర్ర వీగిపోతున్న బందీ పోటు, తన రహస్యాలన్నీ ఆనందంలో చెప్పేస్తున్నాడు..
హ సి "నీ వల్ల కాదుగా ఈ రాజ్య భారం మోయటం... ఎవరు ఉన్నారు నీ వెనకాల?"
బ "బాగానే కూపి లాగుతున్నావు."
హ సి " ఓహో నీ వల్లే నీ కుట్రదారుడు కూడా పిరికివాడు అన్నమాట..."
బ "నా ప్రభువు నాకు పదవి ఇవ్వ బోయే శ్రీ శ్రీ శ్రీ నా" అని ఆపాడు.
ఇక అర్దం అయ్యింది హార సిద్దుకు...
హ సి "సైనికులారా! మీకు కత్తులకు పనులు చెప్పండి, ముందు అనుకున్న వ్యూహం ప్రకారమే!" అని ఆజ్ఞాపించాడు.
ఒక్కసారిగా బందీ పోటు నాయకుడికి ఏమీ అర్దం కాలేదు...
హ సి "లోపల ఉంది మహారాజు కాదురా.. తోలు తిత్తి, ఎర్ర కుంకుమ సంచి... దానికి తగిలింది నీ బాణం అది చూసి నువ్వు మహారాజు అనుకుని మా వెంట పిచ్చి కుక్కలా వచ్చావు. మహా రాజు గుడిలోనే సురక్షితంగా ఉన్నారు. నా మాటలు కు రెచ్చిపోయి సరిగ్గా నేను అనుకున్న విధంగా చేసిన నీకు ధన్య వాదలు," అంటూ వెటకారం చేశాడు.
మితి మీరిన అవేశంలో హర సిద్దు పైకి వచ్చాడు.
సైనికులు మిగతా బందీ పొట్లను చూస్తూ ఉన్నారు. గుర్రం మీద నుండి పల్లకి మీదకి దూకిన హార సిద్ధు తన కత్తిని తిప్పే వేగం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ బందీ పోటు మాత్రం మీదకి వచ్చాడు. అప్పుడప్పుడు బందీ పోటు ది పై చేయి అయినా హార సిద్దు కత్తి స్వారీ చూడాల్సిందే...
బందీ పొట్లు అనుచరులును సైనికులు నిర్వీర్యం చేశారు. ఒకరిద్దరు చెల్లా చెదురయ్యి పారిపోయారు. కొంతమంది సైనికుల మీద వెనక నుండి దాడి చేయక పోతే హార సిద్దు వాళ్ళని భలేగా చాక చక్యంగా ఆపి శెభాష్ అనిపించుకున్నాడు. ఎంతయినా శిల్పి కదా, రాయిని దూరంగా ఎలా విసరాలో అలా విసిరి, వెన్ను పోటుకు గురి కాకుండా చూసాడు ల. దాని తో సైనుకులు కూడా శెభాష్ సోదరా అని హార సిద్దు ను పొగిడారు..
బందీ పోటు నాయకుడిని ఎదిరించటంలో సాయం చేద్దాం అనుకున్న సైనికులు ముందుకు వచ్చినా తాను ఒక్కడే పోరాటం చేస్తానని సైగ చేసి వెనక్కి పంపాడు.
హార సిద్దు కత్తి తిప్పటం చూసి సైనికులు కూడా 'వహ్వా!' అని అంటున్నారు.
బందీపోటు నాయకుడు మాత్రం మొండిగా ముందుకు వస్తున్నాడు.
హ సి "ఇక్కడ ఉన్న కొంతమంది చావు దెబ్బ తిని బతికి ఉన్నారు. ఇక నువ్వు లొంగిపోతే నీకు క్షమాభిక్ష పెట్టిస్తా. లొంగ కుంటే..."
బ " ఏమీ చేస్తావ్? "
హర సిద్దు కచ్చితంగా తన కత్తితో బందీ పోటు చేతి వెళ్ళు నరికి వేశాడు . కాళ్ళకి ఒక బాణం వేశాడు. ఆ బాణం కాళ్ళ మధ్యలో ఇరుక్కు పోయింది. ఇప్పుడు చెయ్యి, కాలు రెండూ వాడలేడు.
హ సి "చూసావా బందీ పోటు! నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా నీ దుర్మార్గపు బుద్ధి చివరికి నిన్ను ఈ స్థితి కి తెచ్చింది. పద నీకు ఇక పల్లకి పవళింపు" అన్నాడు.
బందీ పోటును గట్టిగా కట్టి, మిగిలిన బందీ పోట్లను రెండు మూడు గుర్రాలకు కట్టి, హార సిద్దు గుడి వైపు పయనం మొదలు పెట్టాడు.
