జ్యోతిష్య పాఠాలు - 9
PSV రవి కుమార్
పాఠం - 9
ద్వితీయాధిపతి ద్వారా ధనమును, కుటుంబమును, వాక్కు గురించి తెలుసుకోవచ్చు. ఏ గ్రహానికి ద్వితీయాధిపత్యం వస్తుందో ఆ గ్రహ కారకత్వాల ద్వారా ఫలితాలు నిర్ణయించాలి. ద్వితీయాధిపతి వివిద స్థానములలో ఉంటే, ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ద్వితీయాధిపతి లగ్నం లో ఉంటే:
ద్వితీయదిపతి లగ్నంలో ఉంటే, తన కోసం, తన ఆరోగ్యం కోసం డబ్బులు ఖర్చు చేయును.
ధన సంపాదన, వేరే దేశం నుండి కాని,వేరే రాష్ట్రం నుండి గాని వచ్చును. అనగా ధన సంపాదన కోసం వేరే ప్రదేశాలకు వెళ్ళును. స్వయం క్రుషి తో సంపాదించును.
కుజుడు వంటి గ్రహము, ద్వితీయాధిపతి అయ్యి,లగ్నం లో ఉంటే, తన మాట తీరు వలన ఇతరులతో వాదములు వచ్చు అవకాశం కలదు. శుక్రుడు కనుక ద్వితీయాధిపతి అయ్యి, లగ్నం లో ఉంటే, కుటుంబం లో అందరిని తన మాటల ద్వారా ఆకట్టువారగుదురు.
ద్వితీయాధిపతి ద్వితీయం లో ఉంటే:
ఇది ద్వితీయాధిపతి కి స్వక్షేత్రం అవుతుంది. వీరు, ధనమును బాగా సంపాదిస్తారు.
ద్వితీయం వాక్కు ను కూడా సూచిస్తుంది. వీరికి ద్వితీయాధిపతి కుజుడు అయ్యి, స్వక్షేత్రం లో ఉంటే, కుజదోషం గా పరిగణించరాదు (స్వక్షేత్రం కనుక). వీరి స్వరం కాస్త గట్టిగ ఉండును.
శుక్రుడు వంటి గ్రహం ద్వితీయాధిపతి అయ్యి, ద్వితీయం లో ఉంటే, వీరు సంగీతం, లేదా యాంకరింగ్, ద్వన్యనుకరణ (మిమిక్రీ) వంటి వ్రుత్తులు చేపట్టి, ధన సంపాదన కూడా చేయు అవకాశం కలదు. కుటుంబం యందు అమిత ప్రేమ కలిగి ఉంటారు. చంద్రుడు కనుక ద్వితీయాధిపతి అయ్యి ద్వితీయం లో ఉంటే, ధన సంపాదనకూడా చంద్ర కళల వలె వచ్చి పోవును.
ద్వితీయాధిపతి త్రుతీయం లో ఉంటే:
ఇది కూడా ఒక మంచి స్థానం అనే చెప్పాలి. వ్యాపారం ద్వరా బాగా ధన సంపాదన ఉండవచ్చు. సోదరులతో మంచి సంబందాలు. శుక్రుడు వంటి గ్రహం ఉంటే, వీరు మంచి వక్తలుగా పేరు తెచ్చుకుని, వారి మాటల ద్వార ప్రజలను ఆకట్టుకొంటారు. బుధుడు ద్వితీయాధిపతి అయ్యి, త్రుతీయం లో ఉంటే, రచనలు, లేదా రాత పని ద్వారా ధన సంపాదన ఉండును. ఒకోసారి, ముద్రణా రంగం ద్వారా కూడా ధన సంపాదన ఉండవచ్చు. కుజుడు వంటి గ్రహానికి ఇది ఒక మంచి స్థానం. కుజుడు పాప గ్రహం, త్రుతీయం ఉపచయ స్థానం. పాప గ్రహాలు ఉపచయాలలో యోగిస్తారు.
ద్వితీయాధిపతి చతుర్దం లో ఉంటే:
జాతకుడికి తన తల్లి ద్వారా ఆస్తి వచ్చే అవకాశం ఉండవచ్చు, లేదా తన తల్లి ధన సంపాదన కు ఒక మార్గదర్శి కావచ్చు.
