జ్యోతిష్య పాఠాలు - 11 - అచ్చంగా తెలుగు

  జ్యోతిష్య పాఠాలు - 11 

PSV రవి కుమార్


పాఠం -  11

పంచమాధిపతి ద్వారా సంతానం, స్రుజనాత్మకత, ప్రేమ, స్టాక్ మార్కెట్ వంటి విషయాలు తెలుసుకోవచ్చు.

పంచమాధిపతి లగ్నం లో ఉంటే  స్నేహభావం కలిగి ఉంటారు. రవి, కుజ పంచమాధిపతి అయ్యి, లగ్నం లో ఉంటే, కోపం అధికంగా కలిగి ఉంటారు, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు.

శుక్రుడు అయితే, సంతానం పైన ప్రేమ అధికం గా కలిగి ఉంటారు. బుధ, గురులు కనుక లగ్నం లో ఉంటే, ధన సంబందిత వ్యవహారాలలో లేదా లెక్కల యందు, అభిలాష కలిగి ఉంటారు. గురుడు ఆధ్యాత్మిక చింతన లేదా అటువంటి విషయాలపై అభిలాష కలిగిస్తుంది.

పంచమాధిపతి ద్వితీయం లో ఉంటే కుటుంబం యందు ప్రేమ, కలిగి ఉంటారు. వీరు స్రుజనాత్మకత ద్వారా ధనసంపాదన చేసే అవకాశం కలదు లేదా, మిమిక్రీ, పాటలు, యాంకర్ వ్రుత్తులు చేపట్టే అవకాశం కలదు.  వీరికి సంతానం కలిగిన తరువాత, ధన సంపాదన బాగా ఉండును.

శుక్రుడు కనుక ద్వితీయం లో ఉంటే సంగీతం, న్రుత్యం లేదా ఇటువంటి లలిత కళల యందు ఆసక్తి, వాటిని వ్రుత్తులు గా ఎంచుకొను అవకాశం. బుధుడు కనుక ద్వితీయం లో ఉంటే, మంచి మాటకారి వ్యక్తులు గా ఉంటారు. వీరు, వీరి మాటల ద్వారా పలుగురిని ఆకర్షిస్తారు.
గురుడు కనుక ద్వితీయం లో ఉంటే, ఫైనాన్స్ సంబందిత వ్రుతులలో కానీ, లేదా ఆధ్యాత్మిక  ప్రవచనాల ద్వారా కాని ధన సంపాదన చేయవచ్చు. శని ఉన్న, ధన సంపాదన లో ఎదుగుదల నిదానం గా ఉండును.

పంచమాధిపతి త్రుతీయం లో ఉంటే ఎక్కువగా మార్కెటింగ్, మీడియా, టెలీ కమ్మ్యునికేషన్ వంటి రంగాలలో బాగా రాణిస్తారు. బుధుడు కనుక త్రుతీయం లో ఉంటే రచనా రంగం లో రాణిస్తారు, కమ్మ్యునికేషన్ రంగం లో కానీ, ముద్రనా రాంగం లో రాణిస్తారు. శని త్రుతీయం లో విజయాన్ని నిదానంగా  ఇస్తాడు.

పంచమాధిపతి చతుర్దం లో ఉంటే రాజయోగం గా చెప్పుకోవచ్చు.

రాజయోగం అయినప్పటికీ చతుర్దం పంచమానికి వ్యయం కనుక, విజయాలు కలగటం లో అధిక క్రుషి అవసరం. వీరు, బాల్యం లో తల్లి కి దూరం గా ఉండవలసి రావచ్చు లేదా విద్యాభ్యాసం లో మార్కులు కాస్త తక్కువ గా రావచ్చు. వీరి సంతానం కు కాస్త ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. వీరు, స్వస్థానం వదిలి వెళ్ళవలసి రావచ్చు. శుక్రుడు కనుక చతుర్ధం లో ఉంటే, ప్రేమ వైఫల్యం అయ్యే అవకాశం ఉంది. గురుడు కనుక ఉంటె, పిల్లల కోసం ధన వ్యయం అయ్యే అవకాశం కలదు.

