జ్యోతిష్య పాఠాలు -10 - అచ్చంగా తెలుగు

జ్యోతిష్య పాఠాలు -10

Share This
జ్యోతిష్య పాఠాలు -10 
పి.ఎస్.వి.రవి కుమార్
 



చతుర్ధాధిపతి ద్వారా తల్లి, మాత్రుభూమి, భూములు, వాహనాలు, ప్రాధమిక విద్య  గురించి తెలుసుకోవచ్చు. చతుర్ధం కేంద్ర స్థానం.

చతుర్ధాధిపతి లగ్నం లో ఉంటే:
లగ్నం లో కేంద్రాదిపతి ఉంటే రాజయోగం గా చెప్పుకోవచ్చు. వీరు విదేశాల కంటే, స్వదేశం లోనే ఉన్నతి సాధిస్తారు. 
చంద్రుడు కనుక లగ్నం లో ఉంటే, వీరికి ఎక్కువగా తల్లి పోలికలు వచ్చే అవకాశం ఉంటుంది. శుక్రుడు, గురుడు, బుధుడు వంటి గ్రహములు కనుక లగ్నం లో ఉంటే కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు. శుక్రుడు, వాహన సౌఖ్యం కూడా ఇస్తాడు. కుజుడు భూలాభాలు ఇస్తాడు. కుజుడు లగ్నం లో ఉంటే, క్రీడల యందు కానీ, వ్యాయామాల యందు కానీ, ఎన్ సీ సీ యందు కానీ ఇష్టాన్ని కలిగిస్తాడు. పోటీ తత్వన్ని కలిగిస్తాడు. 

చతుర్ధాధిపతి ద్వితీయం లో ఉంటే:
ద్వితీయం లో ఉండే గ్రహాలు, కుటుంబ సొఖ్యాన్ని, వాక్కు, ధన సంపాదన తెలియచేస్తాయి.
చతుర్దాదిపతి ద్వితీయం లో ఉంటే, తల్లి పై అమిత ప్రేమ, ధన సంపాదన లో అభివ్రుద్ది, ధన సంపాదన లో తల్లి యొక్క పాత్ర (అనగా సలహా ఇవ్వడం లేదా విద్య యందు ఒక మార్గ దర్శి గా ఉండుట). వ్యాపారం ద్వారా లాభాలు సంపాదించుట.
గురుడు కనుక ద్వితీయం లో ఉంటే, ధన సంపాదన కాస్త ఆలస్యం అయ్యే అవకాశం. అదే శని కనుక ఉంటే, ధన సంపాదన లో అభివ్రుద్ది నిదానంగా ఉండును. శుక్రుడు, బుధుడు కనుక ద్వితీయం లో ఉంటే, మాటల వలన ధన సంపాదన అనగా టీచింగ్, మిమిక్రీ, గాయకులు, యాంకరింగ్ వంటి వ్రుత్తులు ఉదాహరణా గా  చెప్పుకోవచ్చు. 
 వ్యాపారం అనగా కుటుంబం లో వంశపారంపర్యం గా వచ్చే వ్యాపారం కానీ, భూ సంబందిత వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ చేయు అవకాశం కలదు.

చతుర్ధాధిపతి త్రుతీయం లో ఉంటే: 
త్రుతీయం మీడియా,మార్కెటింగ్, కనిష్ట సోదరి, కనిష్ట సోదరుడు, మాట తీరు, రచనా సామర్ధ్యం వంటి విషయాలు తెలుసుకోవచ్చు.
త్రుతీయం ఉపచయ స్థానం. ఈ స్థానం లో పాప గ్రహాలు శుభ ఫలితాలు ఇచ్చును, పుణ్య గ్రహాలు, ఇబ్బంది పెట్టి ఫలితాలు ఇచ్చును. బుధుడు కనుక త్రుతీయం లో ఉంటే, మార్కెటింగ్ లేదా సాఫ్ట్ వేర్ రంగంలో అభివ్రుద్ది సాధించును. గురుడు ఉంటే, ఫైనాన్స్ రంగం లో అభివ్రుద్ది సాదించును. 
శుక్రుడు ఉంటే, క్రియేటివ్ రంగం నందు అభివ్రుద్ది సాదించును. శుక్రుడు, బుధుడు వంటి గ్రహాలు ఉంటే, ప్రస్తుత కాలం లో యూట్యూబ్ వీడియో లు చేసి వాటి ద్వారా ధన సంపాదన చేయు వారు గా ఉండచ్చు.
వీరు విదేశాలలో అభివ్రుద్ది సాదిస్తారు.  వీరికి వారి కనిష్ట సోదరీ సోదరులకు, తల్లి వలె మార్గదర్శి గా ఉంటారు. ప్రాదమిక విద్య యందు అధిక శ్రద్ద అవసరం. ఒకోసారి ప్రాదమిక విద్య కోసం, వారి ఇంటి నుండి దూరం గా నివసించవలసి రావచ్చు.