వీరు, రియల్ ఎస్టేట్ వలన కాని, వ్యవసాయం వలన కాని, వాహనాల వలన కాని ధన సంపాదన చేయవచ్చు. వీరికి విదేశాలలో స్తిరపడే అవకాశం చాలా తక్కువ.
కుజుడు కనుకు ద్వితీయాధిపతి అయ్యి చతుర్దం లో ఉంటే, పోలీస్, మిలిటరీ వంటి వ్రుత్తుల ద్వారా ధన సంపదన చేయవచ్చు. రవి గ్రహం కనుక ద్వితీయాధిపతి అయ్యి, చతుర్దం లో ఉంటే, వీరు రాజకీయాలలో చురుకుగా ఉండి, వాటి ద్వారా సంపాదనచేయును.
శుక్రుడు కనుక చతుర్దం లో ఉంటే, వాహనాల ద్వారా కాని, లలిత కళల వలన కాని, ఇంజనీరింగ్ లేదా సాఫ్ట్ వేర్ వ్రుత్తుల ద్వారా కాని ధన సంపాదన చేయును. శని కనుక చతుర్దం లో ఉంటే,తల్లి నుండి దూరం గా పెరగవచ్చు, ప్రాథమిక విద్య యందు తక్కువ మార్కులు వచ్చుట, లేదా బాల్యం లో తల్లి చాలా కఠినం గా వ్యవహరించవచ్చు.
ద్వితీయాధిపతి పంచమం లో ఉంటే:
వీరికి జీవితం లో సంతానం కలిగిన తర్వాత, సంపాదన బాగా ఉండును. వీరు, కమ్మ్యూనికేషస్, టెలీ కమ్మ్యూనికేషన్స్, క్రియేటివ్ రంగాలు, రచనలు ఇటువంటి రంగాల ద్వారా ధనసంపాదన చేయును.
రాహువు, కేతువు వంటి గ్రహాలు కాని, వీటి నక్షత్రాలు కాని,ఈ పంచమానికి సంబందం ఉంటే, జ్యోతిష్యం విద్య ద్వారా కూడా ధన సంపాదన చేయును. పంచమం కోణ స్థానం అనగా లక్ష్మీ స్థానం. ఇందులో ద్వితీయాధిపతి ఉండటం ఒక విధంగా చాలా మంచిది. వీరికి ధన సంపాదన, అభివ్రుద్ది బాగా ఉండును.
ద్వితీయాధిపతి షష్టం లో ఉంటే:
ఆరోగ్యం కోసం ధనం ఖర్చు చేయును. కోర్టు వ్యవహారములకోసం ధనం వ్యయం అవును.
న్యాయ రంగాలలో కాని, వైద్య రంగాలలో కాని ధన సంపాదన ఉండును. కుటుంబ ఆస్తి కోసం తగాదాలు రావచ్చు లేదా ఆస్తి కలిసి రావచ్చు.విదేశాలలో సంపాదన బాగుగా ఉండును.
ద్వితీయాధిపతి సప్తమం లో ఉంటే:
కుటుంబం లో లేదా తెలిసిన కుటుంబంలోని వ్యక్తులు జీవిత భాగస్వాములు గా వచ్చు అవకాశం. వ్యాపారం ద్వారా ధన సంపాదన.
కుజుడు ఉన్న, రియల్ ఎస్టేట్, శుక్రుడు ఉన్న, లలిత కళలు, లేదా సాఫ్ట్ వేర్, గురుడు ఉన్న,ప్రవచనాల ద్వారా సంపాదన లేదా ఉపాధ్యాయ వ్రుత్తి ద్వారా సంపాదన ఉండవచ్చు.చంద్రుడు వలన, వ్యవసాయం, నీటి సంబందిత వ్యాపారం ద్వార సంపాదన. శని ఉన్న, గనులు లేదా కెమికల్స్ వ్యాపారం, లేదా ఇనుప సామాన్ల వ్యాపారం ద్వారా ధన సంపాదన. వీరికి వివాహం అయిన తర్వాత ధన సంపాదన బాగుగా ఉండును.
ద్వితీయాధిపతి అష్టమం లో ఉంటే:
అష్టమం ద్వారా రహస్యాలు, ఆయుష్షు, అరోగ్యం, అత్తగారి ఇల్లు వీటి గురించి తెలుసుకోవచ్చు.
