ఉత్కంఠభరితమైన జానపద నవల - శంతలి - అచ్చంగా తెలుగు

ఉత్కంఠభరితమైన జానపద నవల - శంతలి

Share This
ఉత్కంఠభరితమైన జానపద నవల - శంతలి
భావరాజు పద్మిని 




జానపద నవలలంటే ఎవరికి ఇష్టముండదు? 

ఈ మధ్య కాలంలో ఎన్నో పనులు ఉన్నా కూడా అవన్నీ పక్కకుపెట్టి ఏకబిగిన చదివించేలా చేసిన చక్కని పుస్తకం శంతలి. ఇంత మంచి పుస్తకాన్ని అందించిన రచయత శెట్టిపల్లి అరుణా ప్రభాకర్ గారికి అభినందనలు.‌ ఇంతకీ ఈ నవలలో నేపధ్య ఏమిటంటే...

కళావతీనగరంలో ప్రతి సంవత్సరం జరిగే రథయాత్రలో ప్రమాదాలు చోటుచేసుకుంటాయి, కొంతమంది ప్రాణాలు కూడా కొల్పోతారు. అయితే ఆ గ్రామస్తులు అదంతా ఏవో దుష్ట శక్తుల ప్రభావమని నమ్ముతూ జంతుబలులు చేస్తున్నారు తప్పితే కారణాలు శాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చెయ్యడం లేదు. 

 బహుధాన్యపురంలో బకాసురుడి గుహలు ఉన్నాయి. అక్కడి ప్రజలను బకాసురుడి ఆత్మ అక్కడ తిరుగాడుతుందని భయభ్రాంతులకి గురిచేస్తూ పాలకులే దొంగ సన్యాసులచేత చెప్పించి దోపిడీ చేస్తున్నారు. 

 కదంబనగరంలో రాజ్యంలో ఆర్గళాదేవి ఆలయం ముందున్న త్రిశూలం మీద దూకి ప్రాణత్యాగం చేసుకుంటే మానవాతీత శక్తులు లభిస్తాయని ప్రచారంలో ఉంది. కొందరు అలా దూకి ప్రాణాలు కూడా కోల్పోయారు. 

కాలచూర దేశపు రాజు సహస్రజిత్తు దుష్టుడు, అనుభవ శూన్యుడు. ప్రజలని హింసిస్తున్నాడు. తన కామదాహానికి కన్నెపిల్లల్ని బలిచేస్తున్నాడు. 

దండకారణ్య ప్రాంతంలో నదీ లోయల్లో వజ్రాల గనులను ఆక్రమించుకుని కొందరు కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తున్నారు. మార్గస్తులని బంధించి బానిసలుగా మార్చి గనుల్లో పనిచేయిస్తున్నారు. ఈ అక్రమాలకు పాలకుల అండ ఉండడం చాలా శోచనీయం.  

దక్షిణాపథం పొలిమెరల్లో ఒక యువకుడు పరిమళానందస్వామి అనే పేరుతో శిష్యులకు వైరాగ్యాన్ని బోధిస్తూ గృహస్థాశ్రమానికి వ్యతిరేకంగా సన్యాసుల్ని తయారు చేస్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే సామాన్య జనాలు ఎంత అజ్ఞానంలో ఉన్నారో, ఎంత అధైర్యంగా ఉన్నారో బోధ పడుతుంది.  

  ఆదర్శ భావాలు కల తన‌మావయ్య నీలకంఠశాస్త్రి, అతని ఆదర్శాలకు అనుగుణంగా తనని తాను అనేక అరుదైన విద్యల్లో తీర్చి దిద్దుకున్న బావ శ్రీకంఠల శిక్షణ ఫలితంగా సబలగా తయారయ్యింది శంతలి. అనుకోని ఆపదకు గురైన తన బావను రక్షించుకోవడం కోసం అర్ధరాత్రి ఒంటరిగా బయల్దేరిన శంతలి, తన అసమాన మేధస్సుతో, ధైర్యసాహసాలతో ఆయా దేశాలలోని సమస్యలను ఎలా తీర్చింది? 

ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే!

*పుస్తకం ధర: 120rs. పోస్టల్ చార్జీలు భారతదేశంలో ఎక్కడికైనా 50rs అదనం.*

పుస్తకం దిగువ లింక్ లో కొనండి:
https://books.acchamgatelugu.com/product/shantali-%e0%b0%b6%e0%b0%82%e0%b0%a4%e0%b0%b2%e0%b0%bf%e0%b0%9c%e0%b0%be%e0%b0%a8%e0%b0%aa%e0%b0%a6-%e0%b0%a8%e0%b0%b5%e0%b0%b2/


లేక కొనుగోలు కోసం దిగువ నెంబరును సంప్రదించండి.
8558899478(WhatsApp only)

No comments:

Post a Comment

Pages