చతుర్ధాధిపతి చతుర్దం లో ఉంటే: 
ఇది ఆ గ్రహానికి స్వక్షేత్రం. బలం అధికంగా ఉంటుంది. ఈ జాతకులు, ఉద్యోగం స్వదేశం లో నే చేస్తారు. వ్యాపారం లో విజయం సాదిస్తారు. వీరికి భూలాభాలు ఉంటాయి. వ్యవసాయం చేయు అవకాశం,లేదా వ్యవసాయ సంబందిత అభివ్రుద్ది కలుగును. 
తల్లి, ఒక మార్గదర్శి గా ఉండును. స్కూలు విద్య యందు ముందంజ లో ఉంటారు. శని కనుక ఉంటే, ఫలితాలను ఆలస్యం చేస్తాడు. శని ఉద్యోగం కంటే, వ్యాపారం లో అభివ్రుద్దినిస్తాడు. 
రవి కనుక ఉంటే, ప్రభుత్వ ఉద్యోగం కానీ, రాజకీయాలలోకి వెళ్ళు అవకాశం కలదు. చంద్రుడు కనుక ఉంటే, బయలజికల్ విద్య యందు ఆసక్తి కనబరుచును. 
శుక్రుడు ఉంటే, విలాసవంతమయిన జీవితం ను అనుభవిస్తారు. వాహనాల సంబందిత వ్యాపారం చేయు అవకాశం కలదు. క్రియేటివ్ రంగం లో పనిచేయు అవకాశం కలదు.బుధుడు ఉన్న, లెక్కల యందు ఆసక్తి చూపును. కుజుడు ఉన్న, రియల్ ఎస్టేట్ నందు అభివ్రుద్ది.

చతుర్ధాధిపతి పంచమం లో ఉంటే: 
ఇది రాజయోగం, ఎందుకనగా, కేంద్రాదిపతి అయిన గ్రహం కోణం లో ఉన్నందున. పంచమం, సంతానం, రచనా సామర్ద్యం, సౄజనాత్మకత, ప్రేమ వంటి విషయాలు తెలుసుకోవచ్చు.
చతుర్దాధిపతి పంచమం లో ఉంటే, విద్య లో ఎప్పుడూ ముందంజ లో ఉండటం. స్కూలు లో పెట్టు, వ్యాసరచన పోటీలలో పాల్గొని విజయాలు సాదించడం. డ్యాన్స్, సంగీతం, డ్రాయింగ్ వంటి వాటి పై ఆసక్తి. 
చంద్రుడు, శని గ్రహాలు కనుక ఉంటే, వైద్య విద్య లేదా తత్సంబందిత విద్యలు అభ్యసించుట. శని ఉన్న, సంతానం ఆలస్యం. రవి గ్రహమున్న, రాజకీయాలయందు ఆసక్తి. వేరే ఇతరత్ర గ్రహాలు ఉన్న, ఉన్నత స్తితి పొందుట, అధికార స్థాయి కి వెళ్ళుట జరుగును.