అష్టమం లో ద్వితీయాధిపతి, ధన సంపాదన లో కాని, కుటుంబ విషయములలో కాని సమస్య లు కలుగ చేయవచ్చు. వీరు కుటుంబం గురించి ఎక్కువగా బయట వారితో చర్చించరు. శుభ గ్రహ ద్రుష్టి వలన కాని శుభ గ్రహములు ఉండుట వలన కానీ ఆస్తి కలిసి వచ్చు అవకాశములు ఎక్కువ. రహస్యముగా ధన సంపాదన కలిగి ఉండచ్చు.
వీరికి లాటరీల వలన కాని, స్టాక్ మార్కెట్ వలన కాని ధన సంపాదన కలుగవచ్చు. వీరు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం గాని, వీరి ఆరోగ్యం కోసం గానీ, ధనం ఖర్చు చేయవచ్చు.
ద్వితీయాధిపతి నవమం లో ఉంటే:
నవమం ద్వారా, ఉన్నత విద్య, భాగ్యం, అదృష్టం, ధర్మం వంటి విషయములు తెలుసుకోవచ్చు.
నవమం ను కోణ స్థానం అని, లక్ష్మీ స్థానం అని అంటారు. ద్వితీయాధిపతి నవమం లో ఉండటం ద్వారా, వీరు ధనవంతులు కాగలరు. వీరికి కుటుంబం నుండి సహాయం అందును. వీరు ధర్మములు చెప్పడం లేదా ప్రవచనములు ద్వారా కానీ, ఉపాధ్యా వ్రుత్తి ద్వారా ధన సంపాదన చేయవచ్చు. వీరు ఎక్కువగా మీడియా లేదా మార్కెటింగ్ రంగం లో పని చేయు అవకాశములు ఎక్కువ. వీరు ఉన్నత విద్య అభ్యసించు అవకాశములు కలవు.వీరి మాట తీరు అందరిని ఆకర్షించును.
ద్వితీయాధిపతి దశమం లో ఉంటే:
దశమం ద్వారా, ఉద్యోగం, వ్యాపారం, వ్రుత్తి వంటి విషయములు తెలుసుకోవచ్చు. ద్వితీయాధిపతి దశమం లో ఉండటంద్వార వ్యాపారం ద్వారా ధన సంపాదన ఉండవచ్చు. కానీ, దశమాధిపతి ద్వారా, ఉద్యోగం చేయునా,వ్యాపారం చేయునా అని నిర్ణయం చేయాలి.
బుధుడు, ద్వితీయాధిపతి అయ్యి, దశమం లో ఉంటే, ఉపాధ్యాయ వ్రుత్తి కానీ,టెక్నికల్ విద్యను అభ్యసించి, ఆ రంగం లో వ్రుత్తి నందు ఉందురు. శని కనుక ద్వితీయాధిపతి అయిన, కెమికల్, మెడికల్ రంగం నందు వ్యాపారం చేయును. రవి కనుక దశమం లో ఉన్న, ప్రభుత్వ ఉద్యోగం సంపాదించు అవకాశము కలదు. వీరికి, కుటుంబం నుంచి ఆస్తి వచ్చు అవకాశం కలదు. కుటుంబ వ్యాపారం చేయు అవకాశం కలదు. వీరి లో కొంతమంది వాక్కు ద్వారా ధన సంపాదన చేయును.
ద్వితీయాధిపతి ఏకాదశం లో ఉంటే:
ఏకాదశం ద్వారా లాభములు, సమాజం లో గుర్తింపు, జ్యేష్ట సోదరి, సోదరుడు వంటి విషయాలు తెలుసుకోవచ్చు.
వీరు వ్రుత్తి ద్వారా బాగా సంపాదిస్తారు.శని ద్రుష్టి కానీ, శని తో కలిసి ఉంటే, సంపాదన కాస్త నెమ్మది గా ఉండును. వీరికి కుటుంబం లో సంబందాలు బాగుండును. వీరికి స్టాక్స్ మార్కెట్ ద్వారా ధన సంపాదన బాగుండును. ద్వితీయాధిపతి ఏకాదశం లో ఉండటం ఒక ధన యోగం గా చెబుతారు,వీరికి ధన సంపాదన బాగుండును.
