శ్రీధరమాధురి -90
(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)
ఆఫీస్ లో జరిగే అన్ని విషయాలను భర్త ఇంటివద్ద ఉన్న భార్యకు చెప్పడం
చాలా హాస్యాస్పదమైన అంశం. కొన్నిసార్లు ఆఫీస్ నుంచే ఇంటివద్ద ఉన్న ఆమెకు
రన్నింగ్ కామెంటరీ ఇవ్వడం జరుగుతుంది. ఆఫీస్ ఆఫీసే, ఇల్లు ఇల్లే. ఆఫీస్ విషయాలను
ఇంట్లో, ఇంటి విషయాలను ఆఫీస్ లో
చర్చించకండి. ఇల్లు వ్యక్తిగతమైనది. ఆఫీస్ బహిరంగమైనది. రెండిటిని కలపకండి.
దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. వీకెండ్లలో కొన్నిసార్లు ఆఫీస్ కొలీగ్స్ అంతా
కలిసి కుటుంబాలతో పిక్నిక్ కు వెళ్తారు. ఇది పూర్తిగా గారెంటి లేనిది. మీకు
ఇప్పుడు అర్థం కాదు. కాని ఏదో ఒక రోజు తప్పకుండా అర్థం అవుతుంది. భార్య, భర్త ఒకే ఆఫీస్ లో పనిచేస్తే, పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది.
మీకు ప్రశాంతత కావాలంటే, ఆఫీస్ విషయాలను ఇంటివద్ద మాట్లాడకండి. ఇంటికి వచ్చాకా ఆఫీస్
సమస్యలను తమ భాగస్వామితో చెప్పడం వల్ల ఎన్నో సమస్యలు ఎదురవడం నేను చూస్తున్నాను.
మీరు ఇంటికి వచ్చారంటే, ఇక అన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉండాలి. ఆఫీస్ గురించి ఏమీ ఉండకూడదు.ఈ
రోజుల్లో వర్క్ ఫ్రం హోం చూస్తున్నాము. అదింకా దారుణం. మీ కెరీర్, ఆఫీస్ ఎంత ముఖ్యమైనా కూడా, మీ వ్యక్తిగత చోటును త్యాగం
చెయ్యకండి.నిజానికి మీ వ్యక్తిగత జీవనంలో మీరు పొందే స్వేచ్ఛ, ఆనందం, ఆఫీస్ లో మీరు మరింత మెరుగ్గా పని
చేసేందుకు ఉపయోగపడాలి. అంతా దైవానుగ్రహం, దయ.
0 గురువు.
1 శిష్యుడు.
ద్విసంఖ్యలు.
నెమ్మదిగా గర్వం పెరిగిన శిష్యుడు, తన జీవితంలో గురువు యొక్క ఉనికిని మర్చిపోతాడు. 1, 2 అవుతుంది 3 అవుతుంది, 4 ,8 ,9 ... ఇలా పెరుగుతుంది. అప్పుడు అతనికి ఏం చేయాలో తెలీదు. అతను గురువు వద్దకు వస్తాడు. గురువు తిరిగి 1కి వెళ్ళమంటారు. అప్పుడతను పూర్తిగా శరణు వేడినట్లుగా నటిస్తాడు. గురువుకది తెలుసు కనుక నవ్వుతారు. అతని పక్కన నిలబడతారు. అప్పుడు 9, 10 అవుతుంది. మళ్ళీ అతడు గురువుని మర్చిపోతాడు. 10, 11, 12, 13 అలా 19 కి చేరతాడు. గురువు 1 కి చేరమంటే అతడు నటించడం వల్ల 2 కు చేరతాడు. గురువు అతనితో చేరి 20 అవుతారు. 20, 21ఇలా కొనసాగుతూ ఉంటుంది. గురువు నవ్వుతూ ఉంటారు. అవి 0, 1 గా ఉన్నప్పుడు గురువుకు ఎక్కడో ఆశ ... ఈ శిష్యుడు ఏదో ఒక రోజున 0 గా మారి గురువు అవుతాడని అనుకుంటారు. కానీ ఆ ఆశ అడియాస అవుతుంది. ప్రతి స్థాయిలో, శిష్యుడు అహంతో ఎగిరిపడుతున్నా కూడా, గురువు అతనితో చేరి అతని విలువను పెంచుతారు. కానీ ఆ విలువ గర్వానికి, అహానికి మాత్రమే దారి తీస్తుంది. గురువు ఎల్లప్పుడూ '0' గానే ఉండేందుకు ఇష్టపడతారు. అంతా దైవానుగ్రహం, దయ.
***
హృదయపూర్వకమైన
ప్రార్ధనలకు దైవం సమాధానమివ్వడం నేను చూసాను. దేవుడు U – టర్న్ లను అనుమతిస్తారని
నేను తెలుసుకున్నాను. అంతా దైవానుగ్రహం, దయ.
***
No comments:
Post a Comment