చతుర్ధాధిపతి షష్టం లో ఉంటే: 
షష్టం ఉపచయ స్థానం. ఇందులో పాప గ్రహాలు శుభ ఫలితాలు ఇస్తాయి. షష్ట స్థానం శతువులను, రుణములను, పోటీ తత్వాన్ని, రోగాలను తెలియచేయును.
శని కనుక చతుర్దాదిపతి అయ్యి, షష్టం లో ఉంటే, తల్లికి అనారోగ్యం కలుగవచ్చు. కుజుడు కనుక చతుర్దాతిపతి అయ్యి, షష్టం లో ఉంటే, తల్లి తో కానీ, తల్లి తరపు బందువులతో గానీ గొడవలు జరిగే అవకాశం కలదు ( ఇది సింహ లగ్నానికి వర్తించదు - కారణం సింహ లగ్నానికి షష్టం అంటే కుజుడు ఉచ్చ స్థానం లో ఉంటాడు కాబట్టి).
కుజుడు ఉన్న, పోటీ తత్వాన్ని కలిగిస్తాడు. ఎటువంటి పరీక్షలలో అయినా విజయం సాదిస్తారు. వీరు వాహనములు నడిపే విషయం లో జాగ్రత్త పాటించాలసి రావచ్చు. కుజుడు ప్రమాదాలకు కారణం. షష్టం లో ఉన్న ఏ గ్రహమైనా, ద్వాదశాన్ని చూస్తుంది. కాబట్టి, శని, కుజుడు, చంద్రుడు ఈ స్థానం లో ఉన్న, వైద్య విద్య లేదా తత్సంబందిత విద్యను అభ్యసించు అవకాశం కలదు.
బుధుడు, గురుడు, రవి ఉన్న న్యాయ వాది విద్య, లేదా లీగల్ రిలేటడ్ విద్య, అకౌంటింగ్ రిలేటడ్ విద్య అభ్యసించును. ఈ జాతకులు విదేశాలలో అభివ్రుద్ది సాదిస్తారు.  

చతుర్ధాధిపతి సప్తమం లో ఉంటే: 
సప్తమం కళత్రం, వ్యాపారం వంటి విషయాలు తెలియ చేయును. వీరికి వివాహం బందువర్గం లో అయ్యే అవకాశం కలదు. కుజుడూ ఉన్న, ఆలస్య వివాహం. శని ఉన్న, వివాహం ఆలస్యం అవును లేదా, భార్యా భర్తల కు అర్దం చేసుకోవటానికి సమయం ఎక్కువ తీసుకొనును. స్వయం క్రుషి వలన భూలాభాలు కలుగును. 
చంద్రుడు ఉన్న మెడికల్ రిలేటడ్ వ్యాపారం చేయు అవకాశం కలదు.  రవి ఉన్న, ప్రభుత్వ రంగనికి సంబందిత ఉద్యోగం కానీ, ప్రభుత్వ సంబందిత కాంట్రాచ్ట్లు చేయు అవకాశం కలదు. 
కళత్రం వలన, భూలాభాలు కలుగ వచ్చు. బుధుడు, గురుడు ఉన్న, న్యాయవాద విద్య అభ్యసించు అవకాశం కలదు.


చతుర్ధాధిపతి అష్టమం లో ఉంటే: 
అష్టమం అనగా, అయుష్షు, ఆరోగ్యం, అత్తగారిల్లు, వంటి విషయాలు తెలుసుకోవచ్చు. అష్టమం అనగా ఒక రహస్య నిధి వంటిది. ఈ స్థానం లో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహం లేదా ఆ స్థానం కు సంబందించిన కొన్ని రహస్యాలు జీవితం లో ఉంటాయి.
అష్టమం పాప స్థానం. ఇక్కడ ఏ గ్రహం ఉన్ననూ, కొన్ని కొన్ని ఇబ్బందులు తప్పవు. శని ఉన్న రీసెర్చ్ విద్య యందు ఇష్టం కలిగి ఉంటారు. వీరికి జ్యోతిష్యం, వాస్తు హస్త సాముద్రికం విద్య యందు ఆసక్తి ఉంటుంది.
వీరు బాల్యం నందు తల్లి కి దూరం గా ఉండటం జరుగుతుంది. ప్రాధమిక విద్య యందు ఆటంకాలు కలుగవచ్చు లేదా తక్కువ శ్రేణి మార్కులతో ఉత్తీర్ణత అవు అవకాశములు కలవు.  