ద్వితీయాధిపతి వ్యయం లో ఉంటే:
వ్యయ స్థానం ద్వారా, విదేశీ యానం, ఖర్చులు, అనరోగ్యం, కారగారం రహస్యాలు, వంటి విషయాలు తెలుసుకోవచ్చు.వీరికి కుటుంబం కోసం ఖర్చు చేయాలసి రావచ్చు. వీరికి మాట తీరు వలన ఇబ్బందులు ఎదురు అవుతాయి.
వీరు. ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా, జ్యోతిష్య చెప్పుట వలన లేదా విదేశాలు వెళ్ళుట వలన కానీ, ధన సంపాదన చేయును. వీరు, పుట్టిన ప్రదేశం కంటే వేరే, రాష్ట్రాలలో కానీ, వెరే దేశాలలో కాని స్తిరపడే అవకాశములు ఎక్కువ. వేరే రాష్ట్రాలలో, లేదా దేశాలలో వీరికి ధన సంపాదన బాగుగా ఉండును.
తృతీయాధిపతి
తృతీయాధిపతి ను విక్రమ స్థానం అని కూడా అంటారు. ఈ స్థానం ద్వారా సమాజం లో మాట్లాడే తీరు, శక్తి, పట్టుదల, తమ్ముడు, చెల్లెలు, మీడియా, మార్కెటింగ్, రచనా సామార్ద్యం వంటివి తెలుసుకోవచ్చు.
తృతీయాధిపతి లగ్నం లో ఉంటే:
ఈ జాతకులు ఎక్కువగా ఉపాధ్యాయ వ్రుత్తి, ప్రవచన కర్తలు లాంటి ఉద్యోగాలలో రాణించే అవకాశం ఉంటుంది. ఒకొక్క గ్రహానికి ఒకొక్క కారకత్వం ఉంటుంది, ఆ కారకత్వాలు బట్టి ఈ తృతీయాధిపతి ఫలితాలను తెలుపవలెను.
చంద్రుడు, శుక్రుడు తృతీయాధిపతి అయి, లగ్నం లో ఉంటే, వీరికి స్రుజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. వీరు యాంకర్లు లాగా, సింగర్లు లాగా, మీడియా రంగం లో పని చేసే అవకాశాలు ఎక్కువ.
బుధుడు తృతీయాధిపతి అయి లగ్నం లో ఉంటే, వీరు, ఉపాధ్యాయ వ్రుత్తి లో ఉండే అవకాశం ఎక్కువ. వీరి లో అధ్బుతమయిన రచనా సామర్ద్యం ఉంటుంది. మార్కెటింగ్ రంగం లో కూడా విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువ.
గురుడు తృతీయాధిపతి అయ్యి లగ్నం లోఉంటే, వీరు, ధర్మాలు బోదించే వారుగా, ధర్మాచరణ పై మక్కువ కలిగిన వారుగా ఉంటారు. ప్రవచన కర్తలు గా కూడా విజయవంతం అవుతారు.
కుజుడు తృతీయాధిపతి అయ్యి లగ్నం లో ఉంటే, మంచి కమాండింగ్ (ఆదేశాలు ఇచ్చేవారుగా) కలిగిన వ్యక్తులుగా ఉంటారు. ఉన్నత పదవులకు ఎదుగుతారు. రవి తృతీయాధిపతి అయ్యి, లగ్నం లో ఉంటే, ప్రభుత్వ రంగం లో పని చేసే అవకాశం. పరిపాలన రంగం లో విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువ.
శని తృతీయాధిపతి అయ్యి లగ్నం లో ఉంటే వీరు జీవితం లో ఎదగటానికి ఎక్కువ కష్టపడాలసి రావచ్చు. వీరు సమాజం లో కలవటానికి ఎక్కువ సమయం తీసుకుంటారు.
తృతీయాధిపతి ద్వితీయం లో ఉంటే
వీరు తన కన్నా చిన్న వారయిన సోదర సోదరీల కోసం కష్టపడును. వారి బాధ్యత తీసుకొనును.
శుక్రుడు చంద్రుడు, వంటి గ్రహం ఉంటే, కళల ద్వారా ధన సంపాదన ఉండవచ్చు (సంగీతం, డాన్స్, గ్రాఫిక్స్) లేదా వాటి పట్ల అమిత ఇష్టం కలిగి ఉండచ్చు.
