అర్ధం - పరమార్ధం - అచ్చంగా తెలుగు
 అర్థం..పరమార్థం
-ప్రతాప వెంకట సుబ్బారాయుడు




జీవితమంటే
నలుగురు మోసుకుపోకముందే
నలుగురితో కలిసి ఎలా ఉండాలో తెలుసుకోవాలి
నిజమే, అందరూ ఒక్కలా ఉండరు
ఈ సృష్టే అంత
కానీ ఎందుకిలా ఉంది?
ఒకరి జ్ఞానం మరొకరికి వెలుగుదారి చూపించాలి
ఒకరి లోపానికి మరొకరు సమాధానంగా నిలవాలి
ఇదీ విచక్షణ కలిగిన మానవుడి నుంచి 
భగవంతుడు ఆశించేది
అందరం సరదాగా.. సంతోషంగా ఉంటేనే
ఈ జనోద్యానవనం ఆహ్లాదంగా ఉంటుంది
ఆ తోటమాలి ఏ మొక్కనీ నిర్లక్ష్యం చేయడు
అన్న స్పృహ కలిగి ఉంటే చాలు
బెంగలు..బాధలూ పటాపంచలవుతాయి
జీవించడంలోని అర్థం..పరమార్థం బోధపడతాయి.
***

No comments:

Post a Comment

Pages