జ్యోతిష్య పాఠాలు - 12 - అచ్చంగా తెలుగు

జ్యోతిష్య పాఠాలు - 12

PSV రవి కుమార్  




పాఠం -  12

 

షష్టమాధిపతి ద్వారా రోగలు, శత్రువులు, కోర్టు తగాదాలు, అప్పులు వంటి విషయాలు తెలుసుకోవచ్చు.

షష్టమాధిపతి లగ్నం లో ఉంటే:

అనారోగ్య సమస్యలు, శత్రు సమస్యలు వంటివి ఉండచ్చు. ఇతర గ్రహబలాలు బాగుంటే ఇటువంటి సమస్యలు ఇబ్బంది పెట్టకపోవచ్చు.కుజుడు షష్టమాధిపతి అయ్యి, లగ్నం లోఉంటే, డాక్టర్లు గా కానీ, పోలీస్ వ్యవస్త లో ఎదయినా వ్రుత్తి చేపట్టు అవకాశం కలదు.బుధ, గురులు ఉన్న లాయర్ వ్రుత్తి గానీ, ఫైనాన్స్ రంగం లో ఎదయిన వ్రుత్తి చేపట్టు అవకాశం కలదు.వీరు జీవితం లో ఉన్నత స్థాయి కి ఎదగడానికి కష్టపడాలి. 

షష్టమాధిపతి ద్వితీయం లో ఉంటే:

అప్పులు ఎక్కువగా ఉండు అవకాశం. అప్పుడప్పుడు కుటుంబ సభ్యులతో వాదనలు చేయు అవకాశం కలదు. కుటుంబ సభ్యులలో ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్య.

శని, చంద్రుడు ఉన్న, వైద్య వ్రుత్తి లేదా తత్సంబందిత వ్రుత్తుల ద్వారా ధన సంపాదన.  రవి ఉన్న ప్రభుత్వ ఉద్యోగం లేదా ఎదయినా రంగం లో ఎడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో వ్రుత్తి చేపట్టును. ద్వితీయం లో రవి, కుజుడు ఉన్న, వీరి మాటతీరు కాస్త డామినేట్ చేసినట్టు గా ఉండును.

షష్టమాధిపతి త్రుతీయం లో ఉంటే:

వీరికి తమ్ముడు లేదా చెల్లెలు ఉంటే వారికి ఆరోగ్య సమస్యలు కలగవచ్చు లేదా వారితో తరచు గొడవలు ఉండవచ్చు. బుధుడు త్రుతీయం లో ఉన్న, జర్నలిస్ట్ గా ఉండవచ్చు. లేదా లీగల్ సంబందిత వ్రుత్తులు చేపట్టవచ్చు. గురుడు ఉన్న ఆర్దిక సంబందిత వ్రుత్తులు చేపట్టును. కుజుడు ఉన్న, పోలీస్ సంబందిత వ్రుత్తులు, శుక్రుడు ఉన్న, పురుషుడు అయిన స్త్రీలతో,  స్త్రీలయిన పురుషులతో వాదనలు జరగవచ్చు.

షష్టమాధిపతి చతుర్దం లో ఉంటే:

షష్టమాధిపతి చతుర్దం లో ఉంటే, తల్లి కి అనారోగ్యం లేదా, తల్లి తో తగవులు ఉండవచ్చు. వీరు వాహనాలు నడుపు విషయం లో జాగ్రత్త వహించటం మంచిది. విద్యనభ్యసించు విషయం లో కాస్త ఇబ్బందులు కలగవచ్చు.

చంద్రుడు, శని ఉన్న, మెడికల్, బయాలజీ తత్సంబంతిత విద్యనభ్యసించి ఆ రంగాలలో వ్రుత్తి చేపట్తే అవకాశం కలదు. గురుడు ఉన్న ఆర్దిక రంగం సంబందించిన వ్రుత్తులలో ఉండును. 

షష్టమాధిపతి పంచమం లో ఉంటే:

వీరికి ప్రేమ విషయములలో గొడవలు జరుగు అవకాశం కలదు. పిల్లల ఆరోగ్యం కోసం లేదా వారి అవసరాలకోసం అధికం గా ఖర్చు చేయవలసి రావచ్చు. వీరి పిల్లలు, విదేశాలకు వెళ్ళు అవకాశం కలదు.   శని ఉన్న,  పిల్లలకు ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. గురుడు ఉన్న, సంతానం ఆలస్యం గా కలగవచ్చు.

షష్టమాధిపతి షష్టం లో ఉంటే:

వీరికి సమస్యలు వచ్చిన అనంతరం విజయం లభిస్తుంది. గురుడు ఉన్న ఆర్దిక రంగం లో వ్రుత్తి చేపట్టును. కుజుడు ఉన్న, వైద్య వ్రుత్తి లేదా, పోలీస్ వ్రుత్తులలో ఉండవచ్చు. చంద్రుడు మానసిక ఆరోగ్య సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు కలగవచ్చు. శని ఉన్న అధిక శ్రమ కలిగిన తర్వాత విజయం లభిస్తుంది. రవి ఉన్న, ప్రబుత్వ ఆసుపత్రి తత్సంబందిత రంగాలలో ఉద్యోగం దొరకవచ్చు. తండ్రి కి అనరోగ్య సమస్యలు కానీ, లేదా తండ్రి తో తరచూ వాదనలు చేయవచ్చు. 