చతుర్ధాధిపతి నవమం లో ఉంటే: 
కేంద్రాధిపతి కోణం లో ఉన్నందున ఇది కూడా రాజయోగమే.
ఈ జాతకుల తల్లి, వారి పిల్లలకు గురువు అవును. అనగా ఇంటి యందు పిల్లల చదువుల బాగోగులు చూసుకొనుట. తల్లి పాటించు సాంప్రదాయలు పాటించుట. 
శని ఉన్న తల్లి పిల్లల యందు క్రమశిక్షణ తో ఉండును. ఉన్నత విద్య ను అభ్యసించడం లో కాస్త ఆలస్యం లేదా ఉత్తీర్ణత సాధించడం లో ఇబ్బందులు. 
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళటం లేదా వేరే రాష్ట్రలకు వెళ్ళటం జరగవచ్చు.  

చతుర్ధాధిపతి దశమం లో ఉంటే: 
వీరు ఉద్యోగం స్వదేశాలలో చేయును. శని ద్రుష్టి ఉన్న లేదా శని దశమం లో ఉన్న, ఉద్యోగం లో అభివ్రుద్ది చాలా నిదానం గా ఉండును. శని దశమం లో ఉన్న వ్యాపారం లో అభివ్రుద్ది బాగుండును. 
చంద్రుడు ఉన్న, వైద్య లేదా తత్సంబందిత రంగాలలో వ్రుత్తులు చేయును. కుజుడు ఉన్న, ఆర్మీ, పోలీస్ లేదా ఇంజనీరింగ్ వ్రుత్తులలో స్థిరపడు అవకాశం కలదు. 
బుధుడు ఉన్న సాఫ్ట్ వేర్ రంగం లో కానీ మార్కెటింగ్ రంగం లో కానీ ఉన్నతి సాధించును. గురుడు ఉన్న ఫైనాన్స్ రంగం లో ఉద్యోగం చేయు అవకాశం కలదు. గురుడు ఉపాధ్యాయ వ్రుత్తి లేదా, ఆధ్యాత్మిక రంగం లో ధన సంపాదన చేయు అవకశం కలదు. శుక్రుడు ఉన్న, క్రియేటివ్ రంగం లో గానీ, వ్యవసాయం లో కానీ స్తిరపడచ్చు.  

చతుర్ధాధిపతి ఏకాదశం లో ఉంటే: 
ఏకాదశం ద్వార లాభాలు తెలుసుకోవచ్చు, లాటరీ లు, స్టాక్స్ వంటివి తెలుసుకోవచ్చు. 
క్రియేటివ్ రంగాలలో వ్రుత్తుల ద్వారా లాభాలు గడించచ్చు. రియల్ ఎస్టేట్ రంగాల ద్వారా లాభలు రావచ్చు. 
ధన సంపాదన, ధన లాభాలు బాగుండును. శని ద్రుష్టి ఉన్న లేదా శని సంబందం ఉన్న లాభాలు నిదానం గా ఉండును. తల్లి ద్వారా లాభాలు కలుగు అవకాశం కలదు. 

చతుర్ధాధిపతి ద్వాదశం లో ఉంటే: 
ద్వాదశం వ్యయాన్ని, విదేశి యానాలను, శిక్షలను, ఆసుపత్రులను తెలియచేయును. ఇది పాప స్థానం. ఇందులో ఏ గ్రహం ఉన్ననూ మంచి,చెడు రెండు ఫలితాలను ఇస్తుంది. 
తల్లికి కాస్త అనారోగ్యం కలుగవచ్చు. శని ఉన్న, తల్లి చాలా క్రమశిక్షణ కలిగి ఉండును, బాల్యం నందు, తల్లి కి దూరం గా విద్యను అభ్యసించవచ్చు. రవి ఉన్న, తండ్రి తో ఇబ్బందులు. 
వీరు విదేశాలలో కానీ, లేదా పర రాష్ట్రాలలో కానీ విజయాలను సాదిస్తారు. వీరికి, శని, కుజ, చంద్రుడు వంటి గ్రహాలు ద్వాదశం లో ఉన్న, వైద్య తత్సంబందిత విద్య అభ్యసించు అవకాశంకలదు.

***

No comments:

Post a Comment

Pages