శ్రీధరమాధురి -86
(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)
మనం ఏ బహుమానాలు, పురస్కారాలు ఆశించకుండా మన పూర్తి సామర్ధ్యంతో, చిత్తశుద్ధితో పనిచేస్తే, ఈ సమస్త జగతి స్వర్గంగా మారిపోతుంది. దేనికీ బదులు ఆశించకండి. కేవలం పని చెయ్యండి. ఏ సేవకైనా నిజమైన స్పూర్తి ఏమిటంటే, ఏమీ ఆశించకుండా పనిచెయ్యడమే. ఉద్యోగాలకై ఆకాంక్షించకండి. పనిని ఆశించండి. ఏ పనైనా చెయ్యండి... పని చేస్తూనే ఉండండి. ఉదారంగా పని చెయ్యండి. పెద్దా చిన్నా అంతరం చూడకండి. కేవలం పని చెయ్యండి. “ఈ పని నా విద్యార్హతలకు తగ్గినది కాదు’, అనకండి. అది గర్వం తప్ప మరేమీ కాదు. అప్పుడు మీరు కేవలం విద్యార్హతలు ఉన్నవారు అవుతారు, విద్యావంతులు కాదు. ఈ సంఘానికి మనం చేసే సేవే, దైవానికి చేసే సేవ. కుంటి సాకులు చెప్పకండి. పని చెయ్యండి.
***
నిరాశావాదం అనేది భయానికి పునాది వంటిది.
ఇక
ఆశావాదం ధైర్యానికి పునాది వంటిది.
***
గతాన్ని గతించనివ్వండి...
***
అమ్మాయి – నేను ఉద్యోగం చెయ్యాలా, లేక పి.హెచ్.డి చెయ్యాలా?
నేను – ఉద్యోగం.
అమ్మాయి – నేను పి.హెచ్.డి ఎప్పుడు చెయ్యాలి?
ఇంతకన్నా తెలివితక్కువ ప్రశ్న ఏమైనా ఉందా ?
ముందే మీరు ఏమి చెయ్యాలో నిర్ణయించుకున్నప్పుడు , ఎవరినీ అభిప్రాయం అడక్కండి, అలాగే చెయ్యండి. గురువును ఇటువంటి తెలివితక్కువ ప్రశ్నలు అడక్కండి. మీకు కావలసిన పాటే పాడటానికి ఆయన ‘లిసనర్స్ ఛాయస్ (జనరంజని వంటి కార్యక్రమం)’ ప్రోగ్రాం కాదు. క్లుప్తంగా ఆయన వివిధ భారతి కాదు. ఎన్నోసార్లు నేను గురువుతో అనుబంధం మీ నమ్మకానికి సంబంధించినది అని చెప్పాను. ఆయన వద్ద మీ తెలివితేటలు చూపించకండి. మీరు ఏ విషయంలోనైనా ముందే నిర్ణయించుకుని ఉంటే, గురువును ఆ విషయమై ఎన్నడూ ఏమీ అడక్కండి. ఆయన మీకు తాళం వెయ్యరు. మీరు ఇరుకులో పడతారు.
No comments:
Post a Comment