బుధుడు వంటి గ్రహం ఉంటే, రచనల ద్వారా కానీ, కార్యాలయాలలో రాతా పూర్వక, లేదా ముద్రణా రంగం ద్వారా గాని ధన సంపాదన ఉండచ్చు. గురుడు కనుక ఉంటే ధన సంపాదన బాగుంటుంది వీరు వ్రుత్తులలో కానీ, ఉపాధ్యాయ వ్రుత్తులలో కానీ, లీగల్ వ్రుత్తులలో కానీ ధనం సంపాదించే అవకాశం కలదు.
శని ఉంటే, నలుగురిలో మాట్లాడం అంతగా ఇష్టపడని వ్యక్తులుగా ఉంటారు, వీరికి ఎదుగుదల కూడా నిదానంగానే ఉంటుంది.
తృతీయాధిపతి తృతీయం లో ఉంటే
తృతీయం, శక్తి, పట్టుదల, తమ్ముడు, చెల్లెలు గురించి తెలుసుకోవచ్చు. ఈ స్థానం ద్వారా, వీరి మాట తీరు, తెలివి తేటలు తెలుసుకోవచ్చు
వీరికి ఈ స్థానం లో కుజుడు ఉంటే, వీరు, ఆయుధాలు చేపట్టు వ్రుత్తులు, లేదా మంచి ఇంజనీర్లు అయ్యే అవకాశం కలదు. బుధుడు కనుక ఈ స్థానం ఉంటే, టీచింగ్ వ్రుత్తి లో ఉండవచ్చు, లేదా, రాత, ముద్రణా, మార్కెటింగ్ వ్రుత్తులుల లో ఉండవచ్చు. రచనా సామర్ద్యం కలవారుగా ఉంటారు.
శని కనుక ఈస్థానం లో ఉంటే,(త్రుతీయ ద్రుష్టి తో పంచమ స్థానం చూస్థాడు కనుక) నవలా రచయితలు గా అయ్యే అవకాశం కలదు. విదేశాలకు వెళ్ళు అవకాశం కలదు. వ్యాపారం లో విజయవంతం అయ్యే అవకాశం కలదు.
గురుడు ఉంటే, ధార్మిక ప్రచారం చేయువారు, ప్రవచన కర్తలుగా ఉండు అవకాశం కలదు. పౌరహిత్యం చేయు అవకాశం కలదు. శుక్రుడు ఉంటే, (మిమిక్రీ, సంగీతం, యాంకర్స్ వ్రుత్తులలో ఉండచ్చు. పురుషులు అయిన స్త్రీ స్నేహాలు, స్త్రీ లయిన పురుష స్నేహాలు ఎక్కువగా ఉండును.
తృతీయాధిపతి చతుర్దం లో ఉంటే
తల్లి తో మంచి స్నేహితులుగా ఉంటారు. స్వదేశం లోనే వ్రుత్తులు చేపట్టే అవకాశం. తల్లి వలన లాభ పొందుదురు.
వీరికి కుజ సంబందం ఉంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా ఉన్నత స్థితి కి చేరు అవకాశం కలదు. శుక్రుడు ఉంటే విలాశవంతమయిన జీవితం. వ్యవసాయం చేయు అవకాశం.
శని ఉంటే, ప్రాదమిక విద్యలో ఆటంకాలు, లేదా, తక్కువ మార్కులు వచ్చుట, స్కూలులో మిగితా విద్యార్దులతో అంతగా కలవలేకపోవటం వంటివి ఉంటాయి.గురుడు ఉన్నచో, వీరికి కుటుంబ ఆస్తులు వచ్చే అవకాశం కలదు. బుధుడు ఉన్నచో, రచనల ద్వారా సంపాదించచ్చు, మార్కెటింగ్ లో బాగా రాణిస్తారు.
తృతీయాధిపతి పంచమం లో ఉంటే
పంచమం కోణ స్థానం, కాబట్టి, ఏ గ్రహమయినా ఎక్కువ శుభఫలితాలే ఇస్థాయి. పంచమం, క్రియేటివిటీ ను, సంతానం ను తెలుపుతుంది. ఏ గ్రహం ఉన్ననూ, దానికి సంబందించి, క్రియేటివ్ లేదా అందులో ఉండే వ్రుత్తులలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు.
వీరు సాఫ్ట్వేర్ రంగం లో ఉంటే, గ్రాఫిక్స్ డిసైనర్లు గా, లేదా సాఫ్ట్వేర్ లో ఎదయినా క్రియేటివ్ గా చేయువారు గా ఉంటారు. బుధుడు కనుక ఉంటే, మంచి హాస్య చతురత కలిగి ఉండుట, రచనలు చేయు అవకాశం కలదు.
తృతీయాధిపతి షష్టం లో ఉంటే
షష్ట స్థానం, కోర్టు వ్యవహారములు, శత్రువులు, అనారోగ్యం వంటివి తెలియచేయును. ఈ స్థానం లో ఏ గ్రహం ఉన్ననూ, వీరికి వీరి తమ్ముడు, చెల్లెళ్ళ తో ఉండే సంబందాల విషయములలో కాస్త జాగ్రత్త గా ఉండవలెను. ఏ గ్రహమయినా వక్రించి ఉన్నచో, లీగల్ సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, కలుగవచ్చు.
గురుడు షష్టం లో ఉంటే, లీగల్ సంబందిత వ్రుత్తులలో ధన సంపాదించే అవకాశం కలదు. రవి షష్టం లో ఉంటే, కోర్టు లేదా లీగల్ సంబందిత శాఖలలో ప్రబుత్వ ఉద్యోగం చేయు అవకాశం కలదు.
కుజ, శని, చంద్రుడు గ్రహాలలో ఎదయినా గ్రహం ఉంటే మెడికల్ రంగం లో కానీ, తత్సంబందిత వ్రుత్తులలో పని చేయు అవకాశం కలదు. కుజుడు, మెడికల్ వ్రుత్తి ఇవ్వని చో, పోలీస్, మిలిటరీ లో ఉందురు. (కుజుడు కారకత్వం ప్రకారం, పనిముట్లు, తుపాకీలు, కత్తులు, వంటివి చేపట్టే వ్రుత్తులు లలో ఉందురు).
తృతీయాధిపతి సప్తమం లో ఉంటే
సప్తమం వివాహం, వ్యాపారం వంటివి తెలుయచేయును.
శని లేదా కుజుడు కనుక ఈ స్థానం లో ఉంటే వివాహం అవ్వటం లో ఆలస్యం. ఒక వేల వివాహం త్వరగా అయ్యినచో భార్యా భర్తలలో అవగాహనా లోపం, లేదా అర్దం చేసుకోవటం లో ఆలస్యం అవ్వచ్చు. శని, బుధుడు సప్తమం లో ఉంటే వ్యాపారం లో విజయం సాధిస్తారు. శుక్రుడు, బుధుడు, గురుడు కనుక ఈ స్థానం లో ఉంటే, భార్య భర్తల మధ్య మంచి సంబందం కలిగి ఉంటారు.
తృతీయాధిపతి అష్టమం లో ఉంటే
అష్టమం ఆయుష్షు, ఆరోగ్యం, మాంగళ్యం, రహస్యాలు వంటి విషయాలు తెలుసుకోవచ్చు. ఈ స్థానం లో ఏ గ్రహం ఉన్నా, ఆ గ్రహ సంబందిత విద్యలలో సంపూర్ణ విజ్ఞానం కలిగి ఉంటారు. వీరు మంచి చెడు ఫలితాలు రెండు అనుభవిస్తారు.
బుధుడు ఉంటే, లెక్కలు, ఎలక్ట్రానిక్స్ వంటి విషయాలలో అధిక జ్ఞానం కలిగి ఉంటారు.
కుజుడు ఉన్నచో, రహస్య విభాగాలలో పదవులు చేపట్టే అవకాశం కలదు. వీరు సర్జన్లు గా రాణించే అవకాశం కలదు.
చంద్రుడు, గురుడు, శుక్రుడు వంటి గ్రహాలు ఉంటే, జ్యోతిష్యం విద్య పై పట్టు ఉండు అవకాశం కలదు. చంద్రుడు, బుధుడు వంటి గ్రహాలు ఉన్నచో, ఆస్ట్రానమీ విద్య అభ్యసించు అవకాశం కలదు.
తృతీయాధిపతి నవమం లో ఉంటే
నవమం ద్వారా ఉన్నత విద్య (పోస్ట్ గ్రాడ్యుయేషన్) ఆధ్యాత్మిక జ్ఞానం, పాటించు ధర్మాలు, విదేశి ప్రయాణములు వంటి విషయములు తెలుసుకోవచ్చు. వీరు ధర్మములు పాటించు వ్యక్తులు, వీరు ఆ ధర్మములు నలుగురికి చెప్పు వ్యక్తులు గా ఉందురు. విదేశాలకు వెళ్ళు అవకాశం కలదు.
బుధుడు, శుక్రుడు ఉన్నచో టెక్నికల్ ఉన్నత విద్య అభ్యసించు అవకాశం కలదు. గురుడు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉందురు. కుజుడు ఉన్నచో మెడికల్ రిలేటడ్ విద్యలో రాణించు అవకాశం కలదు.
తృతీయాధిపతి దశమం లో ఉంటే
దశమం ఉద్యోగం విషయం తెలుసుకోవచ్చు. రవి కనుక తృతీయాధిపతి అయ్యి దశమం లో ఉంటే, ప్రభుత్వ రంగం లో పని చేసే అవకాశం కలదు.
కుజుడు ఉన్న, స్పోర్ట్స్ ఆడే వ్యక్తులుగా ఉందురు. శరీర ధారుడ్యం పై అమిత ఇష్టం కలిగి, వ్యాయామ శాలలు ఏర్పాటు చేసి ధన సంపాదన చేయు అవకాశం కలదు. గురుడు, బుధుడు, శుక్రుడు ఉన్న,టీచింగ్ వ్రుత్తులలో రాణించే అవకాశం కలదు. సాఫ్ట్వేర్ రంగం లో కూడా బాగా రాణిస్తారు. గురుడు ఉన్న, ఫైనాన్స్ రంగం లో కానీ, లీగల్ రంగం లో కానీ రాణించే అవకాశం కలదు.
శుక్రుడు ఉన్న, క్రియేటివ్ రంగం లో విజయవంతం అవుతారు. చంద్రుడు ఉన్న, మెడికల్ రంగం లో కానీ, ప్రభుత్వ శాఖలలో ఉన్నత పదవులలో కానీ, రచనా రంగంలో కానీ రాణిస్తారు.
తృతీయాధిపతి ఏకాదశం లో ఉంటే
ఏకాదశం లాభాన్ని తెలియ చేస్తుంది. వీరు ఎటువంటి లాభాలు పొందుతారు తెలుసుకోవచ్చు. అంతే కాకుండా స్టాక్ మార్కెట్ల ద్వార వచ్చే లాభాలు, లాటరీలు ద్వారా వచ్చే లాభాలు తెలుసుకోవచ్చు.
రవి, చంద్రుడు కనుక ఈ స్థానం లో ఉంటే, అధికార పదవులు చేపట్టే అవకాశం కలదు. రవి ఉంటే, రాజకీయలలో కూడా రాణించే అవకాశం కలదు. కుజుడు, శుక్రుడు, గురుడు బుధుడుల లో ఏదయినా గ్రహం ఉన్న, షేర్ మార్కెట్ ల ద్వారా లాభం పొందుతారు.
వీరు అందరితో మంచి వాక్చాతుర్యం కలిగి, సమాజం లో లేదా కార్యాలయలాలో వీరు మాట తీరు తో అందరినీ ఆకర్షింప చేసుకొందురు.
తృతీయాధిపతి ద్వాదశం లో ఉంటే
ఇది కాస్త ఇబ్బంది పెట్టే స్థానం. వీరు పుట్టిన ఊరి నుండి, వేరే రాష్ట్రం లో కానీ, వేరే దేశాలలో కానీ విజయం సాధిస్తారు. వీరు ఎక్కువగా, మీడియా రంగం లో కానీ, టెలీ కమ్యునీకేషన్స్ రంగం లో కానీ, హాస్పిటల్ రంగం లో కానీ వ్రుత్తులు చేపడతారు.
వీరి మాట తీరు ఇబ్బందికరంగా ఉండి, అప్పుడప్పుడు, గొడవలకు, అపార్దాలకు అవకాశం కలదు.
బుధుడు, శుక్రుడు, కుజుడు, శని వంటి గ్రహములు వేరే దేశములలో నివసించుటకు, లేదా స్థిర పడుటకు అవకాశములు ఇచ్చును. గురుడు ఉన్న, ధనం ఖర్చు చేయు విషయములలో జాగ్రత్త అవసరం.
(మిగతాది వచ్చే నెల)
***
No comments:
Post a Comment