షష్టమాధిపతి సప్తమం లో ఉంటే:

ఇటువంటి వారికి జీవిత భాగస్వామి తో భేదాభిప్రాయాలు కలుగు అవకాశములు ఎక్కువ. శని ఉన్న, జీవిత భాగస్వామి ని అర్దం చేసుకొనుటకు చాలా సమయం తీసుకొనును. గురుడు ఉన్న, తరచు గొడవలు. ఏ గ్రహం ఉన్ననూ, వాటి కారకత్వములు బట్టి ఇబ్బందులు కలిగించును.

షష్టమాధిపతి అష్టమం లో ఉంటే:

ఇటువంటి వారికి జీవితం లో ఇబ్బందులు ఎదురయిన తరువాత, విజయం కలుగుతుంది. వీరికి ఏ విషయాన్నయినా క్షుణ్ణంగా తెలుసుకోవాలనే తాపత్రయం ఉంటుంది. కుజుడు ఉన్నట్టయితే, వీరు సర్జన్లు గా కానీ, పనిముట్లు ఉపయోగించి సంపాదించే వ్రుతులలో కానీ రాణించును.

గురుడు ఉన్న, ఆర్దిక రంగాల వ్రుత్తులలో రాణించును. శని ఉన్న, మెడికల్ తత్సంబందిత విషయాలపై ఆసక్తి కలిగి ఉండును. వీరికి జీవితం లో ఆకస్మికం గా లాభాలు, నష్టాలు కలుగును.

షష్టమాధిపతి నవమం లో ఉంటే:

వీరు, ధర్మాచరణ తో జీవితం సాగించును. వీరికి ఏ గ్రహం ఉండునో ఆ గ్రహ కారకత్వాన్ని, బట్టి ఉన్నత విద్య ను అభ్యసించును.

గురుడు ఉన్న, ఫైనాన్స్ లో ఉన్నత విద్య, బుధుడు ఉన్న, లెక్కలు, జర్నలిజం, రచనలు, కుజుడు ఉన్న ఇంజనీరింగ్ విద్య.వీరికి తండ్రి తో తరచు వాదనలు జరుగుట లేదా తండ్రి కి ఆరోగ్య సమస్యలు కలుగుట ఉండవచ్చు.

షష్టమాధిపతి దశమం లో ఉంటే:

వీరి వ్రుత్తిలో తరచూ పోటీ పడవలసి రావచ్చు లేదా వ్రుత్తి లో అప్పుడపుడు సమస్యలు కలుగవచ్చు. శని, చంద్రుడు ఉన్న, వైద్య లేదా తత్సంబందిత వ్రుత్తి లో ఉండును. కుజుడు ఉన్న, ఇంజనీరింగ్ సంబందిత వ్రుత్తులు ఇస్తాడు. బుధుడు ఉన్న, సాఫ్ట్వేర్ రంగం, లేదా వ్రాత పని లో ఉండవచ్చు. గురుడు ఉన్న, ఫైనాన్స్ రంగం, లేదా, టీచింగ్ వ్రుత్తి లో ఉండవచ్చు.

షష్టమాధిపతి ఏకాదశం లో ఉంటే:

వీరికి ప్రేమ విషయం లో ఇబ్బందులు ఎదురవుతాయి. వీరి సంతానానికి ఆరోగ్య సమస్యలు. శని వీరికి మెడికల్ సంబందిత వ్రుత్తుల ద్వరా లాభాలను కలిగిస్తాడు. చంద్రుడు ఉన్న తల్లి తో సత్సంబందం, బయాలజీ సంబందిత సబ్జెక్ట్ లో మంచి జ్ఞానం కలుగుతుంది.

శుక్రుడు బుధుడు, కుజుడు ఉన్న, సాఫ్ట్ వేర్ రంగాలలో రాణించును.

షష్టమాధిపతి ద్వాదశం లో ఉంటే:

ఈ జాతాకులకు కూడా ఇబ్బందులు ఎదురయిన పిమ్మటే విజయాలు కలుగును.

చంద్రుడు ఉన్న, వీదేశీ యానం లేదా పుట్టిన ప్రదేశం నుండి దూరం లో నివశించు అవకాశం. గురుడు ఉన్న, తీర్థ యాత్రలపై ఆసక్తి, ధర్మాచరన, ఆశ్రమాలకు వెళ్ళుట, అక్కడి కార్య కలాపాలలో పాల్గొనుట ఉండును.

వీరిలో కొంతమంది లాయర్లు జైలర్లు తత్సంబందిత వ్రుత్తులలో ఉండును. 

***

No comments:

Post a Comment

Pages