దూరంగా గుడి. మధ్యలో రాజ్య సేనలు, హర సిద్దుకు ఎదురు వస్తున్నాయి.
హర సిద్దు భీకర స్వరంతో అందరినీ 'గుడిలో కి పదండి' అని అన్నాడు.
ధర్మయ్య మాత్రం "హర సిద్దు గట్టి వాడే! ఇంత ఒక్కడూ చేసాడు. తనకి ఏమి జరిగిన మీరు సైన్యం వచ్చే దాకా బయటకు రావద్దు, అని చెప్పి, తన కోసం పెద్దగా బాధ పడే వారు ఎవరూ లేరు అని విన్నవించి...గుడిలో సురక్షితంగా ఉండే పోటులో ఉండమని చెప్పి తన పన్నాగం అమలు చేశాడు." అన్నాడు.
బందిపోట్లను మోకాలు మీద వరుసుగా కూర్చో పెట్టారు.
హర సిద్దు మాత్రం పక్కన ఎవరు ఉన్నారు లెక్క చేయకుండా తన గుర్రాన్ని ఆపిన వైనంతో ఆ బందీపోట్ల మీద కడవల్లో నుండి నీరు మొహం మీద చిమ్మినట్టు పడ్డాయి.
ధర్మయ్య నోరు వెళ్ళ బెట్టుకొని చూసాడు .
"మనోడి లో శివుడే కాదు వీర భద్రుడు కూడా ఉన్నాడు " అన్నాడు.
రాజ్య పరివారానికి, అందరి చేతులు గట్టిగా కట్టేయమని చెప్పాడు.
"మహారాజా! తప్పుగా అనుకోకండి. మీ యందు భక్తితో చేసేది మాత్రమే ఇది.
తనతో వచ్చిన సైనికులకు అందరికీ చేతులను పైగా, 'నా' అనే అక్షరంతో పేరు మొదలు అయ్యే వాళ్ళకి కాళ్ళు కూడా కట్టేయమని చెప్పాడు. మిగతా వారు ముందుకు వచ్చినా, కేవలం తనతో వచ్చిన వారు మత్రమే కట్టాలి అని మరోసారి ఆజ్ఞాపించాడు...
గుడి తలుపులు మళ్ళీ మూసేసాడు.
బందీపోటు నాయకుడు స్పృహలోకి వచ్చాడు.
హర సిద్దు."ఓ బందీపోటా! నీ పోరాట పటిమ నాకు ఎంతో నచ్చింది. యుద్ధం లో నీవు చెడు వైపు నేను మంచి వైపు ఉన్నాము. ఈ దేశపు రాజు గారు ఎక్కడా అన్యాయంగా పాలించట్లేదు. కాబట్టి నీ తిరుగు బాటు తప్పు. ఎవరు ఇదంతా నీ చేత చేయించారో వారి పేరు చెప్తే, నీకు సరి అయిన వైద్యం, క్షమ బిక్ష దొరుకుతుంది. లేకపోతే ఇందాక జరిగినట్టు శిరశ్చేదన తప్పదు."
బందిపోటు ఏమీ చేయాలో అర్దం కాక అందరి వైపూ చూస్తున్నాడు. తనకి తెల్సు హరసిద్దు మామూలు వాడు కాదు, ఎందుకంటే తను మానసికంగా, శారీరకంగా వ్యూహ ప్రతివ్యూహాలతో ఆలోచస్తున్నాడు.
అందరికీ చేతికి కట్లు కట్టటం అయిపోయింది.
సైనికులు వచ్చి "సోదరా హార సిద్దా ! ధర్మయ్య స్వామీ కి కూడా కట్టాలా?" అన్నారు.
హర సిద్దు "అవసరం లేదు. ఒక వేళ దర్మయ్య దీనిలో ఉంటే, ఈ సమయంలో ఇక్కడ ఉండడు" అన్నాడు.
ధర్మయ్య "అరే పిడుగా ఘటికుడువే '' అనుకున్నాడు మనసులో.
హ సి "చెప్పు బందీ పోటా? ఎవరు ఈ కుట్ర దారు?" అని అడిగాడు.
మహారాజు హార సిద్దును శ్రద్ధగా చూస్తున్నాడు..
అతను న్యాయ అన్యాయాలను విశదీకరంచే విధానం..నేర్పరితనం, రాజు అంటే గౌరవం అన్నీ గమనిస్తున్నాడు.
ఎంత సేపటికీ చెప్పక పోయేసరికి ..
హ సి " ఇక అనవసరం. 'నా' అక్షరం గల పేరు గల వారందరినీ మనం విచారణ చేద్దాం.
కత్తిని అటు ఇటుగా తిప్పి, సరిగ్గా బందీ పోటు మీద వేటు వేయబోయాడు...
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment