ఏమి సేతు నిందుకు మందేమైన బోయ రాదా... - అచ్చంగా తెలుగు

ఏమి సేతు నిందుకు మందేమైన బోయ రాదా...

Share This

ఏమి సేతు నిందుకు మందేమైన బోయ రాదా...

వివరణ: డా.తాడేపల్లి పతంజలి 




రేకు: 0335-03 సం: 04-204

పల్లవిఏమి సేతు నిందుకు మందేమైన బోయ రాదా

సామజగురుడ నీతో సంగమొల్ల దేటికే

.1: మాయలసంసారము మరిగిన కర్మము

ఈయెడ నిను మరుగ దేటికో హరి

కాయజకేలిపైదమిగలిగిన మనసు

కాయజుతండ్రి నీపైగలుగ దిదేఁటికే

.2: నాటకపుగనకము నమ్మినట్టిబదుకు

యేటికి నీభక్తి నమ్మదేలే హరి

గూటబడే పదవులు గోరేటిజీవుడు

కూటువైననిజముక్తి గోరడిది యేఁటికే

.3: పాపపుణ్యములకె పాలుపడ్డ నేను

యేపున నీపాలజిక్క నేలకో హరి

శ్రీపతివి నాలోని శ్రీవేంకటేశుడ

నీపేరివాడ నాకు నిండుమాయ లేటికే


భావం

పల్లవి:

సామజగురుడ(ఏనుగును కాపాడినవాడా !)వేంకటేశ్వరా !  ఏమి చేయాలో అర్థం కావటంలేదునీతో కలిసి ఉండటానికి నాకు ఇష్టం కావటంలేదుఎందుకంటావ్ఇలా కాకుండా ఉండాలంటే  మందేమైనా ఉంటే నా చేత తాగించు.


.1:

ఓ హరీ !ఈ మాయలసంసారమును  మరిగిన(మోహించు) కర్మము నిను మరగదెందుకు?

 కాయము నుండి పుట్టిన మన్మథుని ఆటపై(రతికేళి) ఆసక్తి కలిగిన నా మనస్సుకాయము నుండి పుట్టిన మన్మథుని తండ్రివైన  నీపై  ఆసక్తి చూపించదు ఎందుకు?


.2:

ఓ హరీ నాటకాలాడించే బంగారమును  నమ్మినట్టి బతుకు ఎందుకు నీభక్తిని నమ్మదు?

జీవితాన్ని ఒక దారిలోపడేటట్లు చేయు స్థిమితపడేటట్లు చేయు పదవులు కోరే జీవుడు శుభముల పోగయిన నిజముక్తిని కోరడుఎందుకో !


.3:

శ్రీ హరీ పాపపుణ్యముల స్వాధీనమైన నేనునీ స్వాధీనము కానుఎందుకో?

శ్రీపతివి నువ్వు.నాలోని శ్రీవేంకటేశుడ!నీ పేరు పేర్కొనువాడను. నాకు నీ నిండుమాయలు ఎందుకు? ( మాయలు తొలగించమని ప్రార్థన)


***

No comments:

Post a Comment

Pages