అలా కలలు సాకారమౌతాయి
కనులు కన్నకలలు
సాకారమవాలంటే,
ఆశల అలలను, అలజడుల సుడులను దాటి
సవ్యంగా(స్థిరంగా)మారాలంటే
కెరటాల్లా, ఆరాటంగా పడిలేచే
ఆలోచనలకు
అస్థిత్వం రావాలంటే
విజయాన్ని సాధించటం నీ
తరమవాలంటే
నీ ప్రయత్న ప్రాకారంలోకి కలలను
ఒంపుకోవాలి.
పట్టుదలల పిడికిళ్ళు ఆశయాలను
నింపుకోవాలి.
నిరాశ, నిస్తేజాలను
చంపుకోవాలి.
ఆవేదనల సంకెళ్ళను త్రెంపుకోవాలి,
శ్రమను ప్రేమతో స్పందించాలి,
నీ మదిలో దానికి
ప్రధమస్థానం అందించాలి.
అప్పుడు ఊహలు ఊళ్ళుఏలుతే,
రాతలు రాజ్యాలేలుతాయి.
అలా నీకలలు సాకారమౌతాయి.
***
No comments:
Post a Comment