పంచమాధిపతి పంచమం లో ఉంటే

ఇది అ గ్రహానికి స్వక్షేత్రం. కనుక బాగానే ఉంటుంది. శుక్రుడు కనుక పంచమం లో ఉంటే, క్రియేటివ్ రంగాలలో పని చేసే అవకాశం కలదు లేదా సాఫ్ట్వేర్ రంగాలలో పని చేసే అవకాశం కలదు.|
శని ఉంటే, అభివ్రుధి నిదానం గా కలుగును, సంతానం ఆలస్యంకావచ్చు. రవి, గురుడు కనుక ఉంటే సంతాన సంబందిత సమస్యలు కలుగ వచ్చు.  గురుడు పంచమం లో ఉన్న ధన సంపాదన అధికంగా ఉండును.

కుజుడు పంచమం లో ఉన్న, ఇంజనీరింగ్ వ్రుత్తులు చేపట్టే అవకాశం కలదు. స్టాక్ మార్కెట్ లో విజయాలు లభించును. 

పంచమాధిపతి షష్టం లో ఉంటే

సంతానానికి ఆరోగ్య సమస్యలు,లేదా సంతానం కోసం అధిక కర్చులు చేయవలసి రావచ్చు. సంతానం కలిగాకా, విదేశాలలో లేదా వేరే రాష్ట్రాలలో  ఉద్యోగాలు చేయవలసి రావచ్చు. బుధుడు ఉన్న, వెబ్, యూట్యూబ్ రంగాలలో బాగా రాణిస్తారు.

శుక్రుడు, కుజుడు ఉన్న, ఇంజనీరింగ్ వ్రుత్తులు లేదా ఇంటీరియర్ డిజైనింగ్, సివిల్ ఇంజనీరింగ్ వ్రుత్తులు చేపట్టు అవకాశంకలదు.   ప్రేమ వైఫల్యాలు కలుగు అవకాశం కలదు. బుధుడు, గురుడు, శని ఉన్న లా, ఫైనాన్స్, ఆధ్యాత్మిక రంగాలలో రాణించు అవకాశంకలదు.

పంచమాధిపతి సప్తమం లో ఉంటే

ఇది రాజయోగం. వీరు ప్రేమ వివాహాలు చేసుకొను అవకాశం కలదు లేదా వచ్చిన జీవిత భాగస్వామిని ప్రేమ గా చూసుకొనును. 
శని ఉన్న, జీవిత భాగస్వామిని అర్దం చేసుకొనుట లో సమయం తీసుకొనును.
వీరు ఏ వ్రుత్తిలో నైనా ఉన్నత పదవిను అందుకొనగలరు. వీరు వ్యాపారం లో కూడా ఉన్నత స్తాయి ను చేరుకోగలరు, లాభాలు ఆర్జించుకోగలరు.

పంచమాధిపతి అష్టమం లో ఉంటే

జీవితం లో కష్టములను ఎదుర్కొను అవకాశం కలదు. ఏది సాదించాలి అనుకున్న, దానికి అధిక శ్రమ అవసరం. వీరు ఎక్కువగా రీసెర్చ్ వంటి విద్యలలో లేదా వైద్య వ్రుత్తులలో కానీ,స్తిర పడు అవకాశం కలదు.

శని, కుజ, చంద్రులు ఈ స్థానం లో ఉంటే, వైద్య రంగం లేదా తత్సమాన వ్రుత్తులలో రాణించే అవకాశం కలదు. గురుడు ఉన్న, ఫైనాన్స్ రంగాలలో రాణిస్తారు. బుధుడు ఉన్న రచనా సామర్ద్యం కలిగి ఉంటారు.
అష్టమం లో ఉన్న గ్రహాలు ద్వితీయం చూస్తాయి కాబట్టి, ధన సంపాదన లో ఒకో సారి అభివ్రుద్ది, ఒకో సారి వ్యయములు కలుగును.

పంచమాధిపతి నవమం లో ఉంటే

వీరు ఉన్నత చదువులు చదువుతారు. రీసెర్చ్ చేసే అవకాశం కలదు. వీరు ఆచారాలు, సాంప్రదాయాలు ఎక్కువగా పాటిస్తారు. శని ఉన్న, క్రమశిక్షణ తో జీవితం ఉండటమే కాకుండా, వీరి సంతానం పట్ల కూడా క్రమశిక్షణ తో వ్యవహరిస్తారు.

గురుడు ఈ స్థానం లో ఉన్న, ధన సంపాదన బాగుండును. రవి ఉన్న, ప్రభుత్వ ఉద్యోగములు చేయు అవకాశం లేదా ఉద్యోగం లో అధికారి స్థాయి హోదా అనుభవిస్తారు.

బుధుడు, శుక్రుడు ఉన్న, టెక్నికల్ విద్య యందు రాణిస్తారు. వీరు, తీర్థ యత్రలు లేదా ట్రావెలింగ్ అంటే ఇష్టపడతారు.

పంచమాధిపతి దశమం లో ఉంటే

ఇది రాజయోగం. శుక్రుడు ఈ స్థానం లో ఉన్న, ఇంజనీరింగ్ రిలేటడ్ వ్రుత్తులలో రాణిస్తారు, క్రియేటివ్ రంగాలలో కూడా రాణిస్తారు. గురుడు, ఉన్న, టిచింగ్ వ్రుత్తులలో రాణించే అవకాశం కలదు. బుధుడు ఉన్న సాఫ్ట్వేర్ రంగం లో వ్రుత్తులు చేపట్టే అవకాశం కలదు.వీరికి సంతానం కలిగిన తర్వాత ఉద్యోగం లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు.

పంచమాధిపతి ఏకాదశం లో ఉంటే

ఇది లాభ స్థానం. ఈ స్థానం లో పాప గ్రహాలు యోగిస్తాయి.
శుక్రుడు ఉన్న, ప్రేమవివాహం అయ్యే అవకాశం కలదు, లేదా భార్య పై అమిత ప్రేమ కలిగి ఉంటారు.
బుధుడు , కుజుడు ఉన్న, వ్రుత్తి యందు లాభాలు కలుగుతాయి.
శని ఉన్న, లాభాలు కలిగించడం లో ఆలస్యం చేస్తాడు కాని లాభాలు మాత్రం ఇస్తాడు. సంతానం కలగడం లో ఆలస్యం చేస్తాడు.
శుక్రుడు క్రియేటివ్ రంగాలలో ద్వారా కానీ, టెక్నికల్ రంగాల ద్వారా కానీ, లాభాలు ఆర్జిస్తారు. కుజుడు, గురుడు, బుధుడు ఉన్న, స్టాక్ మార్కెట్ ధన లాభాలు కలిగే అవకాశం కలదు.

పంచమాధిపతి ద్వాదశం లో ఉంటే

శుక్రుడు ఉన్న, ప్రేమ విఫలం అయ్యే అవకాశాం కలదు. సంతానం కలగటానికి,లేదా కలిగిన సంతానం ఆరోగ్యం కోసం కానీ, ధన వ్యయం చేయవలసి రావచ్చు.

వీరు సంతానంకలిగున తరువాత, విదేశాలకు వెళ్ళు అవకాశం కలదు లేదా సంతానం విదేశాలలో స్తిర పడు అవకాశం కలదు. వీరు స్టాక్ మారెట్ ల ద్వారా నష్టాలను చూస్తారు కాబట్టి, వీరు స్టాక్ మార్కెట్ లలో పెట్టుబడి పెట్టకపోవటం ఉత్తమం.

శుక్రుడు, చంద్రుడు, బుధుడు ఉన్న, వ్రుత్తి యందు రాణించే అవకాశం కలదు.
వీరు ఎక్కువగా రీసెర్చ్, మెడికల్ రంగాలలో రాణిస్తారు. శని ఉన్న, భూగర్భ శాస్త్రం, గనులు లేదా, వైద్య రంగాలలో ఉన్నతిని సాధిస్తారు.

కుజుడు, రవి ఉన్న, నిద్ర లేమి సమస్యలు కలుగును. 

***

No comments:

Post a Comment

Pages